Health Tips: ఎటువంటి కారణం లేకుండా శరీరంలో వాపులు ఈ వ్యాధికి సంకేతం కావచ్చు..! తస్మాత్ జాగ్రత్త..
ఇలాంటి సందర్భాల్లో వెంటనే హెల్త్ చెకప్ చేయించుకోవటం తప్పనిసరి అంటున్నారు వైద్య ఆరోగ్య నిపుణులు. ఈ వ్యాధికి సకాలంలో చికిత్స అందించడానికి క్రమం తప్పకుండా హెల్త్ చెక్ చేయించుకోవడం మంచిది అంటున్నారు. అలాగే, చర్మానికి ఎలాంటి గాయం, ఒత్తిడి వంటివి ఏర్పడ కుండా జాగ్రత్తగా ఉండాలి. దాంతో పాటుగా చర్మం మార్పులను గమనించుకోవాలి. చర్మంపై ఏవైనా కొత్త మార్పులు గమనించినట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించటం ఆలస్యం చేయరాదని చెబుతున్నారు.

చాలా సార్లు మన శరీరంలో ఎటువంటి కారణం లేకుండానే వాచిపోవటం కనిపిస్తుంది. ఈ వాపు కొన్నిసార్లు ఆందోళనకరంగా మారుతూ ఉంటుంది. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, ఆర్టెరియోవీనస్ మాల్ఫార్మేషన్ (AVM), యాంజియోకెరాటోమాస్ వంటి పరిస్థితులు కూడా శరీరంలో వాపును పెంచుతాయి. రక్త నాళాలు అసాధారణ కనెక్షన్‌లను ఏర్పరచుకుని సాధారణ రక్త ప్రవాహానికి ఆటంకం కలిగించినప్పుడు సంభవించే తీవ్రమైన పరిస్థితి ధమనుల వైకల్యం అని అంటున్నారు వైద్య ఆరోగ్య నిపుణులు. కాలక్రమేణా ఇది మరింత నొప్పి, మంటకు దారితీస్తుందని చెబుతున్నారు. అయితే, ఉన్నట్టుండి శరీరంలో ఏర్పడే వాపుకు కారణం.. ఏవీఎం వ్యాధి లక్షణాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..
ఆర్టెరియోవీనస్ వైకల్యం లక్షణాలు:
1. తరచుగా తలనొప్పి, తలతిరగడం
2. చేతులు, కాళ్ళలో బలహీనత, తిమ్మిరి వంటి లక్షణాలు కనిపిస్తాయి.
3. మాట్లాడటంలో ఇబ్బంది
4. వెన్నునొప్పి, కండరాల బలహీనత
5. నొప్పి, వాపు లేదా అసాధారణ రక్తస్రావం
ఆంజియోకెరాటోమా లక్షణాలు
1. ఫోర్డైస్ ఆంజియోకెరాటోమా జననేంద్రియాలను ప్రభావితం చేస్తుంది.
2. హైపర్‌కెరాటోటిక్ పాపుల్స్ లేదా ఫలకాలు
3. కొన్నిసార్లు గాయమైనప్పుడు అధిక రక్తస్రావం జరుగుతుంది
4. చర్మం రంగులో మార్పు.
5. చేతులు, కాళ్ళలో వాపు వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి.
ఇలాంటి సందర్భాల్లో వెంటనే హెల్త్ చెకప్ చేయించుకోవటం తప్పనిసరి అంటున్నారు వైద్య ఆరోగ్య నిపుణులు. ఈ వ్యాధికి సకాలంలో చికిత్స అందించడానికి క్రమం తప్పకుండా హెల్త్ చెక్ చేయించుకోవడం మంచిది అంటున్నారు. అలాగే, చర్మానికి ఎలాంటి గాయం, ఒత్తిడి వంటివి ఏర్పడ కుండా జాగ్రత్తగా ఉండాలి. దాంతో పాటుగా చర్మం మార్పులను గమనించుకోవాలి. చర్మంపై ఏవైనా కొత్త మార్పులు గమనించినట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించటం ఆలస్యం చేయరాదని చెబుతున్నారు.. సరైన రక్త ప్రసరణను నిర్వహించడానికి సరిపడా నీటిని తాగాలి. దీంతో హైడ్రేటెడ్ గా ఉండండి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..








