AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్ టూ ఆస్ట్రేలియా.. వయా దుబాయ్.. కుక్క కోసం ఈ కపుల్ ఏం చేశారో తెలిస్తే..!

హైదరాబాద్ నగరానికి చెందిన ఓ దంపతులు ఆస్ట్రేలియా వెళ్లాల్సి వచ్చింది. వీరు తమ వెంట తాము పెంచుకున్న ఓ కుక్కను తీసుకెళ్లాలని భావించారు. కానీ, ఇది చాలా వ్యయప్రయాసాలతో కూడుకున్నదని ఆ తర్వాత తెలిసింది. అయినప్పటికీ.. తాము తమ కుటుంబ సభ్యుడిగా పెంచుకున్న కుక్కను తమ వెంట తీసుకెళ్లారు. ఇందుకు ఏకంగా 15 లక్షల రూపాయలను ఖర్చు చేయడం గమనార్హం.

హైదరాబాద్ టూ ఆస్ట్రేలియా.. వయా దుబాయ్.. కుక్క కోసం ఈ కపుల్ ఏం చేశారో తెలిస్తే..!
Dog Sky
Rajashekher G
|

Updated on: Jan 30, 2026 | 1:38 PM

Share

ఇంట్లో పెంచుకునే కుక్కలను కొందరు చాలా ప్రేమిస్తుంటారు. కుటుంబంలోని ఓ వ్యక్తిలా భావిస్తూ ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. వారు ఎటు వెళ్లినా కూడా దాన్ని కూడా తమతోపాటు తీసుకెళతారు. అయితే, హైదరాబాద్ నగరానికి చెందిన ఓ దంపతులు ఆస్ట్రేలియా వెళ్లాల్సి వచ్చింది. వీరు కూడా తమ వెంట తాము పెంచుకున్న ఓ కుక్కను తీసుకెళ్లాలని భావించారు. కానీ, ఇది చాలా వ్యయప్రయాసాలతో కూడుకున్నదని ఆ తర్వాత తెలిసింది. అయినప్పటికీ.. తాము తమ కుటుంబ సభ్యుడిగా పెంచుకున్న కుక్కను తమ వెంట తీసుకెళ్లారు. ఇందుకు ఏకంగా 15 లక్షల రూపాయలను ఖర్చు చేయడం గమనార్హం. ఇంత ఖర్చు చేయడం బదులు అక్కడే వేరే కుక్కను తీసుకోవాలని చాలా మంది బంధువులు సూచించినప్పటికీ వినలేదు. ఎందుకంటే అది తాము పెంచుకున్న కుక్క మాత్రమే కాదు.. అది తమ బిడ్డ అని ఆ దంపతులు చెబుతున్నారు.

ఆరు నెలల రేబిస్ లేని దేశంలో..

ఇందుకు సంబంధించిన విషయాలు హైదరాబాద్ జంట సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. హైదరాబాద్ నుంచి ఆస్ట్రేలియా వెళ్లాలని తాము నిర్ణియంచుకున్నప్పడు.. తమ వెంట తాము పెంచుకున్న కుక్క ‘స్కై’ని కూడా తీసుకెళ్లాలని నిశ్చయించుకున్నాము. అయితే, స్కైని నేరుగా ఆస్ట్రేలియాకు తీసుకెళ్లలేమని తెలిసినప్పుడు చాలా బాధపడ్డాం. అవి ఆరు నెలలపాటు రేబిస్ లేని దేశంలో ఉండాలని తెలిసి మరింత బాధ వేసింది. దీంతో ఆరు నెలలపాటు దుబాయ్ దేశంలో తమ స్కై ఉండాల్సి వచ్చిందని చెప్పారు. ఇది మాకు చాలా భారంగా అనిపించిందన్నారు.

15 లక్షలు ఖర్చు భారం కాలేదు కానీ..

స్కై కోసం తాము నెల రోజులపాటు దుబాయ్‌లోనే ఉన్నామని చెప్పారు. స్కై అక్కడ సురక్షితంగా ఉండగలదని తెలిసిన తర్వాతే తాము ఆస్ట్రేలియా వెళ్లామని తెలిపారు. తాము తమ బిడ్డ స్కై లేకుండా ఉండలేకపోయమని చెప్పారు. దుబాయ్‌లో నెలలపాటు స్కై ఉన్న సమయంలో నిరంతరం ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ చేశామని చెప్పారు. అది సురక్షితంగా ఉందని ఎప్పటికప్పుడు తెలుసుకున్నామని తెలిపారు. స్కై తమకు పెంపుడు జంతువు మాత్రమే కాదని.. తమ బిడ్డ అని చెప్పారు. ఆరు నెలల తర్వాత తమ స్కై తమ వద్దకు రావడంతో ఆ జంట ఆనందంతో మురిసిపోయింది. తాము ఖర్చు చేసిన రూ. 15 లక్షల కంటే తాము స్కైని మిస్ అయిన సమయమే భారంగా అనిపిచిందని ఆ జంట చెప్పింది.

సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఆ హైదరాబాద్ జంటపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మీలాంటి వ్యక్తులు ఆ కుక్కకు లభించడం అదృష్టకరమైన విషయం అని అన్నారు. ఇది డబ్బుకు సంబంధించిన విషయం కాదని.. ప్రేమకు సంబంధించిన విషయమని మరొకరు పేర్కొన్నారు. చాలా మంది డబ్బుల గురించే చూస్తున్నారని.. కానీ. ఈ జంట తమ ప్రియమైన స్కై కోసం చేసిన పని ప్రశంసనీయమని నెటిజన్లు కొనియాడుతున్నారు. కొందరు నెటిజన్లు తమకు ఎదురైన అనుభవాలను పంచుకున్నారు.