Men Diabetes Symptoms: మగవారిలో డయాబెటీస్ లక్షణాలు ఇలా ఉంటాయట.. జాగ్రత్త!

షుగర్ వ్యాధితో బాధ పడేవారి సంఖ్య రోజు రోజుకూ ఎక్కువ అవుతుంది. షుగర్ అనేది ఇప్పుడు సాధారణ ప్రాబ్లమ్‌గా మారిపోయింది. మధుమేహం అనేది ఒక్కసారి వచ్చిందంటే.. దీన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. డయాబెటీస్‌ నుంచి బయట పడేందుకు సరైన మెడిసిన్ కూడా ఇంకా లేదు. కాబట్టి మీరు తినే ఆహారంతోనే షుగర్‌ను కంట్రోల్ చేసుకోవాలి. డయాబెటీస్ వచ్చాక బాధ పడే కన్నా.. రాకుండా ముందే జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే..

Men Diabetes Symptoms: మగవారిలో డయాబెటీస్ లక్షణాలు ఇలా ఉంటాయట.. జాగ్రత్త!
Men Diabetes Symptoms
Follow us
Chinni Enni

|

Updated on: Mar 20, 2024 | 3:35 PM

షుగర్ వ్యాధితో బాధ పడేవారి సంఖ్య రోజు రోజుకూ ఎక్కువ అవుతుంది. షుగర్ అనేది ఇప్పుడు సాధారణ ప్రాబ్లమ్‌గా మారిపోయింది. మధుమేహం అనేది ఒక్కసారి వచ్చిందంటే.. దీన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. డయాబెటీస్‌ నుంచి బయట పడేందుకు సరైన మెడిసిన్ కూడా ఇంకా లేదు. కాబట్టి మీరు తినే ఆహారంతోనే షుగర్‌ను కంట్రోల్ చేసుకోవాలి. డయాబెటీస్ వచ్చాక బాధ పడే కన్నా.. రాకుండా ముందే జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే.. ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా.. ఆరోగ్యంగా ఉంటారు. అయితే డయాబెటీస్ లక్షణాలు అనేవి అందరిలోనూ ఒకేలా ఉండవు. ఆడవారిలో ఒకలా, మగవారిలో ఒకలా.. చిన్న పిల్లల్లో మరోలా ఉంటాయి. దురద ఎక్కువగా రావడం, బరువు విపరీతంగా తగ్గడం, ఆకలి విపరీతంగా వేయడం, గాయాలు తగిలితే మానకపోవడం వంటివి సాధారణంగా కనిపించే మధుమేహం లక్షణాలు. అయితే తాజాగా జరిగిన అధ్యయనంలో మగవారిలో డయాబెటీస్ లక్షణాలు అనేవి వేరుగా ఉంటాయని తేలింది. మీరు వీటిని ముందుగానే గుర్తిస్తే.. సులభంగా నియంత్రించవచ్చు.

తిమ్మిర్లు ఎక్కువగా ఉంటాయి:

మగవారిలో డయాబెటీస్ వచ్చే ముందు.. వచ్చిన తర్వాత తిమ్మిర్లు అనేవి ఎక్కువగా కనిపిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా పెరగడం వల్ల ఇలా కాళ్లూ, చేతుల్లో తిమ్మిర్లు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. కాబట్టి తిమ్మిర్లు తరచుగా వస్తూ ఉంటే మాత్రం.. వైద్యుల్ని సంప్రదించడం మేలు. ఈ తిమ్మిర్లు అనేవి ఎక్కువగా పడుకునే సమయంలో వస్తాయి.

నరాలు దెబ్బతింటాయి:

మగవారిలో కనిపించే మరో షుగర్ వ్యాధి లక్షణం ఏంటంటే.. కాళ్లల్లో అలజడిగా ఉంటుంది. నరాలు దెబ్బతినడం వల్ల కాళ్లల్లో స్పర్శ కోల్పోవడం, కాళ్లకు గాయాలు అయితే మానకపోవడం వంటివి జరుగుతాయి. అలాగే చర్మం పొడిబారిపోవడం, కాళ్లు, చేతులు, వీపుపై దురద ఎక్కువగా ఉన్నా కూడా డయాబెటీస్ వచ్చినట్లే. కాబట్టి జాగ్రత్త పడటం అవసరం.

ఇవి కూడా చదవండి

అరికాళ్లలో మంటలు:

సాధారణంగా షుగర్ ఉన్నవాళ్లకు రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉంటాయి. ఈ షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉంటే.. అరికాళ్లలో మంటలుగా ఉండే అనుభూతి పొందుతారు. ఇది నిద్ర లేమికి కూడా దారి తీస్తుంది. తరచూ ఈ సమస్యతో బాధపడుతూ ఉంటే వైద్యుల్ని కలవడం మేలు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..