Calcium: పాల కంటే వీటిలోనే క్యాల్షియం అధికం.. అవేంటంటే..

యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్‌ అగ్రికల్చర్‌ ప్రకారం 1 కప్పుడ తక్కువ కొవ్వు ఉన్న పాలలో 314 మిల్లిగ్రాముల క్యాల్షియం లభిస్తుంది. ఇది మీ రోజువారీ కాల్షియం విలువలో 24%. ఒక గ్లాసు పాలలో 125 మి.గ్రా కాల్షియం ఉంటుంది. అయితే పాల కంటే క్యాల్షియం ఎక్కువగా ఉండే పదార్థాల్లో పెరుగు ఒకటి. మరీ ముఖ్యంగా పెరుగులో కొన్ని రకాల పండ్లను కలుపుకొని తినడం వల్ల శరీరానికి కావాల్సిన...

Calcium: పాల కంటే వీటిలోనే క్యాల్షియం అధికం.. అవేంటంటే..
Calcium
Follow us

|

Updated on: Aug 05, 2024 | 8:06 PM

క్యాల్షియం ఆరోగ్యానికి ఎంతలా అవసరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దంతాలు, గోళ్లు, జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే క్యాల్షియం అవసరమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిపుణులు అభిప్రాయం ప్రకారం 14 నుంచి 18 ఏళ్ల మద్య వయసున్న వారికి రోజుకు 1300 ఎమ్‌జీ, 19 నుంచి 70 ఏళ్ల మధ్య వయసున్న వారికి 1000 నుంచి 1200 మిల్లీగ్రాముల క్యాల్షియం అవసరమని నిపుణులు చెబుతున్నారు. అయితే మనలో చాలా మందికి క్యాల్షియం అనగానే పాలు గుర్తొస్తాయి. అయితే పాల కంటే ఎక్కువ క్యాల్షియం లభించే ఆహార పదార్థాలు ఉన్నాయని మీకు తెలుసా.? ఇంతకీ పాల కంటే ఎక్కువ క్యాల్షియం లభించే ఆ ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్‌ అగ్రికల్చర్‌ ప్రకారం 1 కప్పుడ తక్కువ కొవ్వు ఉన్న పాలలో 314 మిల్లిగ్రాముల క్యాల్షియం లభిస్తుంది. ఇది మీ రోజువారీ కాల్షియం విలువలో 24%. ఒక గ్లాసు పాలలో 125 మి.గ్రా కాల్షియం ఉంటుంది. అయితే పాల కంటే క్యాల్షియం ఎక్కువగా ఉండే పదార్థాల్లో పెరుగు ఒకటి. మరీ ముఖ్యంగా పెరుగులో కొన్ని రకాల పండ్లను కలుపుకొని తినడం వల్ల శరీరానికి కావాల్సిన క్యాల్షియం పుష్కలంగా లభిస్తుంది.

బాదంలో కూడా క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. క్యాల్షియంకు బాదం పెట్టింది పేరు. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. అలాగే బాదంలో ఫైబర్, మెగ్నీషియం, విటమిన్ ఇ కూడా పుష్కలంగా ఉంటుంది. 1 కప్పు పాలతో పోల్చితే 1 కప్పు బాదంలోనే ఎక్కువ కాల్షియం ఉంటుంది. కాబట్టి పాలతో పోల్చితే బాదంలోనే క్యాల్షియం ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. ఆకు కూరల్లో కూడా క్యాల్షియం పుష్కలంగా లభిస్తుంది. వీటిలో ప్రధానమైంది కాలే. కాలే కూరగాయల్లో క్యాల్షియం పుష్కలంగా లభిస్తుంది. 100 గ్రాముల కాలేలో 250 మిల్లీ గ్రాముల క్యాల్షియం లభిస్తుంది. అయితే 100 గ్రాముల పాలలో లభించే క్యాల్షియం కేవలం 110 మిల్లీగ్రాముల మాత్రమే కావడం గమనార్హం.

కాబట్టి కాలేను క్రమం తప్పకుండా ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల బలమైన దంతాలు, ఎముకలను సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇక పాల కంటే ఎక్కువ క్యాల్షియం లభించే వాటిలో టోఫు కూడా ఒకటి. సోయా పాలతో తయారు చేసే టోఫులో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. 100 గ్రాముల టోఫులో 680 మిల్లీ గ్రాముల క్యాల్షియం లభిస్తుంది. ఇది ఒక గ్లాసు పాలలో లభించే క్యాల్షియం కంటే ఎక్కువ కావడం విశేషం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

పాల కంటే వీటిలోనే క్యాల్షియం అధికం.. అవేంటంటే..
పాల కంటే వీటిలోనే క్యాల్షియం అధికం.. అవేంటంటే..
నుదుటిపై  దర్శన్ పేరును పచ్చబొట్టుగా వేయించుకున్న అభిమాని..వీడియో
నుదుటిపై  దర్శన్ పేరును పచ్చబొట్టుగా వేయించుకున్న అభిమాని..వీడియో
తనకు గతంలో ఉన్న భద్రతను కొనసాగించాలని జగన్ పిటిషన్‌
తనకు గతంలో ఉన్న భద్రతను కొనసాగించాలని జగన్ పిటిషన్‌
వినియోగదారుల దెబ్బకు దిగొచ్చిన ఎయిర్‌టెల్… రీచార్జ్ ధరల సవరణ
వినియోగదారుల దెబ్బకు దిగొచ్చిన ఎయిర్‌టెల్… రీచార్జ్ ధరల సవరణ
బంగ్లాదేశ్‌లో తిరుగుబాటు.. ఈ ఐసీసీ టోర్నమెంట్‌పై సందిగ్ధం?
బంగ్లాదేశ్‌లో తిరుగుబాటు.. ఈ ఐసీసీ టోర్నమెంట్‌పై సందిగ్ధం?
శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయానికి పోటెత్తిన భక్తులు
శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయానికి పోటెత్తిన భక్తులు
అయ్యయ్యో.. సినిమా చెట్టు కూలిపోయింది....
అయ్యయ్యో.. సినిమా చెట్టు కూలిపోయింది....
ఈ బుడ్డోడిని గుర్తు పట్టారా?ఫస్ట్ మూవీకే ఫిల్మ్‌ఫేర్ కొట్టిన హీరో
ఈ బుడ్డోడిని గుర్తు పట్టారా?ఫస్ట్ మూవీకే ఫిల్మ్‌ఫేర్ కొట్టిన హీరో
ఫ్రెండ్‌ఫిప్‌ డే రోజు తీవ్ర విషాదం.. స్నేహితుల కళ్ల ముందే..
ఫ్రెండ్‌ఫిప్‌ డే రోజు తీవ్ర విషాదం.. స్నేహితుల కళ్ల ముందే..
నిరాశ పరిచిన 'లక్ష్య సేన్'.. కాంస్య పోరులో ఓటమి..
నిరాశ పరిచిన 'లక్ష్య సేన్'.. కాంస్య పోరులో ఓటమి..