AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lifestyle: కళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? లైట్‌ తీసుకుంటే చాలా డేంజర్‌…

అయితే కళ్లలో కనిపించే కొన్ని లక్షణాలనె ఎట్టి పిరస్థితుల్లో లైట్‌ తీసుకోకూడదని అలా చేస్తే శాశ్వత అధత్వానికి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. కంటి సమస్యల్లో ప్రధానంగా కనిపించేది గ్లకోమా ఒకటి. గ్లకోమా అంధత్వానికి కారణం కావచ్చొని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధిని సరైన సమయంలో గుర్తిస్తే చికిత్స..

Lifestyle: కళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? లైట్‌ తీసుకుంటే చాలా డేంజర్‌...
Eyes Health
Narender Vaitla
|

Updated on: Mar 11, 2024 | 5:32 PM

Share

సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. అంటే కళ్లు మనకు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కళ్ళు అనేవి మనకు దేవుడిచ్చిన అపురూపమైన నిధి. వాటిని జాగ్రత్తగా చూసుకోవడం మన విధి. అయితే మనలో చాలా మంది కంటి సమస్యలను పెద్దగా పట్టించుకోరు. సమస్య మరీ పెద్దగా మారితే తప్ప వైద్యులను సంప్రదించరు.

అయితే కళ్లలో కనిపించే కొన్ని లక్షణాలనె ఎట్టి పిరస్థితుల్లో లైట్‌ తీసుకోకూడదని అలా చేస్తే శాశ్వత అధత్వానికి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. కంటి సమస్యల్లో ప్రధానంగా కనిపించేది గ్లకోమా ఒకటి. గ్లకోమా అంధత్వానికి కారణం కావచ్చొని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధిని సరైన సమయంలో గుర్తిస్తే చికిత్స చేయవచ్చు. ఇంతకీ గ్లకోమా అంటే ఏంటి.? దీనిని ఎలా గుర్తించాలో ఇప్పుడు చూద్దాం..

కంటిలో ఉండే ఆప్టిక్ నరం దెబ్బతినడాన్ని గ్లకోమాగా చెబుతుంటారు. కంటి నుంచి మెదడుకు దృశ్య సమాచారాన్ని పంపడానికి ఆప్టిక్‌ నరాలు ఉపయోగపడుతాయి. అయితే కళ్లలో ఒత్తిడి పెరగడం వల్ల ఈ నరాలు దెబ్బతింటాయి. ఈ సమస్యను అలాగే వదిలేస్తే పూర్తిగా కళ్లు కనిపించవని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే గ్లకోమాకు ప్రారంభ లక్షణాలు అంటూ ఏవీ లేవని కానీ కాలక్రమేణా అది కంటి చూపును తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. గ్లకోమా పెరగడం వల్ల తలనొప్పి, కళ్లలో విపరీతమైన నొప్పి, వికారం లేదా వాంతులు, చూపు మందగించడం, కళ్లు ఎర్రబడడం వంటి సమస్యలు తరచుగా కనిపిస్తాయి. బల్బు లేదా లైట్‌ను చూసినప్పుడు ఒక ఐడిసెంట్ సర్కిల్ కనిపిస్తే, మీరు గ్లకోమా బాధపడుతున్నట్లు అర్థం చేసుకోవాలని చెబుతున్నారు.

ఈ సమస్య నుంచి త్వరగా బయటపడాలంటే.. క్రమం తప్పకుండా కంటి వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు. గ్లకోమాను తొలి దశలోనే గుర్తిస్తే సమస్య నుంచి బయటపడొచ్చు. వీలైనంత వరకు ఏడాదికి ఒకసారైనా కంటి పరీక్షలు చేయించుకోవాలని చెబుతున్నారు. ఇక గతంలో కుటుంబ సభ్యులు ఎవరైనా ఈ వ్యాధి బారిన పడితే ఇతరులకు కూడా వచ్చే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు.

నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..