AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పేదవాడిని రాజుగా మార్చే శని దేవుని శక్తి! తప్పక దర్శించాల్సిన ప్రసిద్ధ శనీశ్వరాలయాలు

Shani Dev temples: భారతదేశంలో శని దేవునికి అంకితం చేసిన అనేక ప్రసిద్ధ ఆలయాలు ఉన్నాయి. శని అమావాస్య, శని జయంతి రోజుల్లో ఈ ఆలయాలకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. వాటిలో ముఖ్యమైన 5 శని దేవాలయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

పేదవాడిని రాజుగా మార్చే శని దేవుని శక్తి! తప్పక దర్శించాల్సిన ప్రసిద్ధ శనీశ్వరాలయాలు
Shani Dev Temples
Rajashekher G
|

Updated on: May 10, 2026 | 4:30 PM

Share

Famous Shani Temples in India: హిందూ ధర్మంలో శని దేవుడిని న్యాయాధిపతిగా, కర్మఫలాలను ప్రసాదించే దేవుడిగా భావిస్తారు. శని అనుగ్రహం ఉంటే జీవితంలో అడ్డంకులు తొలగి, స్థిరత్వం, విజయాలు లభిస్తాయని భక్తుల నమ్మకం. శని అమావాస్య, శని జయంతి వంటి ప్రత్యేక రోజులలో దేశవ్యాప్తంగా శని దేవాలయాల్లో భారీగా భక్తులు దర్శనం కోసం తరలివస్తారు. అలాంటి ఐదు ప్రసిద్ధ శని దేవాలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. శని సింగ్నాపూర్ ఆలయం, మహారాష్ట్ర (Shani Shingnapur Temple, Ahmednagar, Maharashtra)

ఈ ఆలయం శని భగవానుడి అత్యంత ప్రసిద్ధ క్షేత్రాలలో ఒకటి. ఇక్కడ శని దేవుని స్వయంభూ విగ్రహం ఉన్నదని నమ్మకం ఉంది. గ్రామంలో ఇళ్లకు తలుపులు లేకపోవడం ఈ క్షేత్ర ప్రత్యేకత. భక్తులు శని దేవుడిపై అపార విశ్వాసం ఉంచుతారు. శని శింగణాపూర్‌ను దర్శిస్తే కష్టాలు తొలగిపోతాయని విశ్వాసం ఉంది.

2. శని ధామ్, న్యూఢిల్లీ (Shani Dham Temple Fatehpur Beri, New Delhi)

ఢిల్లీలోని ఫతేపూర్ బెరిలో ఉన్న ఈ శని ధామ్ ఆలయం ఎంతో ప్రసిద్ధి. ఇక్కడ శని దేవుని భారీ విగ్రహం ఎనిమిది లోహాలతో తయారు చేయబడింది. భక్తులు ఇక్కడ శని దర్శనం చేసుకుని నూనె సమర్పించడం ద్వారా తమ సమస్యల నుంచి విముక్తి పొందుతారని నమ్ముతారు.

3. శని ధామ్, ప్రతాప్‌గఢ్, ఉత్తరప్రదేశ్ (Shani Dham Pratapgarh Temple, Uttar Pradesh)

ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌లో ఉన్న ఈ ఆలయం ప్రతి శనివారం ప్రత్యేక పూజలతో కళకళలాడుతుంది. భక్తులు 56 రకాల నైవేద్యాలు సమర్పించే సంప్రదాయం ఉంది. శని దేవునికి నూనె సమర్పించడం ద్వారా ఆరోగ్య సమస్యలు, జీవన సమస్యలు తొలగుతాయని విశ్వాసం ఉంది.

4. శని ఆలయం జుని ఇండోర్, మధ్యప్రదేశ్ (Shani Temple Juni Indore, Indore, Madhya Pradesh)

ఇండోర్‌లోని జూని ప్రాంతంలో ఉన్న ఈ శని ఆలయం చారిత్రక ప్రాధాన్యం కలిగినది. ఇక్కడ శని దేవుడు స్వయంగా సందర్శించాడని కథనాలు ఉన్నాయి. భక్తులు ఆవ నూనెతో తైలాభిషేకం చేసి తమ కోరికలు నెరవేరాలని ప్రార్థిస్తారు.

5. శనీశ్వర ఆలయం మోరీనా.. మధ్య‌ప్రదేశ్ (Shanichara Temple Morena, Morena, Madhya Pradesh)

గ్వాలియర్–మోరెనా సరిహద్దులో ఉన్న ఈ ఆలయం ఎంతో పురాతనమైనది. త్రేతాయుగానికి చెందినదిగా భావిస్తారు. ఇక్కడ ఉన్న శని విగ్రహం ఆకాశం నుంచి పడిన ఉల్కతో తయారైందని విశ్వాసం ఉంది. ఇది శని భక్తులకి అత్యంత పవిత్ర స్థలంగా భావించబడుతుంది. ఈ ఐదు శని దేవాలయాలు దేశవ్యాప్తంగా శని భక్తులకు ఎంతో ముఖ్యమైన పుణ్యక్షేత్రాలు. ప్రతి ఆలయం తన ప్రత్యేకతతో భక్తులను ఆకర్షిస్తూ ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం మతం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

Follow Us