Summer Tips: చర్మానికే కాదు, జుట్టుకు కూడా ఎండలు ప్రమాదమే.. కేశాలను వేసవితాపం నుంచి రక్షించుకోండిలా..
Summer Tips: వేసవి ఎండలకు కాలమైన మే నెల రానే వచ్చింది. ఫిబ్రవరి నుంచే మండి పోతున్న ఎండలు ఈ నెలలో రెట్టింపు స్థాయిలో పెరిగినా ఆశ్చర్యం లేదు. అయితే చాలా మంది వేసవి కాలంలో చర్మ కోసం మాత్రమే స్కిన్‌కేర్ ప్రొడక్ట్స్ వాడుతుంటారు, కానీ జుట్టును పట్టించుకోరు. ఎందుకంటే వేసవి..
వేసవి ఎండలకు కాలమైన మే నెల రానే వచ్చింది. ఫిబ్రవరి నుంచే మండి పోతున్న ఎండలు ఈ నెలలో రెట్టింపు స్థాయిలో పెరిగినా ఆశ్చర్యం లేదు. అయితే చాలా మంది వేసవి కాలంలో చర్మ కోసం మాత్రమే స్కిన్‌కేర్ ప్రొడక్ట్స్ వాడుతుంటారు, కానీ జుట్టును పట్టించుకోరు. ఎందుకంటే వేసవి ఎండలు చర్మానికి మాత్రమే కాక జుట్టుకు కూడా హాని కలిగిస్తాయి. ఈ నేపథ్యంలో వేసవి ఎండల బారి నుంచి తప్పించుకునేందుకు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే చాలని నిపుణులు చెబుతున్నారు. వాటి ద్వారా జుట్టు రాలడం, చుండ్రు, పొడిబారిన జుట్టు వంటి కేశ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని, ఇంకా వాటిని తలెత్తకుండా కూడా చేయవచ్చని వివరిస్తున్నారు. ఈ క్రమంలో జట్టు సంరక్షణ కోసం వేసవి కాలంలో పాటించవలసిన చిట్కాలేమిటో ఇప్పుడు చూద్దాం..
- వేసవిలో సూర్యకిరణాల బారిన పడకుండా జుట్టును క్లాత్‌లతో, క్యాప్స్‌తో కవర్ చేసుకోవడం మంచిది. ముఖ్యంగా బయటకు వెళ్లే సమయాలలో తప్పనిసరిగా జుట్టుకు కొబ్బరినూనె పట్టించాలి. ఫలితంగా లోపలి నుంచి కూడా జట్టు దృఢంగా ఉంటుంది.
- ఫిట్నెస్ కోసం వర్క్అవుట్స్ చేసేవాళ్లు కూడా జుట్టును జాగ్రత్తగా కట్టుకోవాలి. లేదంటే అధిక చెమట వల్ల జుట్టు పాడైపోతుంది. వ్యాయామాలు చేసిన తర్వాత రెండు చేతి వేళ్లతో తలమీద మసాజ్ చేసినట్లు ప్రెస్ చేస్తే జుట్టు సమస్యల నుంచి ప్రమాదం తగ్గుతుంది.
- ఎండాకాలంలో వేడి నీళ్లతో తలస్నానం చేయకూడదు. దీని వల్ల జుట్టు కుదుళ్లు దెబ్బతినే అవకాశాలెక్కువ. అలాగే తల స్నానం కోసం సాధారణ కండిషనర్ షాంపూలను మాత్రమే వాడాలి.
- అయితే ఇలా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మంచి డైట్ పాటించకపోతే జుట్టు సమస్యలు అలానే ఉండిపోతాయి. అందుకే మంచి నీళ్లు, తాజా ఆకుకూరలు, పండ్లుతో పాటు గింజలు, కోడిగుడ్లు, చేపలు, మాంసాహారం వంటివాటిని సాధ్యమైనంత వరకు ఎక్కువ తీసుకోవాలి. ఫలితంగా మీ జుట్టుతో పాటు శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
- అలాగే కొందరు స్టయిల్ కోసం హీటింగ్ టూల్స్‌తో రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. రసాయనాలు, వేడివల్ల జుట్టు ఊడిపోతుంది. పెరుగుదల ఆగిపోతుందని గుర్తుంచుకోవాలి.
ఇవి కూడా చదవండి
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..