Bansilalpet Stepwell: నగరంలో మరో టూరిస్ట్ స్పాట్ రెడీ.. 300 ఏళ్ల నాటి బావికి పునరుజ్జీవం.. నేడు మంత్రుల చేతులమీదుగా ప్రారంభం
బన్సీలాల్ పేటలో 300 ఏళ్ల నాటి నాగన్న కుంట బావి పునరుజ్జీవంతో ఔరా అనిపిస్తుంది. చారిత్రక కట్టడాల పునరుద్దరణలో భాగంగా ఎన్జీవోతో కలిసి హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ ఈ మెట్ల బావికి తిరిగి ప్రాణం పోశాయి.
హైదరాబాద్‌లో మరో టూరిస్ట్ స్పాట్ రెడీ అయింది. చాలా రోజుల తర్వాత పూర్వ వైభవాన్ని సంతరించుకున్న బన్సీలాల్‌పేట్ మెట్ల బావిని ఇవాళ ప్రారంభించనున్నారు మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్. నేటి నంచి టూరిస్టుల సందడి మొదలు కానుంది. దేశంలోనే టూరిస్ట్ ప్లేస్‌లో హైదరాబాద్ ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రముఖ పర్యాటక స్థలాలకు తోడుగా పురాతనమైన కట్టడాలు ఉన్నాయి. ఇంకా ఎన్నో పురాతనమైన స్థలాలు మరుగున పడి పోయాయి. వాటిలో బన్సీలాల్ పేట్‌లో చారిత్రక మెట్ల బావి ఒకటి. ఇప్పుడు ఇది కూడా పూర్వ వైభవనాన్ని సంతరించుకుంది. నగరం నడిబొడ్డును మరో పర్యాటక కేంద్రంగా టూరిస్టుల మన్ననలను పొందనుంది. చారిత్రక నిర్మాణం నిలిచింది. కొద్ది రేజులుగా చేపట్టిన పునరుద్దరణ పనులు పూర్తవడంతో ఇవాళ మంత్రులు కేటీఆర్, తలసాని చేతుల మీదుగా ప్రారంభం కానుంది.
బన్సీలాల్ పేటలో 300 ఏళ్ల నాటి నాగన్న కుంట బావి పునరుజ్జీవంతో ఔరా అనిపిస్తుంది. చారిత్రక కట్టడాల పునరుద్దరణలో భాగంగా ఎన్జీవోతో కలిసి హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ ఈ మెట్ల బావికి తిరిగి ప్రాణం పోశాయి. 500 టన్నులకు పైగా 800 ట్రక్కుల చెత్తను బావి నుంచి వెలికి తీశారు. అందంగా ఆనాటి రూపాలను తీర్చిదిద్ధడమే కాదు.. చిన్న, చిన్న వేడుకల కోసం సీటింగ్‌తో కూడిన గార్డెన్, అంపి థియేటర్ నిర్మాణం చేసి అద్భుతమైన పర్యాటక క్షేత్రంగా మలిచారు. మెట్ల బావుల సంరక్షణలో డెఫినెట్ గా ట్రెండ్ సెట్టర్ గా బన్సీలాల్ పేట్ మెట్ల బావి నిలుస్తుందని అధికారులు బావిస్తున్నారు.
బన్సీలాల్ పేటలో జనావాసాల మధ్య పేరుకుపోయింది ఈ బావి. చెత్త చెదారం కింద ఉన్న ఈ బావిని వెలికితీయాలని బావించింది మాత్రం ది రెయిన్ వాటర్ ప్రాజెక్టు ఫౌండర్ కల్పనా రమేశ్. భూగర్భ జలాల సంరక్షణ కోసం కృషి చేస్తున్న ఈమె ఇప్పటికే నగరంలో పలు మెట్ల బావుల పునరుద్ధరణలో భాగస్వామిగా ఉన్నారు. అదే కోవలో ఆమె కంటికి బన్సీలాల్ పేట్ బావి చిక్కింది. అయితే చెత్త చెదారంతో చిక్కుకున్నఈ బావి.. ఇంత పెద్ద ఎత్తున ఉంటుందని ఊహించలేదంటున్నారు. ఇవాళ్టి నుంచి టూరిస్టుల సందడి మొదలు కానుంది. ఈ ప్రాంతానికి ఈ బావితో కొత్త కళ సంతరించుకోనుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..