Weight Loss: బరువు తగ్గాలనుకునేవారు ఈ లెక్కలు తెలుసుకోండి.. అప్పుడే మీ కేలరీలను కరిగించవచ్చు..
Weight Loss Tips: ఆధునిక జీవితంలో ప్రజలు ఏదిపడితే అది తింటున్నారు. ఇది మంచిదా చెడుదా అనేది ఆలోచించడం లేదు. దీని కారణంగా విపరీతంగా బరువు

Weight Loss Tips: ఆధునిక జీవితంలో ప్రజలు ఏదిపడితే అది తింటున్నారు. ఇది మంచిదా చెడుదా అనేది ఆలోచించడం లేదు. దీని కారణంగా విపరీతంగా బరువు పెరుగుతున్నారు. తర్వాత తగ్గించుకోవడానికి ఇబ్బందిపడుతున్నారు. కానీ ఏదైనా తినేముందు ఒక్కసారి ఆలోచించడం మంచిది. బరువు తగ్గడం అంత తేలికైన పని కాదు. మీరు త్వరగా బరువు తగ్గించడంలో సహాయపడే ఆహార పదార్థాలు శాశ్వతంగా బరువును తగ్గించలేవు. కొంతకాలం వరకే తగ్గిన బరువు అదుపులో ఉంటుంది. తర్వాత యధావిధిగా పెరుగుతుంది. బరువు అనేది ఒక క్రమపద్దతిలో తగ్గించాలి. దానికి ముందుగా ఈ మార్గాలు తెలుసుకోండి.
1. ఒక వారంలో ఎంత బరువు తగ్గాలి? NHS (UK) అధ్యయనం ప్రకారం.. ఒక వారంలో 0.5 నుంచి1 కిలో వరకు బరువు తగ్గడం ఆరోగ్యకరం. ఇంత కంటే ఎక్కువగా తగ్గితే పిత్తాశయ రాళ్లు, అలసట వంటి అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. వేగంగా బరువు తగ్గడానికి మీరు మీ ఆహారం, వ్యాయామ దినచర్యలో మార్పులు చేయాలి. స్థిరమైన జీవనశైలిలో వీటిని కొనసాగించాలి.
2. బరువు తగ్గించే లెక్కలు 0.45 కిలోల కొవ్వులో 3500 కేలరీలు ఉంటాయి. అందువల్ల ఒక వారంలో అర కిలో బరువు తగ్గాలంటే మీరు రోజూ తినే దానికంటే 500 ఎక్కువ కేలరీలు బర్న్ చేయాలి. 500X7 = 3500 కేలరీలు. ఇది అర కిలో బరువును తగ్గిస్తుంది.
3. త్వరగా బరువు తగ్గడం వల్ల కణజాల నష్టం జరగవచ్చు.. మీరు త్వరగా బరువు కోల్పోయినప్పుడు మీరు కొవ్వును కోల్పోకపోవచ్చు. ఈ ఎఫెక్ట్ కణజాలంపై పడిందని అర్థం. బరువు తగ్గించాలంటే రోజువారీ ఆహారంలో మార్పులతో పాటు శారీరక శ్రమను పెంచడం ఉత్తమం.
4. హెల్తీ వెయిట్ లాస్ జర్నీ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం మీ మొత్తం శరీర బరువులో 5 నుంచి 10 శాతం తగ్గించడం వల్ల రక్తపోటు, బ్లడ్ షుగర్, కొలెస్ట్రాల్ స్థాయిలలో సానుకూల ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యకరమైన ఫలితాలను చూడడానికి ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించాలి.