Interesting Facts: వయసును బట్టి బయట పడే డయాబెటీస్ లక్షణాలు ఇవే.. జాగ్రత్త!

డయాబెటీస్ అనేది మహమ్మారిగా మారిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా డయాబెటీస్‌తో బాధ పడే రోగుల సంఖ్య బాగా ఎక్కువైపోయింది. చిన్న వయసులోనే చాలా మంది డయాబెటీస్‌తో ఇబ్బంది పడుతున్నారు. షుగర్ వ్యాధి అనేది అందరికీ ఒకేలా ఉండదు. ఒక్కొక్కరి వయసును బట్టి ఈ రోగం అనేది బయట పడుతుంది. ఈ మధుమేహం ఒక్కసారి వచ్చిందంటే అంత ఈజీగా పోదు. ఈ వ్యాధికి ఇంకా సరైన మెడిసన్ లేదు. కేవలం మీరు తీసుకునే ఆహారంతో మాత్రమే షుగర్‌ను అదుపు..

Interesting Facts: వయసును బట్టి బయట పడే డయాబెటీస్ లక్షణాలు ఇవే.. జాగ్రత్త!
Men Diabetes Symptoms
Follow us
Chinni Enni

|

Updated on: Feb 26, 2024 | 2:51 PM

డయాబెటీస్ అనేది మహమ్మారిగా మారిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా డయాబెటీస్‌తో బాధ పడే రోగుల సంఖ్య బాగా ఎక్కువైపోయింది. చిన్న వయసులోనే చాలా మంది డయాబెటీస్‌తో ఇబ్బంది పడుతున్నారు. షుగర్ వ్యాధి అనేది అందరికీ ఒకేలా ఉండదు. ఒక్కొక్కరి వయసును బట్టి ఈ రోగం అనేది బయట పడుతుంది. ఈ మధుమేహం ఒక్కసారి వచ్చిందంటే అంత ఈజీగా పోదు. ఈ వ్యాధికి ఇంకా సరైన మెడిసన్ లేదు. కేవలం మీరు తీసుకునే ఆహారంతో మాత్రమే షుగర్‌ను అదుపు చేయగలం. అయితే డయాబెటీస్ అనేది అందరి వయసులో వారికి ఒకేలా ఉండదు. వయసును బట్టి దాని లక్షణాలు అనేవి వేరుగా ఉంటాయని ఇటీవల నిపుణులు వెల్లడించారు. ఈ లక్షణాలను బట్టి మధుమేహం మహమ్మారిని ప్రారంభ దశలోనే నివారించుకోవచ్చు. వయస్సు ఆధారంగా కనిపించే షుగర్ వ్యాధి లక్షణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

చిన్నారుల్లో..

చిన్నారుల్లో ఎక్కువగా టైప్ 1 డయాబెటీస్ రావడం సహజం. ఈ వయసులో ఉన్న పిల్లలకు డయాబెటీస్ వస్తే.. ఎక్కువగా దాహం, మూత్ర విసర్జన, బరువును ఉన్నట్టుండి కోల్పోవడం, దృష్టి లోపం, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. తల్లిదండ్రులుగా పిల్లల్లో వచ్చే ప్రతి మార్పులు ఖచ్చితంగా గుర్తించాలి. ఎలాంటి మార్పులు కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలి. డయాబెటీస్ పరీక్షలు నిర్వహించడం వల్ల వ్యాధిని త్వరగా గుర్తించవచ్చు.

యువకుల్లో..

యువకుల్లో ఎక్కువగా టైప్ 2 డయాబెటీస్ వస్తుంది. అయితే వీరిలో అంత త్వరగా టైప్ 2 డయాబెటీస్ లక్షణాలు కనిపించవు. తరుచుగా ఇన్ ఫెక్షన్లకు గురి కావడం, గాయాలు త్వరగా తగ్గకపోవడం, బరువు పెరగడం, కిడ్నీలకు సంబంధిత సమస్యలు, చర్మం చికాకు పెట్టడం వంటి సమస్యలు యువకుల్లో కనిపిస్తాయి. కాబట్టి వీటిల్లో ఏ లక్షణం కనిపించినా టైప్ 2 డయాబెటీస్ పరీక్షలు చేయించుకోవడం మంచిది.

ఇవి కూడా చదవండి

వృద్ధులు:

వద్ధుల్లో కూడా షుగర్ వ్యాధి లక్షణాలు అనేవి అసలు కనిపించవు. వ్యాధి నెమ్మదిగా ఎక్కువ అవుతూ ఉంటే లక్షణాలు అనేవి కనిపిస్తాయి. వీరిలో తరుచుగా దాహం, మూత్ర విసర్జన, అలసట, దృష్టి లోపం వంటి లక్షణాలు కనిపిస్తాయి. గాయలు కూడా త్వరగా నయం కావు.

కాబట్టి అప్పుడప్పుడూ అయినా డయాబెటీస్, బీపీ వంటివి చెక్ చేయించుకోవడం చాలా ముఖ్యం. మీ శరీరంలో వచ్చే మార్పలు అనేవి నెమ్మదిగా జరుగుతాయి. కాబట్టి గమనించుకోవడం చాలా ముఖ్యం. లేదంటే వ్యాధి ముదిరి.. చికిత్స తీవ్రతరం అవుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా నిపుణులను సంప్రదించడం మేలు.

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..