Telangana Tourism: వీకెండ్‌కి అదిరిపోయే టూర్ ప్యాకేజీ.. చారిత్రక కట్టడాలు, దేవాలయాలు కవర్ అయ్యేలా
హైదరాబాద్-వరంగల్-కాకతీయ-రామప్ప హెరిటేజ్ టూర్ పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. కేవలం రెండు రోజుల్లోనే ముగిసేలా ఈ టూర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రతీ శనివారం ఈ టూర్ ఆపరేట్ చేస్తారు. ఇంతకీ ఈ టూర్ ప్యాకేజీలో ఏయే ప్రాంతాలు కవర్ అవుతాయి.? ప్యాకేజీ ధర వివరాలు ఏంటి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఒకప్పుడు టూర్స్ అంటే ఓ వారం రోజులు వెళ్లేవారు. అది కూడా కేవలం సమ్మర్ హాలీడేస్‌లోనే అనే భావన ఉండేది. కానీ ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన టూర్ ప్యాకేజీలతో రెండు రోజుల్లోనే ఎంచక్కా విహారయాత్రకు వెళ్లొస్తున్నారు. ఆఫీసులకు సెలవులు పెట్టే పనిలేకుండా శని, ఆదివారాల్లో టూర్ కంప్లీట్ చేయాలనుకునే వారి కోసం తెలంగాణ టూరిజం ఒక మంచి టూర్ ప్యాకేజీని అందిస్తోంది.
హైదరాబాద్-వరంగల్-కాకతీయ-రామప్ప హెరిటేజ్ టూర్ పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. కేవలం రెండు రోజుల్లోనే ముగిసేలా ఈ టూర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రతీ శనివారం ఈ టూర్ ఆపరేట్ చేస్తారు. ఇంతకీ ఈ టూర్ ప్యాకేజీలో ఏయే ప్రాంతాలు కవర్ అవుతాయి.? ప్యాకేజీ ధర వివరాలు ఏంటి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రయాణం ఇలా సాగుతుంది..
మొదటిరోజు (శనివారం)..
* మొదటి రోజు ఉదయం 7 గంటలకు సికింద్రాబాద్‌లోని యాత్రినివాస్ నుంచి ప్రయాణం మొదలవుతుంది.
* ఉదయం 8.30 గంటలకు భువనగిరి ఫోర్ట్‌కు చేరకుంటారు. అనంతరం 9 గంటలకు యాదగిరి గుట్టలోని హరిత హోటల్‌లో బ్రేక్‌ఫాస్ట్ ఉంటుంది.
* 9.45 గంటలకు యాదాద్రి నర్సింహా స్వామి వారి ఆలయ సందర్శన ఉంటుంది. 10.30 గంటలకు యాదాద్రి నుంచి తిరుగు ప్రయాణం మొదలవుతుంది.
* 11 గంటల నుంచి 11.30 గంటల వరకు జైన్ టెంపుల్ సందర్శన ఉంటుంది.
* ఆ తర్వాత పెంబర్తీలో 12 గటలకు కాసేపు ఆపుతారు. ఈ సమయంలో షాపింగ్ చేసుకోవచ్చు.
* ఇక 1.30 గంటలకు హన్మకొండలో హరిత కాతీయ హాటల్‌కు చేరుకుంటారు. 1.30 గంటల నుంచి 4 గంటల వరకు లంచ్‌తో పాటు విశ్రాంతి ఉంటుంది.
* ఇక సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు వేయి స్థంభాల గుడి, భద్రకాళి టెంపుల్, వరంగల్ ఫోర్ట్, ఫోర్ట్ సౌండ్, లైట్ షో వంటివి ఉంటాయి.
* తిరిగి 9 గంటలకు హోటల్‌కు చేరుకొని డిన్నర్ ఉంటుంది. రాత్రి హోటల్‌లోనే బస చేయాల్సి ఉంటుంది.
రెండో రోజు (ఆదివారం)..
* ఉదయం 8 గంటలకు బ్రేక్‌ఫాస్ట్ చేసి హోటల్ నుంచి బయలుదేరుతారు.
* 10 గంటల నుంచి 1 గంట వరకు రామప్ప టెంపుల్, బోటింగ్, భోజనం ఉంటుంది.
* ఆ తర్వత మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల మధ్య లక్నవరం బ్రిడ్జ్‌తో పాటు బోటింగ్ ఉంటుంది.
* ఇక మధ్యాహ్నం 3 గంటలకు లక్నవరం నుంచి బయలుదేరుతారు.
* తిరిగి 5 గంటలకు హన్మకొండలోని హాటల్ హరిత చేరుకుంటారు.
* సాయంత్రం 5.30 గంటలకు వరంగల్ నుంచి తిరుగు ప్రయాణం మొదలవుతుంది. రాత్రి 9 గంటలకు సికింద్రాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
ప్యాకేజీ వివరాలు..
ప్యాకేజీ ధర విషయానికొస్తే పెద్దలకు రూ. 3449, చిన్నారులకు రూ. 2759గా నిర్ణయించారు. ఇందులోని ఫుడ్, ఎంట్రీ, బోటింగ్ టికెట్స్ కవర్ అవుతాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
మరిన్ని టూరిజం వార్తల కోసం క్లిక్ చేయండి..




