Walk Benfits : భోజనం చేశాక 10 నిమిషాలు నడవాలి..! ఇలా చేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..
Walk Benfits : ఆరోగ్యకరమైన జీవనశైలికి మంచి ఆహారం చాలా ముఖ్యం. అయితే భోజనం చేశాక పొట్ట నిండుగా అనిపిస్తుంది.
Walk Benfits : ఆరోగ్యకరమైన జీవనశైలికి మంచి ఆహారం చాలా ముఖ్యం. అయితే భోజనం చేశాక పొట్ట నిండుగా అనిపిస్తుంది. అప్పుడు మీరు తేలిక చేసుకోవడానికి ఒక పది నిమిషాలు వాకింగ్ చేయొచ్చు. భోజనం చేసిన వెంటనే పడుకోవడం వల్ల చాలా సమస్యలు వస్తాయి. గుండెల్లో మంట, ఆమ్లత్వం సమస్యలు తలెత్తుతాయి. అందుకే క్రమం తప్పకుండా నడవడం చాలా ముఖ్యం. తిన్న తర్వాత నడక గుండె జబ్బుల సమస్యను తగ్గిస్తుందని మీకు తెలుసా? ఒక అధ్యయనంలో 30,000 మందిపై పరిశోధనలు చేశారు. ఇందులో రోజూ అరగంట సేపు నడవడం వల్ల గుండె జబ్బుల నుంచి 20 శాతం రక్షణ పొందవచ్చని తేలింది.
అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆహారం తిన్న తర్వాత ఒక పది నిమిషాలు నడవాలి. అది కూడా నెమ్మదిగా చేస్తే సరిపోతుంది. కానీ ఫాస్ట్‌గా నడవడం లేదా జాగింగ్ చేయడం వంటివి చేస్తే కడుపు నొప్పి, ఉబ్బరం కలుగుతుందని గుర్తించుకోండి. ప్రారంభంలో 5 నుంచి 6 నిమిషాలు నడవండి. కొన్ని రోజుల తరువాత మీరు 10 నిమిషాలు నడవవచ్చు. బయటికి వెళ్లాలని మీకు అనిపించకపోతే మీరు ఇంటి లోపల నడవవచ్చు. గది నుంచి గదికి లేదా బాల్కనీలో10 నిమిషాలు నడిస్తే సరిపోతుంది. మీరు భోజనం తర్వాత ఉబ్బరంగా ఉంటే నడక చాలా ముఖ్యం.
ఇది జీర్ణక్రియ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. దీని ద్వారా అపానవాయువు, అతిగా తినడం సమస్యను నివారించవచ్చు. భోజనం చేసిన తర్వాత మీరు కూర్చుని లేదా పడుకుంటే ఆమ్లత్వం సమస్య వస్తోంది. నడక జీవక్రియను పెంచుతుంది. కేలరీలను బర్న్ చేస్తుంది. ఇది భోజనం తర్వాత తీపి ఆహారం తినడం వంటి కోరికను తగ్గిస్తుంది. ఇది కాకుండా రక్త ప్రసరణను పెంచడానికి పనిచేస్తుంది. దీనివల్ల మీరు హుషారుగా ఉంటారు. ఆహారం తిన్న తర్వాత చక్కెర స్థాయి పెరుగుతుంది కనుక డయాబెటిక్ రోగి 10 నిమిషాలు నడవాలని సూచించారు. కొన్ని అధ్యయనాలలో భోజనం తర్వాత నడవడం చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుందని కనుగొన్నారు.
నడక ఆరోగ్యానికి మంచిది అయితే మనం ఎంతసేపు నడవాలి? మీరు రోజుకు 30 నిమిషాలు నడవాలి. ఆహారం, భోజనం, విందు తర్వాత 10 నిమిషాల నడక సరిపోతుంది. మీకు కావాలంటే 15 నిమిషాలు నడవవచ్చు. కానీ దీనికంటే ఎక్కువ నడవడం ప్రయోజనకరం కాదు. ఆహారం తిన్న తర్వాత కేవలం10 నిమిషాలు నడవడం వల్ల బరువు తగ్గవచ్చు, జీర్ణక్రియ బలపడుతుంది. కడుపు నొప్పి సమస్యల నుంచి బయటపడవచ్చు.