AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: అందుకే మాతో కలవండి.. మోదీ నవ్వుతూనే రేవంత్‌రెడ్డికి సలహా

PM Modi Hyderabad Visit: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ కు చేరుకున్నారు. అక్పడ మోదీని ఘన స్వాగతం లభించింది. ముఖ్యమంత్రిరేవంత్ రెడ్డి, గవర్నర్ శుక్లాలు మోదీని స్వాగతం పలికారు. బేగంపేట్ నుంచి నేరుగా HICCకి బయలుదేరి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి ప్రసంగించారు..

PM Modi: అందుకే మాతో కలవండి.. మోదీ నవ్వుతూనే రేవంత్‌రెడ్డికి సలహా
Pm Narendra Modi
Subhash Goud
|

Updated on: May 10, 2026 | 4:40 PM

Share

PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌లో పర్యటిస్తున్నారు. ముందుగా బేగంపేట్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న మోదీకి నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడ నుంచి HICCకి బయలుదేరి వెళ్లారు. అక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి శాలువతో సత్కరించి జ్క్షాపికను బహుకరించారు. అనంతరం కాకతీయ టెక్స్‌టైల్‌ను ప్రారంభించారు. అలాగే గుడెబలలూర్‌-మహబూబ్‌నగర్‌ 4 లేన్ల రహదారి నిర్మాణానికి వర్చువల్‌గా మోదీ శంకస్థాపన చేశారు. రూ.9,377 కోట్ల ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ… అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేలా సైబరాబాద్‌ను తీర్చిదిద్దుతున్నామని అన్నారు. సైబరాబాద్‌ అభివృద్దికి కేంద్రం వేలాది కోట్లు కేటాయించిందని మోదీ అన్నారు. సైబరాబాద్‌కు అంతర్జాతీయ స్థాయిలో పేరుందని పేర్కొన్నారు. దేశ అభివృద్ధిలో సైబరాబాద్‌ కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. ఇప్పుడు ప్రారంభించిన ప్రాజెక్టులతో వేలాది ఉద్యోగాలు వస్తాయని అన్నారు. మౌలిక వసతుల కల్పనకు మా ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు.

సీఎం రేవంత్‌రెడ్డి,మోదీ మధ్య HICCలో సున్నితమైన సంవాదం:

ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి,మోదీ మధ్య HICCలో సున్నితమైన సంవాదం జరిగింది. మన్మోహన్‌సింగ్‌ ప్రధానిగా ఉన్నప్పుడు గుజరాత్‌కి ఎలా ఇచ్చారో అలా ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి ప్రధానిని కోరారు. అయితే దీనికి మోదీ స్పందిస్తూ గుజరాత్‌కి ఆ రోజు ఎంత ఇచ్చారో ఇప్పుడు తెలంగాణకుఅంత ఇస్తే.. వచ్చేది మేము ఇవ్వాలనుకుంటున్నదానిలో సగమే వచ్చే అవకాశం ఉందని మోదీ అన్నారు.

ఆ రోజు గుజరాత్‌కి చేసిన కేటాయింపులకు రెట్టింపు అని, తెలంగాణకి ఇవ్వాలని ప్రయత్నిస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు. అందుకే మాతో కలవండి అంటూ రేవంత్‌రెడ్డికి నవ్వుతూ ప్రధాని మోదీ సలహా ఇచ్చారు.

Follow Us
ప్రపంచ ఇంధన వేదికపై మెరిసిన తెలుగు అమ్మాయి..!
ప్రపంచ ఇంధన వేదికపై మెరిసిన తెలుగు అమ్మాయి..!
తెలంగాణ స్త్రీ నిధి సంస్థలో ఉద్యోగాలు.. ఈ అర్హతలు ఉంటే జాబ్‌ మీదే
తెలంగాణ స్త్రీ నిధి సంస్థలో ఉద్యోగాలు.. ఈ అర్హతలు ఉంటే జాబ్‌ మీదే
విజయ్ కేబినెట్‌లో తెలుగమ్మాయి.. కీర్తన గురించి మీకు తెలుసా..?
విజయ్ కేబినెట్‌లో తెలుగమ్మాయి.. కీర్తన గురించి మీకు తెలుసా..?
పేదవాడిని రాజుగా మార్చే శని దేవుని శక్తి! తప్పక దర్శించాల్సిన ..
పేదవాడిని రాజుగా మార్చే శని దేవుని శక్తి! తప్పక దర్శించాల్సిన ..
ప్రధాని మోదీ పర్యటన వేళ ఒక్కసారిగా కలకలం..
ప్రధాని మోదీ పర్యటన వేళ ఒక్కసారిగా కలకలం..
టెన్త్‌ అర్హతతో SSBలో కానిస్టేబుల్ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
టెన్త్‌ అర్హతతో SSBలో కానిస్టేబుల్ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
అందుకే మాతో కలవండి.. మోదీ నవ్వుతూనే రేవంత్‌రెడ్డికి సలహా
అందుకే మాతో కలవండి.. మోదీ నవ్వుతూనే రేవంత్‌రెడ్డికి సలహా
చిన్ననాటి ఫొటో షేర్ చేసిన టాలీవుడ్ హీరోయిన్..ఎవరో గుర్తు పట్టారా?
చిన్ననాటి ఫొటో షేర్ చేసిన టాలీవుడ్ హీరోయిన్..ఎవరో గుర్తు పట్టారా?
రమ్యకృష్ణ నేను దూరంగా ఉండడానికి కారణం అదే..
రమ్యకృష్ణ నేను దూరంగా ఉండడానికి కారణం అదే..
మగవారికి 40 ఏళ్లు దాటాయా? అయితే అసలైన ఆట ఇప్పుడే మొదలవుతుంది
మగవారికి 40 ఏళ్లు దాటాయా? అయితే అసలైన ఆట ఇప్పుడే మొదలవుతుంది