AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Boil Milk : పాలను స్టౌ మీద హడావిడిగా కాచేస్తున్నారా..అయితే జరిగే ప్రమాదం ఇదే..

ప్రతి ఒక్కరి ఆహారంలో పాలు ముఖ్యమైన భాగం. ఇది కాల్షియం, ప్రోటీన్, ఇతర ముఖ్యమైన పోషకాలకు మంచి మూలం. కాచిన తర్వాతనే పాలకు రుచి వస్తుంది. అప్పుడే తాగాలి. కానీ చాలా మందికి పాలు మరిగించే సరైన మార్గం తెలియదు.

Boil Milk : పాలను స్టౌ మీద హడావిడిగా కాచేస్తున్నారా..అయితే జరిగే ప్రమాదం ఇదే..
Boil Milk
Madhavi
| Edited By: Ravi Kiran|

Updated on: Apr 06, 2023 | 8:30 AM

Share

ప్రతి ఒక్కరి ఆహారంలో పాలు ముఖ్యమైన భాగం. ఇది కాల్షియం, ప్రోటీన్, ఇతర ముఖ్యమైన పోషకాలకు మంచి మూలం. కాచిన తర్వాతనే పాలకు రుచి వస్తుంది. అప్పుడే తాగాలి. కానీ చాలా మందికి పాలు మరిగించే సరైన మార్గం తెలియదు. తొందరపాటు కారణంగా, మనం పాలను స్టౌ మీద చాలా ఎక్కువ మంటతో వేడి చేయడం పాలు సరిగ్గా మరగకుండా చేయడం తరచుగా గమనించవచ్చు. ఈ విధంగా హడావుడిగా పాలు వేడి చేయడం మంచి పద్ధతి కాదు. చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి.

పాలను సరిగ్గా వేడి చేసిన తర్వాతే తాగాలి. దీనిపై పోషకాహార నిపుణుడు లవ్‌నీత్ బాత్రా ఇటీవల తన సోషల్ మీడియా పేజీలో పాలను వేడి చేయడానికి సరైన మార్గం చెప్పారు. పాలను హడావిడిగా కాచకూడదని పోషకాహార నిపుణుడు లవ్‌నీత్ బాత్రా ప్రకారం, పాలు చాలా త్వరగా కాచినప్పుడు, అందులో ఉండే సహజ చక్కెరలు కాలిపోతాయి,పాల ప్రోటీన్ విడిపోతుంది. అంతే కాదు, త్వరగా కాచడం వల్ల, పాత్రలో ఉన్న పాలు కాలిపోయి పాత్రకు అంటుకుంటాయి. ఈ విధంగా, మీరు అధిక మంట మీద పాలను వేడి చేస్తే, మీ స్టవ్ కూడా చెడిపోతుంది, ఎందుకంటే ఈ సమయంలో పాల నురుగు కూడా మీ స్టవ్ చుట్టూ పడవచ్చు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, మీరు పాలను త్వరగా కాచినట్లయితే, అందులో ఉండే నీరు ఆవిరైపోతుంది. కొవ్వు, ప్రోటీన్ , కార్బోహైడ్రేట్ల వంటి పోషకాలు దాని నుండి వేరవడం ప్రారంభిస్తాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఏదైనా ఆహారాన్ని అధిక మంటలో వండినప్పుడు, దానిలో ఉండే అవసరమైన పోషకాలు కోల్పోతాయి. దాని వల్ల ఆ ఆహారం యొక్క పూర్తి ప్రయోజనం లభించదు. అందుకే తక్కువ మంటలో ఆహారాన్ని వండాలని సూచిస్తారు. పాల విషయంలో కూడా అదే జరుగుతుంది.

ఇవి కూడా చదవండి

పాలు కాచడానికి సరైన మార్గం ఇదే:

నిపుణుల అభిప్రాయం ప్రకారం, పాలను వేడి చేయడానికి సరైన మార్గం తెలుసుకుందాం. తక్కువ వేడి మీద, సన్నటి మంట మీద పాలను వేడి చేయడం మంచి మార్గం. ఈ విధంగా, పాలను తక్కువ వేడి మీద మరిగించడం వల్ల, అందులో ఉండే హానికరమైన బ్యాక్టీరియా ఇతర వ్యాధికారక క్రిములు నాశనం అవుతాయి, దీని కారణంగా మీరు పాలు తాగడం వల్ల కూడా ప్రయోజనం పొందుతారు. ఇలాంటి పరిస్థితుల్లో పాలను కాచి తక్కువ మంటపై కాచి, పాలు మరిగి మీగడ రావడం గమనించిన తర్వాత పాలను తీసేసి ఆ తర్వాత తాగాలని నిపుణులు చెబుతున్నారు. పాలను ఎక్కువగా వేడి చేయకూడదని కూడా చెబుతున్నారు. ఎందుకంటే పాలను వేడి చేసిన ప్రతిసారీ అందులోని ప్రొటీన్లు నాశనమవుతాయి. అటువంటి పరిస్థితిలో, మీరు చాలా కాలం పాటు పాలను వేడి చేస్తే, అప్పుడు ప్రోటీన్ మరింత నాశనం అయ్యే అవకాశం ఉంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..