Pressure Cooker Explosion: ఈ లక్షణాలు కనిపిస్తే.. మీ వంటింట్లో కుక్కర్ ఎప్పుడైనా పేలవచ్చు!
వంట కోసం కుక్కర్‌ను ఉపయోగించడం వల్ల ఆహారం త్వరగా తయారవడమే కాకుండా సమయం, గ్యాస్ కూడా ఆదా అవుతుంది. ఈ కుక్కర్ వల్ల ఎంత ప్రయోజనాలు ఉన్నాయో, దానిని సరిగ్గా ఉపయోగించకపోతే ప్రమాదం కూడా అంతే ఉంది. కొన్నిసార్లు వంట చేస్తున్నప్పుడు కుక్కర్ అకస్మాత్తుగా..

అన్నం వండటం నుంచి సాంబారు తయారీ వరకు చాలా వరకు గృహిణులు ప్రెషర్ కుక్కర్‌లోనే వంట చేస్తుంటారు. వంట కోసం కుక్కర్‌ను ఉపయోగించడం వల్ల ఆహారం త్వరగా తయారవడమే కాకుండా సమయం, గ్యాస్ కూడా ఆదా అవుతుంది. ఈ కుక్కర్ వల్ల ఎంత ప్రయోజనాలు ఉన్నాయో, దానిని సరిగ్గా ఉపయోగించకపోతే ప్రమాదం కూడా అంతే ఉంది. కొన్నిసార్లు వంట చేస్తున్నప్పుడు కుక్కర్ అకస్మాత్తుగా పేలిపోతుంది. అయితే కుక్కర్ పేలిపోయే ముందు కొన్ని ముందస్తు సూచనలు ఇస్తుంది. ఈ సూచనలను అర్థం చేసుకోవడం ద్వారా సరైన సమయంలో అవసరమైన చర్యలు తీసుకుంటే ప్రెషర్ కుక్కర్ పేలకుండా నిరోధించవచ్చు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
ప్రెషర్ కుక్కర్ పేలిపోయే ముందు కనిపించే సంకేతాలు ఇవే..
వింత శబ్దం లేదా మాడుతున్న వాసన
కుక్కర్ పేలడానికి ముందు వింత శబ్దం లేదా మాడుతున్న వాసన వస్తుంది. ఇది హెచ్చరిక సంకేతం. మీరు ఈ లక్షణాలను గమనించినట్లయితే వెంటనే గ్యాస్‌ను ఆపివేయండి.
అతిగా ఈలలు వేయడం
కుక్కర్‌లో వంట చేసేటప్పుడు వెంటవెంటనే ఈలలు వేస్తుంటే, గ్యాస్‌ను ఆపివేయాలి. కుక్కర్ లోపల పీడనం చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఈ రకమైన ఈలలు వినిపిస్తాయి. ఈ పీడనం కారణంగా కుక్కర్ పేలిపోయే అవకాశం ఉంది.
కుక్కర్ మూత వణుకుతుంటే
ప్రెషర్ కుక్కర్ మూత పదే పదే వణుకుతుంటే, అది ప్రమాదానికి సంకేతం కావచ్చు. ఈ రకమైన సంకేతం కనిపిస్తే వెంటనే గ్యాస్ ఆపివేసి, ఒత్తిడిని విడుదల చేయాలి. అనంతరం కుక్కర్ తెరిచి తనిఖీ చేయాలి.
రబ్బరు పట్టీ ఊడిపోవడం
ప్రెజర్ కుక్కర్ పైభాగంలో ఉన్న రబ్బరు రింగ్ పైకి లేవడం ప్రారంభించినా లేదా కరిగిపోయినట్లు కనిపించినా వెంటనే గ్యాస్‌ను ఆపివేయండి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవడం ద్వారా కుక్కర్ పేలిపోవడం వల్ల వంటగదిలో ప్రమాదాలను నివారించవచ్చు.
ప్రెజర్ కుక్కర్ పేలకుండా ఎలా నిరోధించాలి ?
వెంట్ పైపు మూసుకుపోనివ్వకండి
కొన్నిసార్లు కుక్కర్‌లో వంట చేసిన తర్వాత సరిగ్గా శుభ్రం చేయకపోవడం వల్ల వెంట్ పైపు మూసుకుపోతుంది. దీని కారణంగా కుక్కర్ లోపల ఆవిరి బయటకు రాదు. దీంతో కుక్కర్‌లో ఒత్తిడి పెరిగి అది పేలిపోవచ్చు. కాబట్టి ఎల్లప్పుడూ దీనిపై శ్రద్ధ పెట్టాలి.
రబ్బరును మార్చండి
కుక్కర్ మూతలో రబ్బరు సీల్ ఉంటుంది. ఇది ఆవిరి, నీరు బయటకు రాకుండా నిరోధిస్తుంది. ఇది విజిల్ పూర్తిగా, సమయానికి ఊదడానికి కూడా సహాయపడుతుంది. రబ్బరు వంట సమయంలో అరిగిపోయి చిరిగిపోతుంది. కాబట్టి మీరు ప్రతి మూడు నెలలకు ఒకసారి దానిని మార్చాలి.
కుక్కర్ ని ఎక్కువగా నింపకండి
కుక్కర్ పూర్తిగా నిండిపోయే వరకు కూరగాయలు లేదా ఆహార పదార్ధాలతో నింపకూడదు. దాన్ని పూర్తిగా నింపడం వల్ల లోపల ఉత్పత్తి అయ్యే ఆవిరి బయటకు వెళ్లడానికి మార్గం ఉండదు. దీనివల్ల పీడన స్థాయి వేగంగా పెరిగి కుక్కర్ పేలిపోయే అవకాశం ఉంది. అందువల్ల ఎల్లప్పుడూ కుక్కర్‌ను దాని సామర్థ్యంలో 2/3 వంతు మాత్రమే నింపాలి. సరైన మొత్తంలో నీటిని నింపాలి.
అధిక నాణ్యత గల కుక్కర్ల వాడకం
ఎల్లప్పుడూ ISI గుర్తు ఉన్న అధిక నాణ్యత గల కుక్కర్లను మాత్రమే వాడాలి. ఎందుకంటే వాటిలో ఉపయోగించే పదార్థాలు సురక్షితంగా, భద్రతా కవాటాలు బలంగా ఉంటాయి.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




