సాయంత్రం టీలోకి బెస్ట్ స్నాక్.. రాగులతో మురుకులు, ఇలా చేస్తే బలానికి బలం, రుచికి రుచి!
samatha
10 may 2026
సమ్మర్ వచ్చిందంటే చాలు చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎలాంటి స్నాక్స్ చేసి పెట్టాలా అని ఎక్కువగా ఆలోచిస్తుంటారు.
సమ్మర్
ముఖ్యంగా సాయంత్రం అయ్యిందంటే చాలు పిల్లలు స్నాక్స్ తినడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. టీలోకి తప్పకుండా స్నాక్స్ ఉండాల్సిందే అంటారు.
టీ స్నాక్స్
మరి మీకు టీలోకి స్నాక్స్ ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారా? డోంట్ వర్రీ బలానికి బలం, రుచికి రుచి ఉండే రాగి మురుకులు తయారు చేయవచ్చును.
రాగి మురుకులు
వీటిని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు. రాగి పిండి మూడు కప్పులు, శనగ పిండి ఒక కప్పు, బియ్యం పిండి అరకప్పు. కారం, ఉప్పు, వాము, నువ్వులు.
కావాల్సిన పదార్థాలు
తయారీలోకి వెళితే..ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రాగి పిండి, శనగ పిండి, బియ్యం పిండి వేసి బాగా కలుపుకోవాలి.
తయారీ విధానం
తర్వాత ఇందులో వాము, ఉప్పు , కారం వేసి బాగా కలపాలి. తర్వాత నీళ్లు పోస్తూ మంచిగా మరీ మెత్తగా, మరీ గట్టిగా కాకుండా, మురకుల విరిగిపోకుండా, మధ్యస్థంగా కలుపుకోవాలి.
పిండి కలపడం
తర్వాత ఈ పిండిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టాలి. అందులో మురుకులు కాల్చుకోవడానికి సరపడ నూనె వేయాలి. తర్వాత అందులో మనం కలిపి పెట్టుకున్న పిండిని మురుకుల గొట్టంలో వేసి మురుకులు చుట్టుకోవాలి.
మురుకులు చుట్టుకోవడం
దీనిని వేడి వేడి నూనెలో వేయాలి. రెండు వైపులా బాగా కాలేలా చూసుకోవాలి. తర్వాత తీసుకొని వేరే ప్లేట్‌లో వేసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ మురుకులు రెడీ. టీలోకి అయినా నార్మల్‌గా తిన్నా అదిరిపోతాయి.