Budget Speech: స్వతంత్ర భారత చరిత్రలో నిర్మలా సీతారామన్ సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం చేసిన ఆర్థిక మంత్రిగా రికార్డు సృష్టించారు. 2020లో ఆమె 2 గంటల 42 నిమిషాలు ప్రసంగించారు. జశ్వంత్ సింగ్, ప్రణబ్ ముఖర్జీ వంటి వారి నిడివి రికార్డులు, మన్మోహన్ సింగ్, అరుణ్ జైట్లీల పదాల సంఖ్య రికార్డులతో ఈ బడ్జెట్ ప్రసంగాల చరిత్ర ఆసక్తికరంగా ఉంది.