AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Soaked Anjeer: అంజీర్‌ పండ్ల అసలు రహస్యం తెలిస్తే ఎగిరి గంతేస్తారు..! కానీ ఓ కండీషన్‌..

అంజీర్ పండ్లలోని పోషకాలు ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషించడమే అందుకు కారణం. అంజీర్ పండ్లను క్రమం తప్పకుండా తినడం వల్ల జీర్ణక్రియ పెరుగుతుంది. రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. పురుషుల సంతానోత్పత్తి సమస్యలను సైతం చిటికెలో నయం చేస్తుంది..

Soaked Anjeer: అంజీర్‌ పండ్ల అసలు రహస్యం తెలిస్తే ఎగిరి గంతేస్తారు..! కానీ ఓ కండీషన్‌..
అంజీర్ పండ్లు తినడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇది అనేక సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. అంజీర్ పండ్లలో విటమిన్ బి, విటమిన్ ఎ, విటమిన్ సి, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అంజీర్ పండ్లలో ఫైబర్ దండిగా ఉంటుంది.
Srilakshmi C
| Edited By: Janardhan Veluru|

Updated on: Oct 13, 2025 | 1:45 PM

Share

ఆరోగ్యానికి మేలు చేసే అంజీర్ పండ్లకు పురాతన కాలం నుంచి ఆయుర్వేదంలో విశిష్ట స్థానం ఉంది. వీటిల్లోని పోషకాలు ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషించడమే అందుకు కారణం. అంజీర్ పండ్లను క్రమం తప్పకుండా తినడం వల్ల జీర్ణక్రియ పెరుగుతుంది. రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. పురుషుల సంతానోత్పత్తి సమస్యలను సైతం నివారిస్తుంది. నిఫుణుల అభిప్రాయం ప్రకారం ఇంకా ఎన్నెన్ని లాభాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం..

జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది

అంజీర్ పండ్లలో అధిక స్థాయిలో ఫైబర్ ఉంటుంది. ఇది మలబద్ధకం నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. అంజీర్ పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. పేగులు శుభ్రంగా ఉంటాయి.

గుండె రక్షణ రక్షణ

అంజీర్ పండ్లలోని యాంటీఆక్సిడెంట్లు, పొటాషియం, మెగ్నీషియం రక్తపోటును నియంత్రిస్తాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

ఇవి కూడా చదవండి

రక్తంలో చక్కెర నియంత్రణ

అంజీర్ ఆకుల రసం కూడా మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఇన్సులిన్ ప్రభావాన్ని పెంచడంలో సహాయపడుతుంది.

ఎముకలకు బలం

కాల్షియం, భాస్వరం, మెగ్నీషియం ఉండటం ఎముకలు, దంతాలకు ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

రోగనిరోధక శక్తి పెంపు

అంజీర్ పండ్లలో విటమిన్ సి, విటమిన్ కె, వివిధ యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. అంజీర్ పండ్లలో సహజ చక్కెరలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. ఇది అలసటను తొలగించి, శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.

రక్త ప్రసరణ మెరుగు

అంజీర్ పండ్లు తినడం వల్ల రక్త ప్రవాహం సాధారణీకరిస్తుంది. లైంగిక అవయవాలకు తగినంత రక్త సరఫరా ఉన్నప్పుడు, అంగస్తంభన నాణ్యత మెరుగుపడుతుంది. సంతానోత్పత్తి పెరుగుతుంది.

యాంటీఆక్సిడెంట్ ప్రభావం

నేటి జీవనశైలిలో కాలుష్యం, ఒత్తిడి, ధూమపానం, ఆల్కహాల్ శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని కలిగిస్తాయి. ఇది స్పెర్మ్ DNA ను దెబ్బతీస్తుంది. అంజీర్ పండ్లలో ఉండే ఫ్లేవనాయిడ్, పాలీఫెనాల్ సమ్మేళనాలు ఈ హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను నాశనం చేయడం ద్వారా స్పెర్మ్‌ను రక్షిస్తాయి. తద్వారా పురుషుల సంతానోత్పత్తి సమస్యలు నయమవుతాయి. అంతేకాకుండా అంజీర్ పండ్లు హార్మోన్లను సమతుల్యం చేస్తాయి. అంజీర్ పండ్లలోని ఖనిజాలు, ఫైటోన్యూట్రియెంట్లు పురుష పునరుత్పత్తి హార్మోన్లను నియంత్రించడంలో సహాయపడతాయి. ఇవి పునరుత్పత్తి ప్రక్రియను ఆరోగ్యంగా చేస్తాయి.

ఎలా తినాలంటే?

ఎండిన అంజీర్ పండ్లను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం తినడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వీటిని స్మూతీస్, సలాడ్లు, పాలతో కూడా కలిపి తినవచ్చు. అయితే వీటిని అధికంగా తీసుకోవడం వల్ల విరేచనాలు అవుతాయి. కాబట్టి వీటిని పరిమిత పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి. రోజుకు 2 నుంచి 3 సార్లు తీసుకుంటే సరిపోతుంది.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.