Health Tips: నాన్‌వెజ్ తినకపోతే ఈ సమస్యలు తప్పవట.. ఏమవుతుందో తెలుసా..?
ఈ మధ్యకాలంలో చాాలా మంది శాకాహారులుగా మారుతున్నారు. మాంసంతో ఆరోగ్యానికి హానికరమంటూ ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. అయితే ఓ సర్వే మాత్రం.. శాకాహారులకు కొన్ని ఆరోగ్య సమస్యలు తప్పవని అంటుంది. మీరు శాకాహారులైతే.. మీకు ఏ ఏ ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

మనం తినే ఆహారం మన ఆరోగ్యం గురించి చెబుతుంది. ఆహారపు అలవాట్లు మన ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతాయి. కాబట్టి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. చాలా మంది ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం శాఖాహారాన్ని ఎంచుకుంటారు. శాకాహారం ఆరోగ్యానికి మంచిది అని అంటారు. అయితే ఒక కొత్త అధ్యయనం ప్రకారం.. పూర్తిగా శాకాహారం అలవాట్లు కొన్ని ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు.
ఎముకలు, గుండెకు ప్రమాదం..?
ఫ్రాన్స్‌లోని ANCES చేసిన ఒక పరిశోధన ప్రకారం.. శాకాహారులకు ఎముకలు, గుండె బలహీనపడే ప్రమాదం ఉంది. ఈ అధ్యయనం ప్రకారం.. శాకాహారులలో కొన్ని ముఖ్యమైన పోషకాలు లోపిస్తున్నాయని వెల్లడైంది.
ఏ పోషకాలు లోపిస్తున్నాయి?
శాకాహారం తినేవారిలో తరచుగా కాల్షియం, విటమిన్ డి, ఐరన్, విటమిన్ బి12, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ లోపం ఉంటున్నట్లు సర్వేలో తేలింది. ఈ పోషకాలు శరీర నిర్మాణం, ఎముకల బలం, గుండె ఆరోగ్యం కోసం చాలా అవసరం. ఈ లోపాల వల్ల గుండె, ఎముకలు బలహీనపడతాయి.
టైప్ 2 డయాబెటిస్, ఎముక పగుళ్లు
ఈ అధ్యయనం ప్రకారం.. శాకాహారులకు టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. అదే సమయంలో మాంసాహారులలో ఈ వ్యాధి వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని నివేదిక పేర్కొంది. శాఖాహార ఆహారంలో విటమిన్ డి, విటమిన్ బి12 లోపం ఉండటం వల్ల, ఆర్థరైటిస్, ఎముకల పగుళ్ల ప్రమాదం కూడా పెరుగుతుంది.
పరిష్కారం ఏమిటి?
శాకాహారులకు ఈ సమస్యలు ఉన్నప్పటికీ వాటిని నివారించడానికి మార్గాలు ఉన్నాయి. మీ ఆహారంలో ఈ పోషకాలు లభించే ఆహార పదార్థాలను చేర్చుకోవడం ద్వారా ఈ సమస్యలను అధిగమించవచ్చు.
విటమిన్ B12: పుట్టగొడుగులు, పోషక ఫుడ్స్.
కాల్షియం, విటమిన్ డి: పాలు, పెరుగు, పనీర్, సూర్యరశ్మి.
ఐరన్: ఆకుకూరలు, బీన్స్, పప్పులు.
ఒమేగా-3: అవిసె గింజలు, చియా గింజలు, వాల్‌నట్‌లు.
మొత్తానికి కేవలం శాకాహారం తీసుకోవడం వల్ల కలిగే నష్టాలను సరియైన పోషకాహారం, సప్లిమెంట్స్ ద్వారా అధిగమించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా.. వైద్య నిపుణుడి సలహా తీసుకోవడం మంచిది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




