Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayurvedic herb: ఈ ఒక్క ఆయుర్వేద మూలికతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు అవేంటో తెలిస్తే నోరెళ్లబెడతారు

అనారోగ్యం సమస్యలను తగ్గించడంతో పాటు ఒత్తిడిని దూరం చేయడంలోనూ కొన్ని మొక్కలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అలాగే రోజ్మేరీ మొక్క వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలున్నాయి. రోగ నిరోధక శక్తిని పెంచడమే జ్ఞాపకశక్తిని పెంచడం..ఒత్తిడిని దూరం చేయడంలో ఈ మొక్క ఎక్కువగా ఉపయోగపడుతుంది.

Ayurvedic herb: ఈ ఒక్క ఆయుర్వేద మూలికతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు అవేంటో తెలిస్తే నోరెళ్లబెడతారు
Rosemary
Follow us
Srinu

|

Updated on: Mar 16, 2023 | 3:45 PM

భారతీయ ఆయుర్వేద వైద్యంలో ప్రతి మూలికా ప్రత్యేకమే. సాధారణంగా మొక్కలతో ఎన్నో సమస్యలను తగ్గించవచ్చనే విషయం అందరికీ తెలిసిందే. అనారోగ్యం సమస్యలను తగ్గించడంతో పాటు ఒత్తిడిని దూరం చేయడంలోనూ కొన్ని మొక్కలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అలాగే రోజ్మేరీ మొక్క వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలున్నాయి. రోగ నిరోధక శక్తిని పెంచడమే జ్ఞాపకశక్తిని పెంచడం..ఒత్తిడిని దూరం చేయడంలో ఈ మొక్క ఎక్కువగా ఉపయోగపడుతుంది. రోజ్మెరీ మొక్కను గుల్మెహందీ అని కూడా పిలుస్తారు. అల్జీమర్స్, చిత్త వైకల్యం ఉన్న వారికి రోగులకు చికిత్స చేయడానికి ఆయుర్వేదంలో ఈ మొక్కను విరివిగా ఉపయోగిస్తారు. రోజ్మెరీ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా ప్రభావవంతంగా పని చేస్తుంది. అలాగే ఆరోగ్య సంరక్షణలో సంభావ్య ఉపయోగాలు కలిగి ఉంటుంది. రోజ్మేరీ అనేది ఇనుము, కాల్షియం, విటమిన్లు ఏ,ీ సీ, బీ-6తో సహా ఇతర పోషకాలు ఉంటాయి. అయితే ఈ మూలికను పెద్ద మొత్తంలో వినియోగిస్తే వాంతులు, పల్మనరీ ఎడెమా వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. రోజ్మేరీ వల్ల కలిగే ఉపయోగాలు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.

  1. రోజ్మేరీలో సమృద్ధిగా లభించే యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ రసాయనాలు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి, అలాగే రక్త ప్రసరణను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
  2. రోజ్మేరీ వాసన మానసిక స్థితిని పెంచడానికి, మనస్సును శాంతపరచడానికి, అలాగే ఒత్తిడి హార్మోన్లలో దీర్ఘకాలిక ఆందోళన లేదా అసమతుల్యతతో బాధపడుతున్న వ్యక్తులలో ఒత్తిడిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది.  ఈ మూలిక దృష్టి, జ్ఞాపకశక్తిని పెంచుతుంది. చాలా మంది ఈ మూలిక తెలివితేటలను, చురుకుదనాన్ని పెంచుతుందని కూడా నమ్ముతారు.
  3. చుండ్రు, పొడి స్కాల్ప్ చికిత్స అలాగే జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో  రోజ్మేరీ ఆయిల్‌ చాలా బాగా పని చేస్తుంది.
  4. గుండెల్లో మంట, పేగు గ్యాస్, కాలేయం, పిత్తాశయం గురించిన సమస్యలు తీర్చడానికి అలాగే ఆకలి తగ్గడం వంటి జీర్ణ సమస్యలకు రోజ్మేరీని తరచుగా ఉపయోగిస్తే అద్భుత ఫలితాలు ఉంటాయి.
  5. రోజ్మేరీలోని రసాయన సమ్మేళనాలు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. తద్వారా మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. 

(ఈ కథనంలో అందించిన సమాచారం ప్రేక్షకుల ఆసక్తిని అనుసరించి ఇచ్చింది.  TV9 తెలుగు  ధృవీకరించలేదు. నిపుణులను సంప్రదించిన తర్వాత మాత్రమే దీన్ని అనుసరించాల్సి ఉంటుంది.)

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..