AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Flight: విమానంలో కొబ్బరికాయను తీసుకెళ్తున్నారా..? మీరు జైలుకెళ్లడం ఖాయం జాగ్రత్త..

విమానంలో ప్రయాణించే వారు తప్పక తెలుసుకోవాల్సిన విషయం ఇది. విమానంలోకి కొన్ని వస్తువులను అనుమతించరు. డ్రగ్స్ సహా పదునైన వస్తువులకు పర్మిషన్ ఉండదని మనకు తెలిసిందే. అయితే సాధారణంగా కనిపించే కొబ్బరికాయలను కూడా ఫ్లైట్‌లో అనుమతించరని మీకు తెలుసా..? దీనికి కారణమేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Flight: విమానంలో కొబ్బరికాయను తీసుకెళ్తున్నారా..? మీరు జైలుకెళ్లడం ఖాయం జాగ్రత్త..
Why Coconuts Are Banned On Flights
Krishna S
|

Updated on: Oct 09, 2025 | 1:48 PM

Share

విమాన ప్రయాణం అంటే ఎవరికీ ఇష్టం ఉండదు. లైఫ్‌లో ఒక్కసారైనా ఫ్లైట్ ఎక్కాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. విమానంలో వెళ్లినప్పుడు బ్యాగులో రకరకాల వస్తువులు ప్యాక్ చేస్తాం. పదునైన వస్తువులు, ఎక్కువ ద్రవాలు తీసుకెళ్లకూడదని మనకు తెలుసు. కానీ కొబ్బరికాయలను కూడా విమానాల్లో అనుమతించరనే విషయం చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇది నిజంగా వింతగా అనిపించినా, దీని వెనుక బలమైన భద్రతా కారణం ఉంది.

కొబ్బరికాయలపై నిషేధానికి కారణం ఇదే

నిజానికి ఎండిన కొబ్బరికాయలు లేదా పూర్తి కొబ్బరి చిప్పలు చాలా ప్రమాదకరమైనవి. ఎందుకంటే ఎండిన కొబ్బరిలో నూనె శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ కొబ్బరి నూనె చాలా వేగంగా మంటను అంటుకునే స్వభావం కలది. విమానం లోపల, అది కూడా గాలి ఒత్తిడి ఉండే వాతావరణంలో ఇది అగ్ని ప్రమాదానికి కారణం కావచ్చు. అందుకే ఇండిగో వంటి విమానయాన సంస్థలు, ఎండిన కొబ్బరిని చెక్-ఇన్ లగేజీలో కూడా తీసుకెళ్లడానికి అనుమతించవు. ఇంటర్నేషనల్ రూల్స్ ప్రకారం కూడా ఎండిన కొబ్బరిని మండే పదార్థంగానే చూస్తారు.

కొబ్బరిని ఇలా తీసుకెళ్లవచ్చు

అయితే, కొన్ని చిన్న మినహాయింపులు ఉన్నాయి. స్పైస్‌జెట్ వంటి కొన్ని విమానయాన సంస్థలు, కొబ్బరిని చిన్న ముక్కలుగా కోసి, అది పచ్చిగా ఉంటే మాత్రమే లగేజీలో తీసుకెళ్లడానికి అనుమతిస్తాయి. అంటే పూర్తిగా లేదా ఎండిన రూపంలో ఉన్న కొబ్బరికాయలు నిషేధం. ఒకవేళ మీరు నిషేధం ఉన్నా ప్యాక్ చేస్తే, ఎయిర్‌పోర్ట్ అధికారులు దాన్ని స్వాధీనం చేసుకుంటారు. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్‌లో అయితే జరిమానాలు పడే అవకాశం కూడా ఉంది. అందుకే ప్రయాణానికి ముందు మీ ఎయిర్‌లైన్ నియమాలను ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది.

విమానంలో ఏం తీసుకెళ్లొచ్చు..

మీరు మీ హ్యాండ్ లగేజీలో కొన్ని ఆహారాలు తీసుకోవచ్చు. బిర్యానీ లేదా గట్టిగా ఉండే ఇతర వండిన భోజనాలు, కేకులు, పండ్లు, గింజలు వంటివి తీసుకెళ్లడానికి ఇబ్బంది ఉండదు. అయితే ద్రవ పదార్థాలు 100 మి.లీ పరిమితికి మించకూడదు. పచ్చి మాంసం లేదా చేపలు, ఊరగాయలు ఘాటైన సుగంధ ద్రవ్యాలు వంటివి క్యారీ-ఆన్ బ్యాగ్‌లో నిషేధం. కాబట్టి సురక్షితమైన, సజావుగా ప్రయాణం కోసం తెలివిగా ప్యాక్ చేసుకోండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us