Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC Tour: సమ్మర్‌లో హిమగిరి సొగసులు చూడాలనుకుంటున్నారా.. హైదరాబాద్ నుంచి కశ్మీర్‌కు ప్యాకేజీ.. తక్కువ ధరలో చుట్టేయండి..

తెలుగువారి కోసం IRCTC ఒక స్పెషల్ ప్యాకేజీని తీసుకొచ్చింది. హిమాలయాల అందాలను వీక్షిస్తూ ఓ విభిన్నమైన అనుభవాన్ని జీవితంలో ఒక మధుర జ్ఞాపకంగా పదిల పరచుకోవచ్చు. IRCTC అందిస్తోన్న "మిస్టికల్ కాశ్మీర్ తులిప్ ఫెస్టివల్ స్పెషల్" టూర్ ప్యాకేజీతో అందిస్తోన్న ఈ ట్రిప్ వివరాలను గురించి తెలుసుకుందాం..

IRCTC Tour: సమ్మర్‌లో హిమగిరి సొగసులు చూడాలనుకుంటున్నారా.. హైదరాబాద్ నుంచి కశ్మీర్‌కు ప్యాకేజీ.. తక్కువ ధరలో చుట్టేయండి..
Irctc Summer Special Tour
Follow us
Surya Kala

|

Updated on: Mar 12, 2025 | 3:32 PM

వేసవి కాలం వచ్చేసింది. ఎక్కువ రోజులు సెలవులు కూడా రానున్నాయి. దీంతో సమ్మర్ నుంచి ఉపశమనంతో పాటు అందమైన ప్రకృతి నడుమ కొన్ని రోజులైనా గడపాలని కోరుకుంటే భూలోక స్వర్గం కశ్మీర్ ను సందర్శించండి. వేడి వేడి ఎండల నుంచి ఉపశమనం కోసం చల్ల చల్లని వాతావరణంలో అందమైన హిమగిరి సొగసులను వీక్షిస్తూ సంతోషంగా గడపడం కోసం తెలుగువారికి IRCTC ఒక స్పెషల్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. మిస్టికల్ కాశ్మీర్ తులిప్ ఫెస్టివల్ స్పెషల్ ప్యాకేజీ టూర్ ని IRCTC అందిస్తోంది. దీంతో కాశ్మీర్‌ని చాలా తక్కువ ధరలో సందర్శించవచ్చు. మొత్తం ఐదు రాత్రులు, ఆరు పగళ్లు ఈ పర్యటన ఉంటుంది. హైదరాబాద్ నుంచి శ్రీనగర్ , గుల్మార్గ్, సోన్‌మార్గ్, పహల్గామ్‌లో విహరించవచ్చు.

ప్యాకేజీ వివరాలు:

ఫస్ట్ డే: ఈ టూర్‌ హైదరాబాద్ నుంచి మొదలవుతుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫస్ట్ డే మధ్యాహ్నం ఫ్లైట్ ద్వారా శ్రీనగర్ చేరుకోవాలి. ఆ రోజు రాత్రి శ్రీనగర్ లో హోటల్ లోనే బస చేయాల్సి ఉంటుంది. నచ్చితే శ్రీ నగర్ లో షాపింగ్ కూడా చేసుకోవచ్చు. రాత్రి హోటల్ లోనే డిన్నర్ చేయాలి.

సెకండ్ డే: రెండో రోజు ఉదయం హోటల్ లో అల్పాహారం తిని.. సోన్‌మార్గ్‌కి స్టార్ట్ అవుతారు. ఇక్కడ హిమగిరి సొగసులను చూడవచ్చు. మంచుతో కప్పిన ఎత్తయిన కొండలు, ఆడికొండలు, వేసవి నెలల్లో ప్రధాన ఆకర్షణగా ఉండే థాజివాస్ హిమానీనదం వంటి అందాలను వీక్షించవచ్చు. ఈ ప్రాంతంలో విహరించేందుకు పోనీలను అద్దెకు తీసుకోవచ్చు. ఇక్కడ తాజ్వాస్ గ్లేసియర్ ప్రత్యేకంగా ఉంటుంది. రాత్రి సోన్‌మార్గ్‌ నుంచి శ్రీనగర్ చేరుకుని హోటల్ లో రాత్రి బస చేయాలి.

ఇవి కూడా చదవండి

థర్డ్ డే: మూడో రోజు ఉదయం టిఫిన్ తిని గుల్‌మార్గ్‌కి బయలుదేరాలి. అక్కడ గోండోలా రోప్‌వే ప్రయాణాన్ని ఎంజాయ్ చేయవచ్చు. ఇక్కడ ఉన్న దర్శనీయ స్థలాలను సందర్శించవచ్చు. తర్వాత శ్రీ నగర్ లో బస చేసిన హోటల్ కు చేరుకోవాలి. రాత్రి డిన్నర్ చేసి హోటల్‌లోనే రాత్రి బస చేయాలి.

నాలుగో రోజు: నాలుగో రోజు ఉదయం టిఫిన్ తిని శ్రీనగర్ లోని హోటల్ నుంచి చెక్ అవుట్ అయ్యి… ఇక్కడ నుంచి పహల్గామ్‌కి బయలుదేరాలి. దారిలో బేతాబ్ వల్లీ, అవంతిపుర శిథిలాలు, చందన్‌వాడి, అరు లోయ అందాలతో పాటు లోయలో కుంకుమ పువ్వుల తోటలను సందర్శించవచ్చు. ఇక్కడ పోనీ రైడ్ ను ఆస్వాదించవచ్చు. పహల్గామ్‌లో రాత్రి డిన్నర్ చేసి బస పహల్గాంలోనే చేయాల్సి ఉంటుంది.

ఫిఫ్త్ డే: ఐదో రోజుహౌస్‌బోట్‌లో చెక్-ఇన్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఆదిశంకరాచార్య ఆలయాన్ని, దాల్ సరస్సు, బొట్ హౌస్, చార్- చినార్ (ప్లోటింగ్ గార్డెన్స్)లను సందర్శించాలి. ఐదో రోజు రాత్రి అందమైన జ్ఞాపకంగా టూర్ ని మార్చుకోవడానికి హౌస్‌బోట్‌లోనే రాత్రి బస చేయాల్సి ఉంటుంది.

ఆరో రోజు: ఉదయాన్నే అల్పాహారం తర్వాత మొఘల్ గార్డెన్స్, బొటానికల్ గార్డెన్ లేదా షాలిమార్ గార్డెన్స్ ని సందర్శించాలి. తర్వాత హౌస్ బోట్ ను చెక్-అవుట్ అవ్వాలి. తిరిగి హైదరాబాద్ కి చేరుకోవడానికి రిటర్న్  ఫ్లైట్ కోసం శ్రీనగర్ విమానాశ్రయానికి చేరుకోవాలి. 

ప్యాకేజీలో అందించే సదుపాయాలు ఏమిటంటే..

  1. ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్లు అందిస్తోంది.. హైదరాబాద్ నుంచి శ్రీనగర్ కు .. మళ్ళీ శ్రీనగర్ నుంచి హైదరాబాద్ కు
  2. ఐదు రోజుల పాటు హోటల్ లో బస చేసే సౌకర్యం
  3. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ రాత్రి డిన్నర్ ను అందిస్తుంది.
  4. ట్రావెల్ భీమా సదుపాయం
  5. హౌస్‌బోట్‌లో రాత్రి బస చేసే సౌకర్యం
  6. అయితే రోప్‌వే , ప్లోటింగ్ గార్డెన్స్ వంటి వాటిని సందర్శించాలంటే ప్రయాణీకులే సొంతంగా ఖర్చుని భరించాల్సి ఉంటుంది.

ప్యాకేజీ ధరలు:

  1. సింగిల్ షేరింగ్: రూ. 35,655
  2. డబుల్ షేరింగ్: రూ. 33,930
  3. ట్రిపుల్ ఆక్యుపెన్సీ: రూ. 33,355
  4. 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు విత్ బెడ్ రూ.29,905
  5. విత్ అవుట్ బెడ్ రూ.27,875
  6. 2 నుంచి 4 ఏళ్ల పిల్లలకు రూ.21,850లు చెల్లించాల్సి ఉంటుంది.

మిస్టికల్ కాశ్మీర్ తులిఫ్ ఫెస్టివల్ స్పెషల్ టూర్ పేరుతో IRCTC అందిస్తోన్న ఈ ప్యాకేజీ గురించి మరింత సమాచారం తెలుసుకునేందుకు, బుకింగ్ కోసం IRCTC అందిస్తోన్న మిస్టికల్ కాశ్మీర్ తులిఫ్ ఫెస్టివల్ ప్యాకేజీ లింక్ ను క్లిక్ చేయవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..