మీరు గమనించారా? ఫోన్ ఎప్పుడూ కుడి చెవి వైపే ఎందుకు మాట్లాడతారో తెలుసా?

samatha

10 may 2026

ఈ మధ్య కాలంలో ఫోన్ లేని వారు ఎవరున్నారు చెప్పండి. స్కూల్‌కు వెళ్లే పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరి వద్ద ఫోన్ ఉంటుంది.

ఫోన్

ఇక ఫోన్ ఉన్న సమయంలో ఫోన్ మాట్లాడటం కూడా కామన్. అయితే ఎవరు అయినా సరే ఫోన్ వచ్చిన తర్వాత హాలో అని  కుడి వైపు మాత్రమే మాట్లాడతారు.

ఫోన్ మాట్లాడటం

మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు కుడి వైపు మాత్రమే ఎక్కువగా ఎందుకు ఫోన్ మాట్లాడుతారు. దీని గురించి నిపుణులు ఏమంటున్నారంటే?

కుడి వైపు మాట్లాడటం

ఫోన్ కుడి వైపున చెవి వైపు పెట్టుకోని మాట్లాడటానికి ముఖ్యకారణం మెదడు. మెదడు ఇచ్చే సిగ్నల్ వలన ఫోన్ కుడి చెవి వైపుకే వెళ్తుందంట.

మెదడు ఇచ్చే సిగ్నల్స్

మెదడుకు చెవికి చాలా దగ్గరి కనెక్షన్ ఉంటుంది. ముఖ్యంగా మానవ మెదడులో ఎడమ భాగం సమాచారం సేకరించి, చాలా త్వరగా విశ్లేషిస్తుందంట.

మెదడు, చెవికి కనెక్షన్

అయితే మనం కుడి చెవి ద్వారా వినేశబ్దాలు నేరుగా ఎడమ వైపు మెదడు చేరుతాయి. దీంతో వారు చెప్పేది స్పష్టంగా అర్థం అయ్యి, మనం త్వరగా వారికి రిప్లే ఇస్తామంట.

కుడి చెవి

ఇక ప్రపంచంలో చాలా మంది కుడి చేతి వాటం కలిగి ఉంటారు కాబట్టి, ఫోన్ వచ్చినప్పుడు అనుకోకుండా మన మెదడు ఇచ్చే సిగ్నల్స్ వలన ఫోన్ కుడి చెవి వైపుకే వెళ్తుందంట.

సిగ్నల్స్

అంతే కాకుండా కుడి చెవి వైపు ఫోన్ మాట్లాడటం వలన ఎక్కువ ఇబ్బంది అనిపించదు. సులభంగా పనులు చేసుకుంటూ ఫోన్ మాట్లాడవచ్చునంట అందుకే ఎక్కువ కుడి వైపు చెవి నుంచే ఫోన్ మాట్లాడుతారు.

ఫోన్ మాట్లాడటం