Krishna Vamsi : రమ్యకృష్ణ నేను దూరంగా ఉండడానికి కారణం అదే.. మా కొడుకు ఎక్కడ ఉన్నాడంటే.. డైరెక్టర్ కృష్ణ వంశీ..
డైరెక్టర్ కృష్ణ వంశీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగులో ఎన్నో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించిన ఆయన ప్రస్తుతం సైలెంట్ అయ్యారు. చివరగా రంగమార్తండ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చారు. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అలాగే రమ్య కృష్ణ తాను దూరంగా ఉండడానికి గల కారణాలను వెల్లడించారు.

దర్శకుడు కృష్ణవంశీ చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు ఎన్నో అద్భుతమైన సినిమాలు తెరకెక్కించిన ఆయన చివరగా రంగమార్తండ మూవీతో అలరించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన భార్య, అగ్రనటి రమ్యకృష్ణకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. రమ్యకృష్ణ నటనతో పాటు ఆమె వ్యక్తిత్వం, కుటుంబ జీవితం, అలాగే వారి దాంపత్యంపై వచ్చిన పుకార్ల గురించి ఆయన వివరించారు. కృష్ణవంశీ మాట్లాడుతూ, ప్రతి డైరెక్టర్‌కు ఒక ఫేవరెట్ హీరోయిన్ ఉంటుందని, అయితే తాను పని చేసిన హీరోయిన్‌లందరూ తనకు ఫేవరెట్ అని, వారందరూ దేవకన్యలేనని అన్నారు. రమ్యకృష్ణను చూసినప్పుడు ఆమె గొప్ప నటి అని తనకు తెలుసని, అయితే రంగమార్తాండ సినిమాలో ఆమెతో పనిచేస్తున్నప్పుడు ఆమె ఎంత గొప్ప నటి అనేది మరింత అర్థమైందని కృష్ణవంశీ వెల్లడించారు. బాహుబలిలోని శివగామి పాత్రకు స్క్రిప్ట్, డైలాగులు, స్టేజింగ్ వంటి బ్రహ్మాండమైన సపోర్ట్ ఉందని, అయితే రంగమార్తాండలో ఆమె కేవలం కళ్ళతోనే అద్భుతమైన నటనను ప్రదర్శించిందని అన్నారు. నరసింహలోని నీలాంబరి, బాహుబలిలోని శివగామి పాత్రలు ఒక ఎత్తు అయితే, రంగమార్తాండలో ఆమె పాత్ర ఇంకో ఎక్స్‌ట్రీమ్ అని ప్రశంసించారు.
ఎక్కువ మంది చదివినవి : యూట్యూబ్ నుంచి 30 లక్షల సంపాదన.. అసలు విషయం చెప్పిన సీరియల్ నటి..
రమ్యకృష్ణ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ, ఆమె చాలా సరదాగా ఉండే వ్యక్తి అని, చాలా తెలివైనదని, చురుకైనదని పేర్కొన్నారు. ఆమెను “డివైన్ చైల్డ్” అన్నారు. రమ్యకృష్ణకు వంట అంటే చాలా ఇష్టమని, షూటింగ్ సమయంలో కూడా లంచ్ బ్రేక్‌లో కారవాన్‌లో రెండు మూడు కూరలు, రకరకాల రసాలు వండుకుంటుందని తెలిపారు. ఇటీవల రమ్యకృష్ణ, కృష్ణవంశీ విడిపోయారంటూ వచ్చిన పుకార్లపై స్పందిస్తూ, తామిద్దరం ఆ వార్తలపై పగలబడి నవ్వుకున్నామని తెలిపారు. ఈ పుకార్లకు ప్రధాన కారణం తామిద్దరం ఎక్కువగా పబ్లిక్‌గా కనిపించకపోవడం, అలాగే రమ్యకృష్ణ చెన్నైలో, తాను హైదరాబాద్‌లో ఉండటమే కారణమని తెలిపారు. అయితే, ఈ వార్తలు చెడు ఉద్దేశంతో కాకుండా, ప్రజలకు తమపై ఉన్న అభిమానం వల్లే వచ్చాయని ఆయన అన్నారు. తమ వ్యక్తిగత జీవితాన్ని సోషల్ మీడియాలో పెట్టడానికి ఇష్టపడమని స్పష్టం చేశారు.
ఎక్కువ మంది చదివినవి : Actor : ఏంటీ సర్.. ఇలా మారిపోయారు.. ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్.. కట్ చేస్తే.. ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న పాపులర్ నటుడు..
కుమారుడు గురించి మాట్లాడుతూ, ప్రస్తుతం లండన్‌లో బిజినెస్ మేనేజ్‌మెంట్ చదువుతున్నాడని, సినిమాలపై ప్రస్తుతానికి ఆసక్తి లేదని కృష్ణవంశీ తెలిపారు. రమ్యకృష్ణ తన కుమారుడికి మంచి విలువలను నేర్పిందని, అద్భుతంగా పెంచిందని ఆయన ప్రశంసించారు. ఖడ్గం సినిమాలో సోనాలి బింద్రే పాత్రకు రమ్యకృష్ణ డబ్బింగ్ చెప్పిందని, ఒక గంటన్నరలోనే డబ్బింగ్ పూర్తి చేసిందని, ఆమె గొప్ప నటి అని తెలిపారు. నరసింహలోని రమ్యకృష్ణ పాత్ర నెగటివ్ షేడ్ కాదని, అది హృదయం పగిలిన ఒక బాధతో కూడిన స్థితి అని వివరించారు. మురారి రీ-రిలీజ్ సందర్భంగా కొందరు థియేటర్లలో పెళ్లి చేసుకోవడంపై కృష్ణవంశీ అసంతృప్తి వ్యక్తం చేశారు. వివాహం అనేది ఒక పవిత్రమైన క్రతువు అని, అది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య కాకుండా రెండు కుటుంబాలు, రెండు సంస్కృతులు, రెండు వాతావరణాల మధ్య జరిగే అద్భుతమైన వ్యవస్థ అని ఆయన స్పష్టం చేశారు. నెక్స్ట్ జనరేషన్ కోసం మన పూర్వీకులు దీనికి బ్రహ్మాండమైన ప్రాముఖ్యత ఇచ్చారని వివరించారు. తాను వ్యక్తిగత విషయాలు ఎవరికీ చెప్పనని, అలాగే పబ్లిక్ ప్రైవసీని గౌరవించే వారిని చూసి తాను పబ్స్, రెస్టారెంట్లకు వెళ్తానని కృష్ణవంశీ తెలిపారు.
ఎక్కువ మంది చదివినవి : Vijay Deverakonda : విజయ్ దేవరకొండ గుండెలపై కాలు పెట్టిన హీరోయిన్.. రౌడీ జనార్దన్ నుంచి పోస్టర్ రిలీజ్..
ఎక్కువ మంది చదివినవి : Sai Pallavi : ఆ హీరో నా ఫస్ట్ క్రష్.. అతడంటే చెప్పలేనంత ఇష్టం.. మనసులోని మాట చెప్పిన సాయి పల్లవి..
