Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Goa Beach: గోవా బీచ్‌లో ఇకపై అలా చేయడం నిషేధం.. కొత్త రూల్ గురించి తెలుసుకోండి..

గోవాకు వచ్చే టూరిస్టుల గోప్యత, భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టూరిస్టుల అనుమతి లేకుండా వారితో సెల్ఫీలు, ఫొటోలు దిగవద్దని ఆదేశాలు జారీ చేసింది. అలాగే అపరిచితులు, అనుమానితులతో కూడా సెల్ఫీలు, ఫొటోలు దిగవద్దని, తోటి పర్యాటకుల గోప్యత, గౌరవానికి ప్రాధాన్యమివ్వాలని ఆదేశాల్లో పేర్కొంది.

Goa Beach: గోవా బీచ్‌లో ఇకపై అలా చేయడం నిషేధం.. కొత్త రూల్ గురించి తెలుసుకోండి..
Goa
Follow us
Basha Shek

|

Updated on: Jan 28, 2023 | 3:19 PM

దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో గోవా ఒకటి. ఏ మాత్రం ఖాళీ దొరికినా సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా గోవాకు చెక్కేస్తారు. ఇక సీజన్లతో సంబంధం లేకుండా దేశ విదేశాల నుంచి పర్యాటకులు ఇక్కడకు వస్తుంటారు. టూరిజం ద్వారా ఆదాయం ఆర్జిస్తోన్న రాష్ట్రాల్లో గోవా ముందంజలో ఉంది. అయితే సరదా సంగతి పక్కన పెడితే గోవాలో తరచూ ప్రమాద ఘటనలు జరుగుతున్నాయి. ఇది పర్యాటకుల్లో అభద్రతా భావాన్ని కలిగిస్తోంది. ఈక్రమంలో గోవాకు వచ్చే టూరిస్టుల గోప్యత, భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టూరిస్టుల అనుమతి లేకుండా వారితో సెల్ఫీలు, ఫొటోలు దిగవద్దని ఆదేశాలు జారీ చేసింది. అలాగే అపరిచితులు, అనుమానితులతో కూడా సెల్ఫీలు, ఫొటోలు దిగవద్దని, తోటి పర్యాటకుల గోప్యత, గౌరవానికి ప్రాధాన్యమివ్వాలని ఆదేశాల్లో పేర్కొంది.

ఇతర పర్యాటకులు/అపరిచితుల అనుమతి లేకుండా సెల్ఫీలు, ఫొటోగ్రాఫ్‌లు తీసుకోవద్దు. ముఖ్యంగా సూర్య స్నానానికి లేదా సముద్రంలో ఈత కొట్టేటప్పుడు, వారి గోప్యతను గౌరవించండి. అలాగే నిటారుగా ఉన్న కొండలు, సముద్రపు రాళ్ల వద్ద సెల్ఫీలు, ఫొటోలు తీసుకోవడం నిషేధం. తీరప్రాంతాన్ని సందర్శించే ప్రయాణికులు గ్రాఫిటీని రాయడం ద్వారా వారసత్వ ప్రదేశాలను ధ్వంసం చేయవద్దు. అనుమతి లేని ప్రైవేట్ టాక్సీలను అద్దెకు తీసుకోవద్దు. అధిక ఛార్జీలను నివారించడానికి మీటర్ ఛార్జీల కోసం పట్టుబట్టండి. అలాగే పర్యాటక శాఖలో నమోదైన చట్టబద్ధమైన హోటళ్లు/విల్లాలు లేదా బంగ్లాల్లోనే రూం బుక్‌ చేసుకోవాలి. అలాగే బీచ్‌లు మొదలైన బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం నిషేధం. ఇది శిక్షార్హమైన నేరం. గోవాకు వచ్చే సందర్శకులు ఈ నియమాలను కచ్చితంగా పాటించాలి. బహిరంగ ప్రదేశాల్లో ఆహారాన్ని వండడం నిషేధించబడిందని . ఈ నియమాలను ఉల్లంఘిస్తే జరిమానాతో పాటు జైలుశిక్ష తదితర కఠిన చర్యలు తీసుకుంటాం’ అని గోవా టూరిజం డిపార్ట్‌మెంట్‌ హెచ్చరించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్  వార్తల కోసం క్లిక్ చేయండి..