AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lifestyle: కీళ్ల నొప్పులు వేధిస్తున్నాయా.? వెంటనే ఈ ఫుడ్‌ను మానేయండి..

కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులతో బాధపడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఒకప్పుడు 50 ఏళ్లు దాటిన వారిలో మాత్రమే కనిపించే ఈ సమస్యలు ఇప్పుడు 30 ఏళ్లు కూడా నిండని వారిలో కనిపిస్తున్నాయి. కాస్త దూరం నడవగానే మోకాళ్ల నొప్పులు వేధిస్తున్నాయి. ఎముకలు అరిగిపోవడం, బలహీనపడడం ఇలా కీళ్ల నొప్పులకు ఎన్నో...

Lifestyle: కీళ్ల నొప్పులు వేధిస్తున్నాయా.? వెంటనే ఈ ఫుడ్‌ను మానేయండి..
Joint Pains
Narender Vaitla
|

Updated on: Mar 11, 2024 | 5:14 PM

Share

కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులతో బాధపడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఒకప్పుడు 50 ఏళ్లు దాటిన వారిలో మాత్రమే కనిపించే ఈ సమస్యలు ఇప్పుడు 30 ఏళ్లు కూడా నిండని వారిలో కనిపిస్తున్నాయి. కాస్త దూరం నడవగానే మోకాళ్ల నొప్పులు వేధిస్తున్నాయి. ఎముకలు అరిగిపోవడం, బలహీనపడడం ఇలా కీళ్ల నొప్పులకు ఎన్నో కారణాలు ఉన్నాయి. అయితే ఇలా కీళ్ల నొప్పులతో బాధపడుతుంటే తీసుకునే ఆహారంలో మార్పుల చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకీ కీళ్ల నొప్పుల బాధ నుంచి విముక్తి లభించాలంటే ఎలాంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలో ఇప్పుడు చూద్దాం..

* కీళ్ల నొప్పులతో బాధపడే వారు వీలైనంత వరకు సోడా, కూల్ డ్రింక్స్ వంటి కార్బోనేటేడ్ డ్రింక్స్‌కు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. కార్బోనేటెడ్ పానీయాలలో ఉండే చక్కెర కంటెంట్ కాల్షియం నష్టానికి దారితీస్తుందని చెబుతున్నారు. దీంతో ఎముకల పెరుగుదలను ప్రభావితం చేస్తుంది. అంతేకాకుండా దంత సమస్యలకు ఇది దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు.

* ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ కూడా కీళ్ల నొప్పులకు కారణమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫ్రెంచ్ ఫ్రైస్‌లో ఉండే సోడియం ఎముకల్లోని కాల్షియం కంటెంట్ బలహీనపరుస్తుంది. కాబట్టి సోడియం ఎక్కువగా ఉండే ఫ్రెంచ్ ఫ్రైస్, బంగాళదుంప చిప్స్, బర్గర్లు, పిజ్జా లేదా ఏదైనా ఫాస్ట్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి.

* కెఫిన్‌ కూడా ఎముకల ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. కెఫిన్ కలిగిన డ్రింక్స్‌ను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎముకలు బలహీనపడతాయి. కాబట్టి కాఫీని మితంగా తీసుకోవాలి.

* చక్కెర కంటెంట్‌ ఎక్కువగా ఉండే చాక్లెట్లు, క్యాండీలు మన రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను సహజంగా పెంచుతాయి. దీంతో ఇది ఎముకల సాంద్రతను నేరుగా ప్రభావితం చేస్తుంది. చక్కెర ఎక్కువగా ఉండే.. ఐస్ క్రీం, కేకులు, లడ్డూలు, డెజర్ట్‌లు వంటి వాటికి వీలైనంత వరకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
రజినీకాంత్ చేసిన ఆ ఒక్క హెల్ప్‏తో చిరంజీవి లైఫ్ మారిపోయింది..
రజినీకాంత్ చేసిన ఆ ఒక్క హెల్ప్‏తో చిరంజీవి లైఫ్ మారిపోయింది..
తెలంగాణ ప్రజలకు సూపర్ న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్
తెలంగాణ ప్రజలకు సూపర్ న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్
రోజూ ఇడ్లీ, దోసెలేనా?.. పది నిమిషాల్లో 'మూంగ్లెట్' రెడీ
రోజూ ఇడ్లీ, దోసెలేనా?.. పది నిమిషాల్లో 'మూంగ్లెట్' రెడీ
Weekly Horoscope: వారికి ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు..
Weekly Horoscope: వారికి ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు..
ఇంట్లో పాలు విరిగిపోతున్నాయా? ఇలా చేస్తే రెండు రోజులు ఫ్రెష్‎గా
ఇంట్లో పాలు విరిగిపోతున్నాయా? ఇలా చేస్తే రెండు రోజులు ఫ్రెష్‎గా
జాతక దోషాలు తొలగించే ప్రదోష వ్రతం: మార్చిలో 3 ఏకంగా ప్రదోషాలు..!
జాతక దోషాలు తొలగించే ప్రదోష వ్రతం: మార్చిలో 3 ఏకంగా ప్రదోషాలు..!
భారత్ వెస్టిండీస్‌ను ఓడిస్తే.. సెమీఫైనల్ ఆడేది ఎప్పుడు?
భారత్ వెస్టిండీస్‌ను ఓడిస్తే.. సెమీఫైనల్ ఆడేది ఎప్పుడు?
భారత్-ఇరాన్ వ్యాపారం ఎంత పెద్దది? యుద్ధంతో ఎలాంటి ప్రభావం?
భారత్-ఇరాన్ వ్యాపారం ఎంత పెద్దది? యుద్ధంతో ఎలాంటి ప్రభావం?
జైలులో స్నేహం చేశాడని.. బయటికి రాగానే హత్య!
జైలులో స్నేహం చేశాడని.. బయటికి రాగానే హత్య!
50 లక్షలతో తీస్తే 120 కోట్ల వసూళ్లు.. ఓటీటీలో బ్లాక్ బస్టర్ మూవీ
50 లక్షలతో తీస్తే 120 కోట్ల వసూళ్లు.. ఓటీటీలో బ్లాక్ బస్టర్ మూవీ