Flax Seeds For Skin: అవిసె గింజల ఫేస్ ప్యాక్.. ఇలా చేస్తే అద్భుతమైన చర్మ సౌందర్యం మీ సొంతం..
అవిసె గింజలు చర్మం, జుట్టు ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలను అందించే పోషకాలకు శక్తివంతమైన వనరు.ఫ్లాక్‌సీడ్స్‌తో తయారు చేసిన ఫేస్ ప్యాక్ లను వాడటం వల్ల ముఖంపై మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి. స్కిన్ టోన్ మెరుగుపరచడంతో ముఖాన్ని కాంతివంతంగా కనిపించేలా చేస్తుంది. అవిసె గింజల్లోని పోషకాలు చర్మ సంబంధిత సమస్యలను దూరం చేస్తాయి.. ఫ్లాక్ సీడ్స్ చర్మ సౌందర్యానికే కాదు. ముఖ సౌందర్యానికి కూడా అనేక లాభాలను కలిగిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం...
Updated on: Feb 26, 2025 | 2:59 PM

ఫ్లాక్ సీడ్స్‌తో తయారు చేసిన ఫేస్ ప్యాక్ ఉపయోగించటం వల్ల చర్మం, ముఖంపై సెబమ్ ఉత్పత్తిని నియంత్రిస్తుంది. మొటిమలను నివారించడంలో సహాయపడుతుంది. లిగ్నన్లు, యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉన్న అవిసె గింజలు చర్మం ముడతలు, గీతలను తగ్గిస్తాయి. చర్మాన్ని మృదువుగా మార్చేసి ఎల్లప్పూడు తేమగా ఉంచుతాయి.

అవిసె గింజలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కలుషితాలను నిరోధించవచ్చు. చర్మంపై దద్దుర్లు, అలెర్జీల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అవిసె గింజలలో ఉండే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు విషాన్ని బయటకు పంపడంలో సహాయపడతాయి. సోరియాసిస్, చర్మశోథ, ఎరుపు, వాపు వంటి పరిస్థితులను తగ్గిస్తాయి.

అవిసె గింజలలోని ఆల్ఫా-లినోలెనిక్ ఆమ్లం పురుషులలో బట్టతలని ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. అవిసె గింజల్లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి జుట్టు స్థితిస్థాపకతను పెంచుతాయి. జుట్టు విరిగిపోవడాన్ని నివారిస్తాయి. ఫోలికల్స్‌ను బలోపేతం చేస్తాయి.

అవిసె గింజలు హానికరమైన సూర్య వికిరణాన్ని ఫిల్టర్ చేస్తాయి. చర్మ కణజాలాలను రక్షిస్తాయి. అవిసె గింజలలో ఉండే కొవ్వు ఆమ్లాలు తలలోని సెబమ్ స్రావాన్ని నియంత్రిస్తాయి. ఇన్ఫెక్షన్లను నివారిస్తాయి. చుండ్రును కూడా తగ్గిస్తాయి.

అవిసె గింజల్లోని పోషకాలు చర్మ సంబంధిత సమస్యలు రాకుండా చేస్తుంది. ముఖంపై మచ్చలు రాకుండా చేస్తాయి. ఫ్లాక్ సీడ్స్ చర్మ సౌందర్యానికే కాదు. ముఖ సౌందర్యానికి కూడా అనేక లాభాలను కలిగిస్తాయి. ప్రతి రోజు ఉదయం అవిసె గింజలను తినడం వల్ల కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి.




