AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Constipation: మలబద్ధకం వేధిస్తుందా.? ఆముదంతో ఇలా చేయండి వెంటనే రిజల్ట్‌..

అందులో ప్రధానమైంది ఆముదం. ఆముదం ప్రతీ ఒక్కరికీ అందుబాటులో ఉంటుంది. ఇంతకీ ఆముదంతో మల బద్ధకానికి ఎలా చెక్‌ పెట్టవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ఆముదం పేగుల్లో మలాన్ని సులువుగా కదిలేగా చేస్తుంది. పేగు కదలికలను సులభతరం చేస్తుంది. ఆముదంలో రిసినోలిక్ యాసిడ్ ఉంటుంది, ఇది పేగు గోడలను ప్రేరేపిస్తుంది...

Constipation: మలబద్ధకం వేధిస్తుందా.? ఆముదంతో ఇలా చేయండి వెంటనే రిజల్ట్‌..
Constipation
Narender Vaitla
|

Updated on: May 11, 2024 | 6:26 PM

Share

మనలో చాలా మంది ఎదుర్కొనే సమస్యల్లో మలబద్ధకం ఒకటి. తీసుకునే ఆహారంలో మార్పులు, ఒత్తిడి, ఫైబర్‌ కంటెంట్‌ తక్కువగా ఉన్న ఫుడ్‌ను తీసుకోవడం వల్ల ఈ సమస్య వేధిస్తుంది. దీంతో ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఎన్నో మార్గాలను వెతుక్కుంటారు. కొందరైతే మందులు కూడా వాడుతుంటారు. అయితే మందులకు బదులు సహజ విధానంలో కూడా మలబద్ధకం సమస్యకు చెక్‌ పెట్టొచ్చు.

అందులో ప్రధానమైంది ఆముదం. ఆముదం ప్రతీ ఒక్కరికీ అందుబాటులో ఉంటుంది. ఇంతకీ ఆముదంతో మల బద్ధకానికి ఎలా చెక్‌ పెట్టవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ఆముదం పేగుల్లో మలాన్ని సులువుగా కదిలేగా చేస్తుంది. పేగు కదలికలను సులభతరం చేస్తుంది. ఆముదంలో రిసినోలిక్ యాసిడ్ ఉంటుంది, ఇది పేగు గోడలను ప్రేరేపిస్తుంది. మలబద్ధకం నుంచి ఉపశమనం పొందడంలో ఆముదం నూనె ప్రభావవంతంగా ఉంటుంది.

అయితే ఆముదంను పెద్ద మొత్తంలో తీసుకుంటే మాత్రం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువగా ఆముదం తీసుకుంటే.. కడుపులో తిమ్మిరి, అతిసారం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అలాగే గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే మహిళలు కూడా ఆముదాన్ని తీసుకోకపోవడమే బెటర్‌ అని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ తీసుకోవాల్సి వస్తే వైద్యులను సంప్రదించే తీసుకోవాలి.

ఇంతకీ ఈ ఆముదంను ఎలా తీసుకోవాలంటే.. ఒకటి లేదా రెండు చెంచాల ఆవనూనెను ఉదయం లేదా రాత్రి నిద్రపోయే ముందు ఖాళీ కడుపుతో తీసుకోవచ్చు. ఆముదాన్ని పండ్ల రసం లేదా తేనెతో కలుపుకొని తీసుకోవచ్చు. ఆముదం చేదుగా ఉంటుంది కాబట్టి ఇలా తేనె లేదా పాల వంటి వాటిలో కలుపుకొని తీసుకోవచ్చు. అయితే ఆముదం తీసుకునే ముందు కచ్చితంగా వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం.

ఇదిలా ఉంటే కేవలం ఆముదం మాత్రమే కాకుండా మరికొన్ని సహజ పద్ధతుల్లో కూడా మలబద్ధకాన్ని తగ్గించుకోవచ్చు. వీటిలో ప్రధానమైనవి సరిపడ నీరుతాగాలి. ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయాలి. ప్రతీ రోజూ ఉదయం పడిగడుపున గోరువెచ్చని నీరు నిమ్మకాయ కలిపి తీసుకోవాలి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..