Telangana tourism: అరుణాచలం, వేలూరు, కాణిపాకం.. తెలంగాణ టూరిజం ప్యాకేజీ

హైదరాబాద్‌ నుంచి ఈ టూర్‌ ఆపరేట్ చేస్తున్నారు. 3 రాత్రులు, 4 రోజుల పాటు ఈ టూర్‌ సాగుతుంది. ఇందులో భాగంగా అరుణాచలేశ్వర ఆలయం, కాణిపాకం, వేలూరు గోల్డెన్‌ టెంపుల్ కవర్ అవుతాయి. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ సెప్టెంబర్ 15వ తేదీన అందుబాటలో ఉంది. ఇది మిస్‌ అయితే అక్టోబర్‌లో మరోసారి అవకాశం కల్పించనున్నారు. ఈ టూర్‌కు సంబంధించి...

Telangana tourism: అరుణాచలం, వేలూరు, కాణిపాకం.. తెలంగాణ టూరిజం ప్యాకేజీ
Telangana Tourism
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 09, 2024 | 3:42 PM

తమిళనాడులో పుణ్యక్షేత్రాల్లో ఒకటైనా అరుణాచలంను సందర్శించేందుకు ఇటీవల పెద్ద ఎత్తున భక్తులు ఆసక్తి చూపిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున ఆలయాన్ని సందర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ టూరిజం భక్తుల కోసం ప్రత్యేక టూరిజం ప్యాకేజీలను ఆపరేట్ చేస్తోంది. హైదరాబాద్‌ నుంచి అరుణాచలంకు తెలంగాణ టూరిజం హైదరాబాద్‌-అరుణాచలం పేరుతో ఓ ప్యాకేజీని అందిస్తోంది. ఇంతకీ ఏంటా ప్యాకేజీ.? ఏయే ప్రాంతాలు కవర్‌ అవుతాయి ఇప్పుడు తెలుసుకుందాం..

హైదరాబాద్‌ నుంచి ఈ టూర్‌ ఆపరేట్ చేస్తున్నారు. 3 రాత్రులు, 4 రోజుల పాటు ఈ టూర్‌ సాగుతుంది. ఇందులో భాగంగా అరుణాచలేశ్వర ఆలయం, కాణిపాకం, వేలూరు గోల్డెన్‌ టెంపుల్ కవర్ అవుతాయి. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ సెప్టెంబర్ 15వ తేదీన అందుబాటలో ఉంది. ఇది మిస్‌ అయితే అక్టోబర్‌లో మరోసారి అవకాశం కల్పించనున్నారు. ఈ టూర్‌కు సంబంధించి పూర్తి వివరాలు..

ప్రయాణం ఇలా సాగుతుంది..

* మొదటి రోజు హైదరాబాద్‌లోని బషీర్ బాగ్ నుంచి సాయంత్రం 6.30 గంటలకు జర్నీ ప్రారంభమవుతుంది.

* రెండో రోజు ఉదయం 6 గంటలకు కాణిపాకం చేరుకుంటారు. ఫ్రెషప్‌ అయిన తర్వాత ఉదయం 9 గంటల లోపు దర్శనం పూర్తి చేస్తారు. అనంతరం అక్కడి నుంచి తిరువణ్ణామలైకి బయల్దేరుతారు.

* మధ్యాహ్నం ఒంటి గంటకు అరుణాచలం చేరుకుంటారు. తర్వాత అరుణాచలేశ్వరస్వామి దర్శనం పూర్తి చేసుకుంటారు. రాత్రి అరుణాచలంలోనే బస ఉంటుంది.

* ఇక మూడో రోజు ఉదయం టిఫిన్‌ పూర్తి కాగానే అక్కడి నుంచి బయల్దేరి మధ్యాహ్నానికి వేలూరు బయలు దేరుతారు. సాయంత్రం దర్శనం పూర్తి అవుతుంది. వెంటనే తిరుగు ప్రయాణం మొదలవుతుంది.

* 4వ రోజు ఉదయం హైదరాబాద్‌కు చేరుకోవడంతో టూర్‌ ముగుస్తుంది.

ప్యాకేజీ ధరలు..

ఏసీ బస్సు ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ టూర్‌లో పెద్దలకు ప్యాకేజీని రూ.8,000, పిల్లలకు రూ.6,400గా నిర్ణయించారు. ఈ ప్యాకేజీలో బస్ జర్నీ, హోటల్స్‌ కవర్‌ అవుతాయి. ఆలయాల్లో దర్శనం టికెట్లు, భోజనానికి పర్యాటకులు సొంతంగా ఖర్చు భరించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు, టికెట్ బుకింగ్స్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని టూరిజం వార్తల కోసం క్లిక్ చేయండి..

దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!
వదలకండి.. స్వీట్‌కార్న్‌ తింటే బోలెడు లాభాలు.. ఇలాంటి సమస్యలన్నీ
వదలకండి.. స్వీట్‌కార్న్‌ తింటే బోలెడు లాభాలు.. ఇలాంటి సమస్యలన్నీ
అక్కడ తన పేరును చూసుకొని మురిసిపోయిన డీజీపీ
అక్కడ తన పేరును చూసుకొని మురిసిపోయిన డీజీపీ
హైడ్రా బుల్డోజర్లు.. మళ్లీ గర్జించాయి
హైడ్రా బుల్డోజర్లు.. మళ్లీ గర్జించాయి
మకర సంక్రాంతి రోజున ఇలాంటివిదానంచేయండి..మీ అదృష్టం ప్రకాశిస్తుంది
మకర సంక్రాంతి రోజున ఇలాంటివిదానంచేయండి..మీ అదృష్టం ప్రకాశిస్తుంది
విచారణకి కేటీఆర్ వస్తారా? సమయం కోరతారా?
విచారణకి కేటీఆర్ వస్తారా? సమయం కోరతారా?
సర్జరీ తర్వాత తొలిసారి బయటకు శివన్న..ఇండియాకు రావడంపై ఏమన్నారంటే?
సర్జరీ తర్వాత తొలిసారి బయటకు శివన్న..ఇండియాకు రావడంపై ఏమన్నారంటే?
వీళ్లు మూడేళ్ల వరకు సిమ్‌ కార్డ్ తీసుకోలేరు.. బ్లాక్‌ లిస్ట్‌లోనే
వీళ్లు మూడేళ్ల వరకు సిమ్‌ కార్డ్ తీసుకోలేరు.. బ్లాక్‌ లిస్ట్‌లోనే