- Telugu News Photo Gallery Mutton Spleen: The Rare Delicacy with Incredible Health Benefits for Meat Eaters
Health Tips: మటన్‌లోని ఈ పార్ట్ ఆరోగ్యానికి వరం.. తింటే ఏమవుతుందో తెలుసా..?
నాన్ వెజ్ లేకుండా కొంతమంది అస్సలు ఉండలేరు. కేవలం రుచి కోసమే కాకుండా మాంసాహారంలో పోషకాలు, ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు ఎన్నో ఉన్నాయి. ఈ క్రమంలో మటన్ షాపులో అరుదుగా లభించే ఒక పదార్థం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.. అదే తిల్లి. తిల్లీ అంటే గొర్రె లేదా మేకలో ఉండే ప్లీహం భాగం.
Updated on: Aug 31, 2025 | 8:02 AM

తిల్లీ ఒక అద్భుతమైన ఔషధం అని చెప్పవచ్చు. దీనిలో మన శరీరానికి అత్యంత అవసరమైన పోషకాలైన ఐరన్, విటమిన్ బి12, ఫోలేట్ అధిక మొత్తంలో ఉంటాయి. ఈ పోషకాలు ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి అత్యంత అవసరం.

రక్తహీనత నివారణ: రక్తహీనతతో బాధపడే వారికి వైద్యులు తిల్లీని ఒక బలమైన ఆహారంగా సూచిస్తారు. తిల్లీని ఆహారంగా తీసుకోవడం వల్ల రక్తంలో హీమోగ్లోబిన్ స్థాయిలు వేగంగా పెరిగి ఆరోగ్యం త్వరగా మెరుగుపడుతుంది.

శరీరానికి శక్తి: రక్తహీనతతో పాటు జ్వరం లేదా శస్త్రచికిత్స తర్వాత బలహీనపడిన వారికి, పెరుగుతున్న పిల్లలకు, గర్భిణులకు, వృద్ధులకు ఇది గొప్ప శక్తిని అందిస్తుంది. దీనిలోని ప్రోటీన్లు రోగనిరోధక శక్తిని మెరుగుపరచి, శరీరాన్ని బలోపేతం చేస్తాయి.

వండే విధానం: తల్లీని వండేటప్పుడు దాని పోషక విలువలు తగ్గకుండా చూసుకోవడం ముఖ్యం. సాంప్రదాయ పద్ధతిలో మిరియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి వంటి మసాలాలతో కలిపి వండడం వల్ల దాని రుచి పెరగడమే కాకుండా జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది.

మేక కాలేయంలో కూడా పోషకాలు ఉన్నప్పటికీ, తిల్లీలో ఉండే ప్రత్యేకమైన ప్రోటీన్లు, ఎంజైముల మిశ్రమం రక్తాన్ని మెరుగుపరచడంలో మరింత సమర్థవంతంగా పనిచేస్తుంది. అందువల్ల తిల్లీని కేవలం ఒక వంటకంగా కాకుండా అనేక ఆరోగ్య రహస్యాలను దాచుకున్న ఒక అరుదైన వైద్య నిధిగా పరిగణించవచ్చు.




