- Telugu News Photo Gallery World photos New Year 2023 vacations are planning, so celebrate in these countries without visa
News Year 2023: న్యూ ఇయర్ లో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా.. వీసా లేకుండా తక్కువ ఖర్చుతో ఈ దేశాల్లో విహరించవచ్చు..
మీరు డిసెంబర్ 25 నుండి జనవరి 1 వరకు విదేశాలకు వెళ్లాలని అనుకుంటే. రు సందర్శించడానికి ఎక్కువ డబ్బు ఖర్చు చేయనవసరం లేని నాలుగు దేశాలను మీకు తెలియజేద్దాం, అలాగే వీసాకు ఇబ్బంది ఉండదు.
Updated on: Dec 12, 2022 | 3:15 PM

డిసెంబర్ 25 నుండి జనవరి 1 వరకూ శీతాకాలపు సెలవులను ఎంజాయ్ చేయాలనుకుంటే.. అదీ విదేశాలకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా.. వీసా,ఇతర ఇబ్బందులు తలెత్తకుండా ఈజీగా విదేశాలకు వెళ్ళవచ్చు. అంతేకాదు ఇందుకోసం మీరు ఎక్కువ డబ్బు ఖర్చు చేయనవసరం లేదు. అంతేకాదు వీసా గురించి చింతించాల్సిన అవసరం లేదు. ఈ నాలుగు దేశాల గురించి తెలుసుకోండి.

ఇండోనేషియా: ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇండోనేషియాను ఒకసారి సందర్శించాల్సిన ప్రదేశం. ముఖ్యంగా నూతన సంవత్సరం, క్రిస్మస్ సందర్భంగా.. ఈ ప్రదేశం సందర్శించదగినది. కోల్‌కతా నుండి మీరు ఇండోనేషియాకు సుమారు 20 నుండి 25 వేల వరకు టిక్కెట్లు పొందవచ్చు. ఒక నెల పాటు ఇక్కడ సందర్శించడానికి వీసా అవసరం లేదు.

మకావు: ట్రావెలింగ్‌ను ఇష్టపడే వారు ఒక్కసారైనా మకావును సందర్శించవచ్చు. క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా ఇక్కడి అందాలను చూడాల్సిందే. మీరు కోల్‌కతా నుండి ఇక్కడికి దాదాపు 40 వేలకు విమాన టిక్కెట్‌లను పొందవచ్చు. అంతేకాదు వీసా కూడా అవసరం లేదు.

థాయ్‌లాండ్: ప్రతి భారతీయుడు సందర్శించడానికి ఇష్టపడే ప్రదేశం థాయ్‌లాండ్. మీరు శీతాకాలపు సెలవుల్లో థాయ్‌లాండ్‌కు వెళ్లాలని ప్లాన్ చేస్తుంటే, మీరు ఇక్కడ వీసా తీసుకోవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ మీకు వీసా ఆన్ అరైవల్ లభిస్తుంది.

మాల్దీవులు: మాల్దీవులు ఒక హాట్ డెస్టినేషన్.. ఇక్కడ సెలబ్రిటీ నుండి సామాన్యుల వరకు ఇష్టంగా వెళ్లే దేశం. మీరు నూతన సంవత్సరానికి మాల్దీవులకు వెళ్లాలని ప్లాన్ చేస్తుంటే, ఇక్కడ కూడా మీరు వీసా తీసుకోవలసిన అవసరం లేదు.




