AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముంబైలో కశ్మీర్ ని మరపించే అందమైన హిల్స్ స్టేషన్స్.. ఒక్కసారి చూసినా జన్మ ధన్యం అంటారు..

వేసవి సెలవుల్లో నగరంలోని రణగొణధ్వనులకు దూరంగా మనసుకి ప్రశాంతతనిచ్చే ప్రాంతానికి దగ్గరగా వెళ్ళాలని కొన్ని రోజులైనా అక్కడ గడపాలని కోరుకుంటుంటే.. దేశ ఆర్ధిక రాజధాని ముంబై సమీపంలోని కొన్ని హిల్ స్టేషన్లు బెస్ట్ ఎంపిక. ఈ ప్రాంతాలు పర్యటనకు సరైనవి. వీటి అందం ఎంతగా పర్యాటకులను ఆకట్టుకుంటుందంటే.. ఆ హిల్ స్టేషన్స్ లో ఒకసారి సందర్శించిన తర్వాత.. ఏ మాత్రం సమయం దొరికినా మళ్ళీ మళ్ళీ అక్కడికి వెళ్లాలనిపిస్తుంది ఎవరికైనా.. ఈ రోజు ఆ హిల్ స్టేషన్ల గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం..

ముంబైలో కశ్మీర్ ని మరపించే అందమైన హిల్స్ స్టేషన్స్.. ఒక్కసారి చూసినా జన్మ ధన్యం అంటారు..
Best Hill Stations Near Mumbai
Surya Kala
|

Updated on: May 28, 2025 | 3:44 PM

Share

బిజీ బిజీ జీవితం, ట్రాఫిక్ రద్దీ, రోజువారీ అలసటతో విసుగు చెందిన మనసు.. ప్రశాంతత కోరుకుంటుంది. పచ్చదనం, చల్లని గాలి శరీరానికి, మనసుకు విశ్రాంతినిచ్చే ప్రదేశానికి వెళ్లాలని అనిపిస్తుంది. తరచుగా ప్రజలు వేసవి సెలవుల్లో లేదా వారాంతాల్లో కొన్ని రోజులు ప్రశాంతంగా గడపగలిగే చల్లని, అందమైన ప్రదేశం కోసం చూస్తారు. అటువంటి పరిస్థితిలో కాశ్మీర్, మనాలి లేదా సిమ్లా వంటి పేర్లు పర్యాటక ప్రాంతాలు అందరికీ గుర్తుకు వస్తాయి. అయితే కశ్మీర్ అందానికి ఏ మాత్రం తీసిపోని విధంగా ముంబై చుట్టూ కొన్ని హిల్ స్టేషన్లు ఉన్నాయని మీకు తెలుసా? ఇవి వీటి అందం, పచ్చదనం , వాతావరణం కారణంగా కాశ్మీర్‌ను మైమరపిస్తాయి.

అవును, ఈ హిల్ స్టేషన్లు చాలా దగ్గరగా ఉండటమే కాకుండా చాలా అద్భుతంగా ఉంటాయి. ఒక్కసారి వెళ్తే అక్కడే స్థిరపడితే బాగుంటుందని కూడా భావిస్తారు. కనుక ఈ వేసవి సెలవుల్లో కాశ్మీర్ వంటి చల్లని ప్రదేశానికి వెళ్లాలని ప్లాన్ చేస్తుంటే.. ముంబై సమీపంలోని ఈ హిల్ స్టేషన్లు ఖచ్చితంగా మీ పర్యటన ప్రాంతాల లిస్టు లో చేర్చుకోండి. ఆ హిల్ స్టేషన్లు ఏవి? అక్కడ చూడాల్సిన ప్రదేశాల గురించి తెలుసుకుందాం..

ఇవి కూడా చదవండి

ఖండాలా మహారాష్ట్రలోని అత్యంత ప్రసిద్ధ హిల్ స్టేషన్లలో ఒకటైన ఖండాలా ముంబై నుంచి 82 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి లోయలు, జలపాతాలు, పచ్చదనం మిమ్మల్ని మంత్రముగ్ధులను చేస్తాయి. వర్షాకాలంలో దీని అందం మరింత పెరుగుతుంది. రాజ్‌మాచి పాయింట్, డ్యూక్స్ నోస్, భూషి డ్యామ్, టైగర్ పాయింట్ ఇక్కడి ప్రధాన ఆకర్షణలు. ఇక్కడికి వెళ్ళిన పర్యాటకులు మంచి ప్రశాంతతను పొందుతారు.

ఈ పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో వీక్షించండి

మాథెరన్ మాథెరన్ ఆసియాలో ఏకైక ఆటోమొబైల్ రహిత హిల్ స్టేషన్. ఇది మరింత ప్రత్యేకమైనది. ముంబై నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రదేశం 2500 అడుగుల ఎత్తులో ఉంది. ఇక్కడి గాలి పూర్తిగా తాజాగా, కాలుష్యం లేకుండా ఉంటుంది. ఎకో పాయింట్, షార్లెట్ లేక్, పనోరమా పాయింట్ వంటి ప్రదేశాలు ఇక్కడ సందర్శించదగినవి. ఇక్కడ మీరు చిన్న రైలు ప్రయాణాన్ని కూడా ఆస్వాదించవచ్చు.

ఈ పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో వీక్షించండి

పంచగని హ్యాద్రి పర్వత శ్రేణిలో ఉన్న పంచగని ఒక విచిత్రమైన హిల్ స్టేషన్. సతారా జిల్లాలో ఉన్న ఒక అందమైన హిల్ స్టేషన్. ఇక్కడ ఉన్న ఐదు పర్వతాల పేరతో పంచగని పేరు వచ్చింది. ఆసియాలో రెండవ అతిపెద్ద పర్వత పీఠభూమి అయిన ఇక్కడి టేబుల్ ల్యాండ్ పర్యాటకులలో బాగా ప్రాచుర్యం పొందింది. స్ట్రాబెర్రీ తోటలు, ప్రశాంతమైన లోయలు, పాత బ్రిటిష్ భవనాలు ఈ ప్రదేశానికి ఒక ప్రత్యేక ఆకర్షణను ఇస్తాయి. ముంబై నుంచి 244 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రదేశం వారాంతపు విహారానికి అనువైనది.

మహాబలేశ్వర్ పంచగని నుంచి కొద్ది దూరంలో ఉన్న మహాబలేశ్వర్.. మహారాష్ట్రలోని అత్యంత ప్రసిద్ధ హిల్ స్టేషన్. ఇక్కడ వాతావరణం ఏడాది పొడవునా ఆహ్లాదకరంగా ఉంటుంది. వెన్నా సరస్సులో బోటింగ్, ఎల్ఫిన్‌స్టోన్ పాయింట్ నుండి లోయల దృశ్యం, పురాతన మహాబలేశ్వర్ ఆలయం, ఇవన్నీ కలిసి దీనిని గొప్ప పర్యాటక ప్రదేశంగా మారుస్తాయి. స్ట్రాబెర్రీ ప్రియులకు ఇది స్వర్గం వంటి ప్రాంతం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..