AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జీవితంలో ఇలాంటి రైలు ప్రయాణాలు ఒక్కసారైన చేయాల్సిందే.. ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసా..

రైలు ప్రయాణం.. ఉరుకుల పరుగుల జీవన విధానం నుంచి దూర ప్రాంతాలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా.. తీసుకెళ్లే ఉత్సాహావంతమైన ప్రయాణం.

జీవితంలో ఇలాంటి రైలు ప్రయాణాలు ఒక్కసారైన చేయాల్సిందే.. ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసా..
00
Rajitha Chanti
|

Updated on: Jun 21, 2021 | 12:25 PM

Share

రైలు ప్రయాణం.. ఉరుకుల పరుగుల జీవన విధానం నుంచి దూర ప్రాంతాలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా.. తీసుకెళ్లే ఉత్సాహావంతమైన ప్రయాణం. .. ప్రకృతి అందాలతోపాటు.. అద్భుతమైన అరణ్యాలను చుట్టెస్తూ.. కొండల నడుమ నుంచి.. నదుల మీది వరకు చాలా రైలు మార్గాలు ఉన్నాయి. అలాగే కొన్ని రైలు ప్రయాణాలు కూడా భయంకరంగానే ఉన్నాయి. అయితే కొన్ని రైలు మార్గాలు మాత్రం అత్యంత సుందరంగా.. చుట్టు పచ్చని ప్రకృతితోపాటు.. పక్కనే లోయల మధ్య నుంచి రైలు ప్రయాణం చేస్తే ఎలా ఉంటుంది… అలాంటి మార్గాలు ఎక్కడున్నాయో తెలుసుకుందామా.

11

లూసర్న్ టు మాంట్రియక్స్.. లూసర్న్ నుంచి మాంట్రియక్స్ వెళ్లడానికి స్విట్జర్లాండ్ గోల్డెన్ పాస్ మార్గం. అనేక రైలు మార్గాల కలయికతో ఉంటుంది. లుజెర్న్-ఇంటర్‌లాకెన్ ఎక్స్‌ప్రెస్, ఇంటర్‌లేకెన్ టు జ్వైసిమెన్ లెగ్, మాంట్రియక్స్ మరియు జ్వేసిమ్మెన్ల మధ్య గోల్డెన్‌పాస్ పనోరమిక్ రైలు మార్గాలు కలిసి ఉంటాయి. ప్రతి చివర రెండు ఇరుకైన గేజ్ రైల్వేలు ఉన్నాయి. అంతేకాదు… ఈ ఆల్పైన్ మార్గం.. ప్రయాణానికి మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది. అంతేకాదు.. లూసర్స్ రైలు మార్గం.. సర్నెన్ సరస్సు ఒడ్డు నుంచి తీసుకెళ్తుంది. ఈ రైలు మాంట్రియక్స్‌కు వాలుగా ఉండటానికి ముందు సరస్సు థన్ సుందరమైన దృశ్యాల చివరి దశ అయిన సిమ్ వ్యాలీ గుండా వెళుతుంది.

22

మాంట్రియక్స్ టూ జెర్మాట్.. ఈ రైలు మార్గం దాదాపు 148 కి.మీ. మార్టిగ్ని కి వెళ్లే దారిలో చాబ్లైస్ ద్రాక్ష తోటలు.. 6వ శతాబ్ధపు సెయింట్ మారిన్ వరకు ఉంటుంది. ఈ ప్రదేశం ప్రపంచంలోని పురాతన క్రైస్తవ మఠాధిపతి ఉండే ప్రాంతంగా ప్రసిద్ది చెందింది. ఇక్కడికి కిప్ ఫెన్ జార్జ్ కు వెళ్లే దారిలో రోన్, విస్ప్ గుండా వెళ్లవచ్చు.

33

జెర్మాట్ టూ సెయింట్ మోరిట్జ్.. జెర్మాట్ నుంచి సెయింట్ మోరిట్జ్ మధ్య దాదాపు 294 కి.మీ. దూరం. ఇక్కడ హిమానీదం ఎక్స్ ప్రెస్ రైలు నడుస్తుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత నెమ్మదిగా వెళ్లే రైలు. హిమనదీయ పర్వతాలు.. మేటర్ వ్యాలీ శిఖరాలు, స్టాకాల్పెర్ ప్యాలెస్ మధ్య గుండా వెళ్తారు.

Also Read: Doctors suicide : శామీర్ పేట్ పెద్ద చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఇద్దరు డాక్టర్లు.. మృతదేహాల కోసం గాలింపు

Hubble Space Telescope Down: మొరాయిస్తున్న హబుల్ స్పేస్ టెలిస్కోప్: విఫలమవుతోన్న నాసా ప్రయత్నాలు!