Viral Video: మయసభను మించిన మాయ.. ఆ ఊరంతా కొండ కిందే! వీడియో వైరల్‌

ప్రపంచలో ఎన్నో విచిత్రమైన ప్రదేశాలు ఉన్నాయి. అబ్బురపరిచే అందమైన మర్మ దేశాలు కూడా ఉన్నాయి. అటువంటి వాటి గురించి నెట్టింట బోలెడన్ని కథనాలు ఇంత వరకు మీరు చూసి ఉంటారు. ఇటువంటి అరుదైన ప్రదేశాలను వీక్షించిన తర్వాత మళ్లీ మళ్లీ అక్కడికి వెళ్లాలని మనసు ఉవ్విళ్లూరు తుంటుంది. అక్కడి స్థిరపడిపోయి జీవితం చివరాకరి క్షణం వరకు ప్రకృతి అందాలను వీక్షిస్తూ గడిపేయాలన్నంతగా..

Viral Video: మయసభను మించిన మాయ.. ఆ ఊరంతా కొండ కిందే! వీడియో వైరల్‌
Spanish Town Built Under Rocks
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 08, 2024 | 12:18 PM

ప్రపంచలో ఎన్నో విచిత్రమైన ప్రదేశాలు ఉన్నాయి. అబ్బురపరిచే అందమైన మర్మ దేశాలు కూడా ఉన్నాయి. అటువంటి వాటి గురించి నెట్టింట బోలెడన్ని కథనాలు ఇంత వరకు మీరు చూసి ఉంటారు. ఇటువంటి అరుదైన ప్రదేశాలను వీక్షించిన తర్వాత మళ్లీ మళ్లీ అక్కడికి వెళ్లాలని మనసు ఉవ్విళ్లూరు తుంటుంది. అక్కడి స్థిరపడిపోయి జీవితం చివరాకరి క్షణం వరకు ప్రకృతి అందాలను వీక్షిస్తూ గడిపేయాలన్నంతగా నచ్చేస్తాయ్‌. ఇటుంటి థ్రిల్లింగ్‌ టూర్‌లు చేసే వారికి మరో అందమైన ప్రదేశం పరిచయం చేస్తున్నాం. అదేంటంటే..

కొండ ప్రాంతాలలో రాళ్ళతో చెక్కిన ఇళ్లను, కొండలను తొలిచి అందంగా వేసిన రోడ్డు మార్గాలను మీరిప్పటి వరకు చూసే ఉంటారు. కానీ ఈ ఊరిలో రోడ్లు అందంగా కనిపించినప్పటికీ, పైన చూస్తే ఆకాశం కనిపించదు. ఊరంతా ఇదే పరిస్థితి. ఆకాశం కాస్తైనా కానరాదే! ఎందుకంటే కొండ కింద ఉంటుందీ ఊరు. ఇతర కొండ ప్రాంతాలకు భిన్నంగా కనిపించే ఈ ప్రదేశం యూరప్‌లోని ఓ సిటీలో ఉంది. ఈ పట్టణానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పట్టణం ఒక భారీ రాతి కింద నిర్మించబడింది.

ఇవి కూడా చదవండి

యూరప్‌లోని సెటెనిల్ డి లాస్ బోడెగాస్ అనే స్పానిష్ సిటీ గురించే మనం చర్చింకుంటోంది. ఈ సిటీ స్పెషాలిటీ ఏంటంటే ఊరు మొత్తం భారీ రాళ్ల క్రిందే ఉంటుంది. ఏదో ఇరుకుగా ఉంటుందని భావిస్తే పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఇక్కడ విశాలమైన రోడ్లు, వాటిపై ప్రయాణిస్తున్న కార్లు, రోడ్డుకి ఇరువైపులా నిర్మించిన ఇళ్ళు, పాపులు కూడా ఉన్నాయి. ఈ విచిత్ర ప్రదేశాన్ని సందర్శించేందుకు ఇక్కడికి యేటా పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివస్తుంటారు. పర్యాటకుల రద్దీ దృష్ట్యా ఇటీవల అక్కడ బోలెడన్ని కేఫ్‌లు కూడా వెలిశాయి. భారీ శిల కింద ఉన్న స్పెయిన్ సిటీని వైట్‌ విలేజ్‌, సెటెనిల్ డి లాస్ బోడెగాస్ అనే పేర్లతో కూడా పిలుస్తారు.

చూడ్డానికి ఎలా ఉంటుందంటే.. ఓ గ్రామంపై బోర్లించిన భారీ బండరాయిలా కనిపిస్తుంది. ఈ సిటీకి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. దీనిని చూసిన నెటిజన్లు చాలా ఎగ్జైట్‌ అయిపోతున్నారు. తెగ నచ్చేసిందని కామెంట్లు పెడుతున్నారు. ఇక్కడి ప్రజలు రాయి కింద నివసిస్తున్నారు! అని ఒకరు, ‘నేను ఇప్పటివరకు సందర్శించిన అత్యంత అద్భుతమైన ప్రదేశాలలో ఇది ఒకటి అని మరొకరు కామెంట్‌ సెక్షన్‌లో పేర్కొన్నారు. కుదిరితే మీరూ ఓ సారి వెళ్లిరండి..

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.