Indigestion in Winter: అజీర్తి సమస్య వేధిస్తోందా? ఈ సింపుల్ ఆహార నియమాలు పాటించండి..
చలికాలంలో జలుబు, దగ్గు వంటి ఫ్లూ లతో పాటు గ్యాస్ట్రోఎంటెరోలాజికల్ డిజార్డర్‌ల కారణంగా కడుపు నొప్పి, గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం, గుండెల్లో మంట లేదా డైయేరియా వంటి జీర్ణక్రియ సమస్యలు సాధారణంగా వ్యాపిస్తుంటాయి.
చలికాలం ఆస్వాదించడానికి చాలా బాగుంటుంది. అయితే అంతకు మించిన ఆరోగ్య సమస్యలే చుట్టుముడుతుంటాయి. ముఖ్యంగా జలుబు, దగ్గు వంటి ఫ్లూ లతో పాటు గ్యాస్ట్రోఎంటెరోలాజికల్ డిజార్డర్‌ల కారణంగా కడుపు నొప్పి వస్తుంటాయి. గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం, గుండెల్లో మంట లేదా డైయేరియా వంటి జీర్ణక్రియ సమస్యలు సాధారణంగా వ్యాపిస్తుంటాయి. కొంతమందిలో కడుపులో తీవ్ర అసౌకర్యంగా ఉంటుంది. చలికాలంలో మానవ శరీరంలో నెమ్మదిగా ఉండే జీర్ణ క్రియ కారణంగా చాలా మంది ఇలాంటి సమస్యలతో ఇబ్బందులు పడుతుంటారు. ఈ సమయంలో కడుపును ఖాళీ చేయడం.. పేగు కదలికలను సక్రమంగా ఉంచడం కష్టమవుతుంది. అందువల్ల ఈ సమస్యలు వస్తుంటాయి. ఈ నేపథ్యంలో చలికాలంలో జీర్ణ వ్యవస్థను సక్రమంగా ఉంచి, అజీర్తి సమస్యకు చెక్ పెట్టే చిన్న చిన్న చిట్కాల గురించి తెలుసుకుందాం..
ప్రాసెస్ చేసిన ఆహారం వద్దు.. ప్రాసెస్ చేసిన ఆహారాన్ని జీర్ణం చేయడానికి శరీరం చాలా కష్టపడుతుంది. దీనిలోని తక్కువ ఫైబర్ కంటెంట్ కారణంగా, ఈ భోజనం జీర్ణం కావడం కష్టం. అలాగే కొన్ని యాసిడ్స్ జీర్ణ వ్యవస్థను సక్రమంగా పనిచేయనివ్వదు. ఫలితంగా సమస్యలు మరింత ఎక్కువవుతాయి.
ఫైబర్ ఎక్కువ తీసుకోవాలి.. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు సక్రమమైన జీర్ణ వ్యవస్థకు ఊతమిస్తాయి. ఇది పెద్ద పేగు పనితీరును వేగవంతం చేస్తుంది. టాక్సిన్స్ ప్రభావాలను తగ్గిస్తుంది. హానికరమైన జెర్మ్‌లను తొలగించడంలో సహాయపడుతుంది.
ప్రోబయోటిక్స్ తప్పనిసరి.. ప్రోబయోటిక్స్ మంచి బ్యాక్టీరియాతో నిండి ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దీర్ఘకాలిక ఇన్ ఫ్లమేషన్ ను తగ్గిస్తాయి. ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను తీర్చిదద్దుతాయి. కూరగాయలు, కొబ్బరి కేఫీర్, ప్రోబయోటిక్ సప్లిమెంట్లతో సహా పులియబెట్టిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి.
చేదు ఆహారం మేలు.. కాలే, అరుగూలా, బచ్చలికూర, మెంతులు, పసుపు వంటి చేదు ఆహారాలు జీర్ణ వ్యవస్థను ప్రోత్సహిస్తాయి, ఇది ఆహారాన్ని విచ్ఛిన్నం చేసే ప్రక్రియను వేగవంతం చేస్తుంది.
హైడ్రేటెడ్ గా ఉండండి.. జీర్ణ వ్యవస్థ సక్రమంగా ఉండాలంటే మీ పొత్తి కడుపు సరైన ఆకృతిలో ఉండాలి. అంటే అన్ని సమపాళ్లలో తీసుకోవాలని అర్థం. మంచి ఆహారంతో పాటు సరిపడినంత నీరు తాగాలి. తద్వారా జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేయడంతో పాటు మలబద్ధకాన్ని నివారించవచ్చు.
ఆహారాన్ని బాగా నమిలి మింగండి.. ఆహారాన్ని చాలా మంది సక్రమంగా నమలకుండా మింగేస్తారు. కానీ ఆహారాన్ని నమలడం వల్ల అవి త్వరగా, సమర్ధవంతంగా విచ్ఛిన్నమవుతాయి. లాలాజలంలో అనేక జీర్ణ ఎంజైములు ఉంటాయి. ఇవి తింటున్న ఆహారం త్వరగా అరగడానికి ఉపకరిస్తాయి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..