Pimples: ఈ పేస్ట్ రాసుకుంటే ముఖంపై మొటిమలు, మచ్చలు, గుంతలు మటుమాయం
మంతెన గారు చెప్పే బ్యూటీ టిప్స్, హెల్త్ టిప్స్ గురించి స్పెషల్‌గా చెప్పేది ఏముంది..? వంటింట్లో దొరికే పదార్థాలతో ఆయన చాలావాటిని రెమిడీస్ చెబుతారు. ఈ క్రమంలోనే ముఖంపై వచ్చే మొటిమలు, గుంతలు, మచ్చలు తగ్గిపోడానికి ఆయన మంచి చిట్కా చెప్పారు. అదేంటో తెలుసుకుందామా..?
మొటిమలు టీనేజ్ యువతను ఏ రేంజ్‌లో ఇబ్బంది పెడతాయో చెప్పల్సిన పనిలేదు. చాలామందికి ఇవి కొంతకాలానికి తగ్గిపోతాయి. కొందర్ని మాత్రం నిరంతరం వెంటాడుతూ ఉంటాయి. మొటిమలు తగ్గిపోయినా ఆయా ప్రాంతాల్లో గుంతలు పడుతూ ఉంటాయి. ఇవి ఓ రకంగా ఇబ్బందికరమే. మొటిమలను గిల్లడం లేదా పిండటం వలన ఈ గుంతలు ఏర్పడతాయి. మొటిమ దానంతట అది పక్వానికి వచ్చి పగిలినప్పుడు.. హీలింగ్ కూడా మంచిగా జరుగుతుంది. అది పక్వానికి రాకముందే మీరు గిల్లడం వల్ల అక్కడ స్కిన్ డ్యామేజ్ అవుతుంది. అప్పుడు ఏర్పడిన ఈ గుంతలు లైఫ్ ల్యాంగ్ అలానే ఉంటాయి.
డ్రై నట్స్ నానబెట్టి తినడం వల్ల.. ఈ గుంతలు నుంచి కొంతమేర బయటపడొచ్చు. అలానే వాటర్, జ్యూసులు వంటికి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అలాగే ముఖానికి నల్లరేగడి మట్టి పట్టించడం వల్ల కూడా మేలు జరుగుతుంది. నల్లరేగటి మట్టిని తీసుకుని.. దాన్ని కాసేపు నీటిలో నానబెట్టాలి. ఆ చల్లటి మట్టిని తీసుకుని.. అందులో కొంచెం పసుపు కలిపి.. ముఖానికి రాసుకుని.. ఒక అరగంట అలా వదిలేయాలి. ఇలా చేయడం వల్ల మొటిమలు తగ్గుతాయని.. మొటిమల వచ్చిన మచ్చలు తగ్గిపోతాయని డాక్టర్ మంతెన సత్యానారయణ రాజు తెలిపారు. అలానే ముఖంపై జిడ్డు కూడా తగ్గుతుందని వివరించారు.
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం