Sikkim Tour Package: సిక్కింలోని ఈ భూలోక స్వర్గాన్ని ఎప్పుడైనా చూశారా? తక్కువ బడ్జెట్‌లో సమ్మర్‌ టూర్‌..

సమ్మర్‌ టూర్‌కు ప్లాన్‌ చేసే వారు భూతల స్వర్గం తలపించే సిక్కింకు అత్యంత తక్కువ ప్యాకేజీతో వెళ్లిరావొచ్చు. ఈ ఈశాన్య రాష్ట్రంలోని ప్రకృతి అందాలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ఇక్కడి యుమ్తాంగ్ లోయ స్వర్గాన్ని తలపిస్తుంది. యుమ్‌తంగ్ సిక్కిం రాజధాని గాంగ్‌టక్‌కు ఉత్తరాన 140 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనిని పూల లోయ అని కూడా అంటారు. యుమ్‌తాంగ్‌లో ఎన్నో రకాల అందమైన పూలను చూడవచ్చు..

Sikkim Tour Package: సిక్కింలోని ఈ భూలోక స్వర్గాన్ని ఎప్పుడైనా చూశారా? తక్కువ బడ్జెట్‌లో సమ్మర్‌ టూర్‌..
Valley Of Flowers In Sikkim
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 18, 2024 | 12:59 PM

సమ్మర్‌ టూర్‌కు ప్లాన్‌ చేసే వారు భూతల స్వర్గం తలపించే సిక్కింకు అత్యంత తక్కువ ప్యాకేజీతో వెళ్లిరావొచ్చు. ఈ ఈశాన్య రాష్ట్రంలోని ప్రకృతి అందాలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ఇక్కడి యుమ్తాంగ్ లోయ స్వర్గాన్ని తలపిస్తుంది. యుమ్‌తంగ్ సిక్కిం రాజధాని గాంగ్‌టక్‌కు ఉత్తరాన 140 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనిని పూల లోయ అని కూడా అంటారు. యుమ్‌తాంగ్‌లో ఎన్నో రకాల అందమైన పూలను చూడవచ్చు. సిక్కిం వెళ్లాలని ప్లాన్ చేసుకుంటే ఈ ప్రదేశాన్ని తప్పకుండా చూడండి. ఈ ప్రదేశం 3,564 మీటర్ల ఎత్తులో ఉంటుంది. సాహస ప్రియులకు ఇది బెస్ట్‌ ప్లేస్‌.

యుమ్‌తంగ్ ఎందుకు ప్రత్యేకం?

ఈ లోయ అద్భుతమైన ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందింది. యుమ్తాంగ్ లోయలో 24 కంటే ఎక్కువ రకాల రోడోడెండ్రాన్ పువ్వులు కనిపిస్తాయి. ఈ పువ్వులు ఫిబ్రవరి నుంచి జూన్ వరకు మాత్రమే వికసిస్తాయి. విశేషమేమిటంటే ఇక్కడ వేడి నీటి బుగ్గలను కూడా చూడొచ్చు. ఈ నీరు అనేక చర్మ సంబంధిత సమస్యలను దూరం చేస్తాయి. ఇక్కడికి ట్రెక్కింగ్ వంటి సాహసోపేతమైన కార్యకలాపాలు కూడా చేయవచ్చు.

ఏ సీజన్‌లోనైనా యుమ్‌తాంగ్ వ్యాలీని సందర్శించడానికి ప్లాన్ చేసుకోవచ్చు. అయితే తప్పనిసరిగా వెచ్చని ఉన్ని దుస్తులను తీసుకెళ్లడం మర్చిపోకూడదు. ఎందుకుంటే ఈ ప్రదేశం అన్ని కాలాలలో చల్లగా ఉంటుంది. ఈ ప్రదేశం చాలా ఎత్తులో ఉన్నందున, ఇక్కడ వాతావరణం మారుతూ ఉంటుంది. ఇక్కడ ATM సదుపాయం ఉండదు. కాబట్టి మీతోపాటు కొంత నగదు తెచ్చుకోవాలి. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇక్కడ సందర్శించడానికి ముందస్తు అనుమతి తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి

యుమ్‌తాంగ్ వ్యాలీకి ఎలా చేరుకోవాలి?

యుమ్‌తాంగ్ వ్యాలీ గాంగ్టక్ నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడికి రోడ్డు మార్గంలో వెళ్లొచ్చు. గాంగ్టక్ నుంచి లాచుంగ్ చేరుకోవాలి. అక్కడి నుంచి నేరుగా యమ్‌తాంగ్‌కి వెళ్లొచ్చు. ఇక్కడికి చేరుకోవడానికి 50 నిమిషాల సమయం పడుతుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.