Cancer: ఈ లక్షణాలు కనిపిస్తే.. కడుపు క్యాన్సర్‌ బారినపడినట్లే

మారిన జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా కడుపు క్యాన్సర్‌ బారిన పడుతోన్న వారి సంఖ్య ఇటీవల భారీగా పెరుగుతోంది. అయితే ఏ క్యాన్సర్‌ అయినా సరే తొలి దశలో గుర్తిస్తే మాత్రం చికిత్స చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. కడుపు క్యాన్సర్‌ను గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అని కూడా పిలుస్తుంటారు.....

Cancer: ఈ లక్షణాలు కనిపిస్తే.. కడుపు క్యాన్సర్‌ బారినపడినట్లే
Stomach Cancer
Follow us
Narender Vaitla

|

Updated on: Apr 29, 2024 | 9:18 PM

మారిన జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా కడుపు క్యాన్సర్‌ బారిన పడుతోన్న వారి సంఖ్య ఇటీవల భారీగా పెరుగుతోంది. అయితే ఏ క్యాన్సర్‌ అయినా సరే తొలి దశలో గుర్తిస్తే మాత్రం చికిత్స చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. కడుపు క్యాన్సర్‌ను గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అని కూడా పిలుస్తుంటారు.

కడుపులో ఏదైనా భాగంలో క్యాన్సర్ కణాలు పెరగడం ప్రారంభిస్తే దానిని కడుపు క్యాన్సర్ అంటారు. ప్రపంచంలోని ఆరో అత్యంత సాధారణ క్యాన్సర్స్‌లో కడుపు క్యాన్సర్‌ ఒకటి. అయితే కడుపులో వచ్చే క్యాన్సర్‌ను కొన్ని లక్షణాలు ద్వారా ముందుగానే గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కడుపు క్యాన్సర్ ఏ వయస్సులోనైనా పురుషులు, స్త్రీలు అనే తేడా లేకుండా వస్తుంది.

కడుపులో దీర్ఘకాలంగా మంటగా ఉండడం, అజీర్ణం సమస్య వెంటాడడం, గుండెలో దీర్ఘకాలంగా మంటగా ఉండడం వంటివి కడుపు క్యాన్సర్‌కు ప్రాథమిక లక్షణంగా చెబుతుంటారు. అలాగే కొంచెం ఆహారం తీసుకున్నా కడుపు ఉబ్బరంగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించి సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి. అలాగే కడుపులో నిత్యం నొప్పిగా ఉన్నా, గ్యాస్‌ సమస్యలు వెంటాడుతున్నా వెంటనే వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు. వీటితో పాటు నిత్యం అజీర్ణం సమస్యగా ఉన్నా, కడుపులో నొప్పిగా ఉంటున్నా. సంబంధిత పరీక్షలను చేయించుకోవాలని సూచిస్తున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?