AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీకు తెలుసా..? ఈ బ్లడ్ గ్రూప్‌ కలిగిన వ్యక్తులది షార్ప్ మైండ్..! వీరు అత్యంత తెలివైనవారట..

ఇప్పుడు మీరు ఈ జాబితాలో ఉన్నారో లేదో చెక్‌ చేసుకోవచ్చు. వాస్తవానికి ఈ సమాచారమంతా ఒక పరిశోధన సమయంలో వెలుగులోకి వచ్చింది. దీనిలో నిపుణుడు దాదాపు 70 మంది రక్త నమూనాలను తీసుకొని వారి మెదడులను పరీక్షించాడు. ఏ బ్లడ్ గ్రూప్ వారి మెదడు ఎక్కువ చురుకైనదో పరిశోధనలో వెల్లడైంది. కానీ, తెలివితేటల పరంగా ఎవరూ వారితో సాటిలేరు. అటువంటి పరిస్థితిలో ఇతర బ్లడ్‌గ్రూపులకు చెందిన వ్యక్తులకు తెలివితేటలు లేవని ఎటువంటి ఊహాగానాలు చేయవద్దు.

మీకు తెలుసా..? ఈ బ్లడ్ గ్రూప్‌ కలిగిన వ్యక్తులది షార్ప్ మైండ్..! వీరు అత్యంత తెలివైనవారట..
Best Blood Group
Jyothi Gadda
|

Updated on: Feb 26, 2025 | 4:46 PM

Share

పదునైనా తెలివి తేటలు కలిగి ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు..అలాగే, చాలా వరకు వ్యక్తుల తెలివితేటలను వారి వ్యక్తిత్వం, రూపాన్ని బట్టి అంచనా వేస్తారు. కానీ, మన బ్లడ్ గ్రూప్ ద్వారా కూడా ఒక వ్యక్తి తెలివితేటలను నిర్ణయించవచ్చునని మీకు తెలుసా..? కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో జరిగిన పరిశోధన ఆధారంగా కొన్ని షాకింగ్‌ విషయాలు వెలుగులోకి వచ్చాయి. కంప్యూటర్ కంటే పదునైన మెదడు పనితీరు కలిగిన వారి జాబితాలో మీరు కూడా ఉన్నారో లేదో తెలుసుకోవాలనుకుంటే.. ముందుగా మీ బ్లడ్‌ గ్రూప్‌ ఏదో చెక్‌ చేసుకోండి. అలాంటి బ్లడ్ గ్రూప్ గురించి ఇక్కడ తెలుసుకుందాం..

1. బి పాజిటివ్:

కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నిర్వహించిన ఒక పరిశోధనలో అన్ని రక్త సమూహాలలో B+ రక్త సమూహం ఉన్నవారి మెదడు అత్యంత పదునైనదని కనుగొనబడింది. వారి ఆలోచనా శక్తి, అవగాహన శక్తి కూడా ఇతరులకన్నా చాలా ఎక్కువని గుర్తించారు. B+ ఉన్నవారి మెదడుల్లో, మెదడులోని సెరెబ్రమ్‌లో పెరిటోనియల్, టెంపోరల్ లోబ్‌లు మరింత చురుగ్గా పనిచేస్తాయి. ఈ కారణంగా ఈ రక్త వర్గం ఉన్న వ్యక్తుల జ్ఞాపకశక్తి చాలా పదునుగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

2. O+ బ్లడ్ గ్రూప్:

ఈ జాబితాలో తదుపరి స్థానంలో O+ బ్లడ్‌ గ్రూప్‌ ఉన్నవారు ఉన్నారు. B+ వ్యక్తుల తర్వాత ఈ బ్లడ్‌ గ్రూప్‌ వారినే అత్యంత చురుకైన మనస్సు కలిగినవారిగా భావిస్తారు. ఈ గ్రూప్‌లోని వ్యక్తుల శరీర ప్రసరణ ఇతర రక్త సమూహాలతో ఉన్న వ్యక్తుల కంటే ఎక్కువగా ఉంటుందని తేల్చారు. దీని వల్ల మెదడులో ఆక్సిజన్ ప్రవాహం కూడా బాగుంటుంది.

ఇతర బ్లడ్‌ గ్రూపులు ఉన్నవారి సంగతేంటి?:

ఈ రెండు బ్లడ్ గ్రూపులు కాకుండా, ఇతర బ్లడ్ గ్రూపుల వ్యక్తులకు మెదడు లేకపోవడం లేదా తెలివితేటలు లేకపోవడం కాదు. ఇది ఒక అధ్యయనం ప్రకారం మాత్రమే చెప్పబడింది. పైన పేర్కొన్న రక్త సమూహాలకు భిన్నంగా ఉండే వ్యక్తులను కూడా మనం చూశాము. కానీ తెలివితేటల పరంగా ఎవరూ వారితో సాటిలేరు. అటువంటి పరిస్థితిలో ఇతర బ్లడ్‌గ్రూపులకు చెందిన వ్యక్తులకు తెలివితేటలు లేవని ఎటువంటి ఊహాగానాలు చేయవద్దు.

మీరు కూడా ఈ జాబితాలో ఉన్నారా?:

ఇప్పుడు మీరు ఈ జాబితాలో ఉన్నారో లేదో చెక్‌ చేసుకోవచ్చు. వాస్తవానికి ఈ సమాచారమంతా ఒక పరిశోధన సమయంలో వెలుగులోకి వచ్చింది. దీనిలో నిపుణుడు దాదాపు 70 మంది రక్త నమూనాలను తీసుకొని వారి మెదడులను పరీక్షించాడు. ఏ బ్లడ్ గ్రూప్ వారి మెదడు ఎక్కువ చురుకైనదో పరిశోధనలో వెల్లడైంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..