వివాహమైన స్త్రీలు తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన సీక్రెట్స్ ఇవే!
పెళ్లి అనేది మూడు ముళ్లబంధంతో ఇద్దరి మనసులు ముడి పడే ఓ అద్భుతమైన ఘట్టం. అయితే హిందూ సంప్రదాయంలో పెళ్లికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఇక వివాహం అయిన స్త్రీలు కూడా చాలా నియమాలు నిబంధనలు పాటించాలి. ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. వివాహిత మహిళలు తమ వైవాహిక జీవితంలో సంతోషంగా, ఎలాంటి కష్టాలు లేకుండా ఉండాలంటే తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలంట. అలాగే ఈ సీక్రెట్ అస్సలే మర్చిపోకూడదంట. అవి ఏవి అంటే?
Updated on: Jun 10, 2025 | 12:50 PM

వివాహిత స్త్రీలు తప్పకుండా మంగళ సూత్రం ధరించాలి. అంతే కాకుండా ప్రతి రోజూ నుదుట సింధూరం పెట్టుకోవాలంట. దీని వలన భర్త దీర్ఘాయువుగా ఉండటమే కాకుండా ఇది వైవాహిక బంధంలోని సమస్యలను తొలిగించి, భార్య భర్తల మధ్య ప్రేమానురాగాలను పెంచుతుందంట.

వాస్తు శాస్త్రం ప్రకారం పెళ్లైన కొత్త దంపతులు బెడ్ రూమ్ అనేది నైరుతి దిశలో మాత్రమే ఉండాలంట. దీని వలన వైవాహిక బంధం బలంగా ఉంటుందంట. అలాగే దంపతుల మధ్య ప్రేమ అనేది పెరుగుతుందని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

పెళ్లైన మహిళ చేతికి గాజులు, నుదుట తిలకం, మెడలో మంగళ సూత్రం, నెత్తిలో పూలు పెట్టుకొని నిండుగా కనిపించాలంట. అంతే కాకుండా ప్రతి రోజూ తులసి చెట్టును పూజించాలంట. దీని వలన వైవాహిక బంధంలోని సమస్యలు రాకుండా ఉంటాయంట. అందుకే ప్రతి మహిళ ప్రతి రోజూ ఉదయం తులసి చెట్టు ముందు దీపం వెలిగించి, పూజ చేయాలంట.

పెళ్లైన తర్వాత ప్రతి మహిళ ఓ పని చేయాలంట. వంటగదిలో ఆవు కోసం మొదటి రోటీని, కుక్క కోసం చివరి రోటీని తయారు చేసి రహస్యంగా వాటికి పెట్టాలంట. ఇలా చేయడం వలన కుటుంబంలోని కలహాలు తగ్గిపోవడమే కాకుండా, కొత్తగా పెళ్లైన మహిళకు అనేక ప్రయోజనాలు కలుగుతాయంట.అందుకే పెళ్లైన మహిళ తప్పకుండా ఈ సీక్రెట్ గుర్తు పెట్టుకొని, ఈ పని చేయాలంటున్నారు పండితులు.

అలాగే వాస్తు శాస్త్రంలో ఈశాన్య మూలను దేవతల ప్రదేశంగా భావిస్తారు. ఈ ప్రదేశంలో ధూళి లేదా బరువైన వస్తువులను ఉంచడం వల్ల వాస్తు దోషం ఏర్పడుతుంది. అంతేకాకుండా, ఇది ఇంట్లో కలహాలను సృష్టిస్తుంది. వివాహిత స్త్రీలు ఈ స్థలాన్ని శుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా, ప్రతిరోజూ ఇక్కడ దీపం పెట్టాలంట. దీని వలన భార్యభర్తల మధ్య ప్రేమ పెరుగుతుందంట.



















