AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana tourism: అలా.. సోమశిలా. తక్కువ బడ్జెట్‌లో రెండు రోజుల టూర్‌ ప్యాకేజీ..

హైదరాబాద్‌-శ్రీశైలం-సోమశిలా-హైదరాబాద్‌ పేరుతో ఈ టూర్‌ను ఆపరేట్‌ చేస్తున్నారు. ప్రతీ శనివారం ఉదయం ఈ టూర్‌ అందుబాటులో ఉంటుంది. రివర్‌ క్రూయిజ్‌లో ప్రయాణం ఈ టూర్‌ ప్రత్యేకతగా చెప్పొచ్చు. శ్రీశైలంతో పాటు సోమశిల ప్రకృతి అందాలను వీక్షించవచ్చు. మొత్తం రెండు రోజుల పాటు ఈ టూర్‌ సాగుతుంది. ఈ టూర్‌ ప్యాకేజీలో...

Telangana tourism: అలా.. సోమశిలా. తక్కువ బడ్జెట్‌లో రెండు రోజుల టూర్‌ ప్యాకేజీ..
Somasila Tour
Narender Vaitla
|

Updated on: May 18, 2024 | 9:36 AM

Share

సమ్మర్‌లో హాలీడేస్‌లో ఎక్కడికైనా వెళ్దామని పిల్లలు మారాం చేస్తున్నారా.? అయితే ఆఫీసు బిజీలో పడిపోయి లాంగ్ టూర్‌ వేయలని పరిస్థితి ఎంతో మందికి ఉంటుంది. అలాంటి వారి కోసమే తెలంగాణ టూరిజం అదిరిపోయే టూరిజం ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. కేవలం రెండు రోజుల్లోనే ఈ టూర్‌ను ముగించేసుకోవచ్చు. ఎంచక్కా వీకెండ్‌ హాలీడేస్‌లోనే మంచి అనుభూతిని పొందే అవకాశాన్ని కల్పించారు. అది కూడా తక్కువ బడ్జెట్‌లోనే. ఇంతకీ ఈ టూర్‌ ప్యాకేజీలో ఏయే ప్రాంతాలు కవర్‌ అవుతాయి.? టూర్‌ ప్యాకేజీ ధర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

హైదరాబాద్‌-శ్రీశైలం-సోమశిలా-హైదరాబాద్‌ పేరుతో ఈ టూర్‌ను ఆపరేట్‌ చేస్తున్నారు. ప్రతీ శనివారం ఉదయం ఈ టూర్‌ అందుబాటులో ఉంటుంది. రివర్‌ క్రూయిజ్‌లో ప్రయాణం ఈ టూర్‌ ప్రత్యేకతగా చెప్పొచ్చు. శ్రీశైలంతో పాటు సోమశిల ప్రకృతి అందాలను వీక్షించవచ్చు. మొత్తం రెండు రోజుల పాటు ఈ టూర్‌ సాగుతుంది. ఈ టూర్‌ ప్యాకేజీలో ఏయే ప్రాంతాలు కవర్‌ అవుతాయంటే..

* తొలి రోజు ఉదయం 9 గంటలకు బషీర్‌బాగ్‌లోని సీఆర్‌ఓ కార్యాలయం నుంచి నాన్‌ ఏసీ బస్సు శ్రీశైలం బయలుదేరుతుంది. సాయంత్రానికి శ్రీశైలం చేరుకొని హోటల్‌లో చెకిన్‌ అవుతారు. అనంతరం దర్శనం ఉంటుంది. ఇక రాత్రి శ్రీశైలంలోనే బస ఉంటుంది.

* రెండో ఉదయం 9 గంటలకు శ్రీశైలం నుంచి సోమశిలకు బోట్‌లో ప్రయాణం ఉంటుంది. అనంతరం మళ్లీ సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ తిరుగుప్రయాణం మొదలై, రాత్రి 9 గంటలకు హైదరాబాద్‌ చేరుకోవడంతో టూర్‌ ముగుస్తుంది.

ప్యాకేజీ ధర వివరాలు..

పెద్దలకు ఒక్కొక్కరికీ రూ. 4499కాగా చిన్నారులకు రూ. 3600గా ఛార్జీలను నిర్ణయించారు. నాన్‌ ఏసీ ట్రాన్స్‌పోర్టేషన్‌, శ్రీశైలంలో నాన్‌ ఏసీ అకామిడేషన్‌, నాన్‌ ఏసీ బోట్‌ చార్జీలు, బోటులో 1 వెజ్‌ మీల్‌ ప్యాకేజీలోనే కవర్‌ అవుతాయి. పూర్తి వివరాల కోసం ఈ 9848540371 నెంబర్‌కు సంప్రదించండి.

మరిన్ని టూరిజం సంబంధిత కథనాల కోసం క్లిక్ చేయండి..

6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే
2026లో బంగారం ధరలు ఎలా ఉండబోతున్నాయ్.? షాకింగ్ విషయాలు మీకోసం
2026లో బంగారం ధరలు ఎలా ఉండబోతున్నాయ్.? షాకింగ్ విషయాలు మీకోసం
అమ్మో నెల రోజులా.. టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్ మార్చాల్సిందే..
అమ్మో నెల రోజులా.. టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్ మార్చాల్సిందే..
ఐపీఎల్‌లో నిషేధం.. కట్‌చేస్తే.. రూ. 5.6 కోట్లతో కొనేసిన కావ్యపాప
ఐపీఎల్‌లో నిషేధం.. కట్‌చేస్తే.. రూ. 5.6 కోట్లతో కొనేసిన కావ్యపాప
కరెంట్ ఛార్జీలపై చంద్రబాబు కీలక ప్రకటన.. ప్రజలకు బిగ్ రిలీఫ్..
కరెంట్ ఛార్జీలపై చంద్రబాబు కీలక ప్రకటన.. ప్రజలకు బిగ్ రిలీఫ్..
ఒక్క మెసేజ్.. 45 బైకులు..దొంగ సామ్రాజ్యాన్ని బయటపెట్టిన ఈ-చలాన్
ఒక్క మెసేజ్.. 45 బైకులు..దొంగ సామ్రాజ్యాన్ని బయటపెట్టిన ఈ-చలాన్