Fasting: ఉపవాస సమయంలో ఈ ఫుడ్ తింటున్నారా.? మీ ఆరోగ్యం డేంజర్‌లో పడ్డట్లే..
రడీ టు డ్రింక్ ఫాస్టింగ్ జ్యూస్‌లు, ప్రోటీన్ షేక్స్, ఎనర్జీ డ్రింక్స్, చిప్స్ లడ్డు వంటి ప్రాసెస్ ఫుడ్‌ను తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే రడీ టు ఈట్ ఫుడ్స్‌లో సహజంగానే ఉప్పు, చక్కెరతో పాటు పలు రకాల కెమికల్స్ ఉంటాయి. ఉపవాస సమయంలో ఇలాంటి ఫుడ్ తీసుకోవడం కారణంగా ఆరోగ్యం పాడవుతుందని నిపుణులు చెబుతున్నారు. అసలే ఉపవాసం చేసే సమయంలో కడుపు ఖాళీగా ఉంటుంది...

దేశ వ్యాప్తంగా దేవి నవరాత్రులు ప్రారంభమయ్యాయి. దీంతో చాలా మంది 9 రోజుల పాటు ఉపవాస దీక్షను ప్రారంభించారు. అయితే ఒకప్పుడు ఉపవాసం రోజున ఇంట్లో చేసుకున్న వంటను తినడం లేదా పండ్లను తీసుకునే వార. కానీ మారుతోన్న కాలం, బిజీగా మారుతోన్న జీవితాల కారణంగా చాలా మంది ఇన్‌స్టాంట్ ఫుడ్‌లవైపు మొగ్గు చూపుతున్నారు. మార్కెట్‌లో లభించే ప్యాకేజీడ్ ఫుడ్‌ను తీసుకుంటున్నారు. ఉపవాస సయంలో వంట ఏం చేస్తాంలే అన్న బద్దకమో, పని బిజీ కారణంగానో మార్కెట్లో దొరికే ఇన్‌స్టాంట్ వస్తువులను తెచ్చుకుని తీనేస్తున్నారు.
రడీ టు డ్రింక్ ఫాస్టింగ్ జ్యూస్‌లు, ప్రోటీన్ షేక్స్, ఎనర్జీ డ్రింక్స్, చిప్స్ లడ్డు వంటి ప్రాసెస్ ఫుడ్‌ను తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే రడీ టు ఈట్ ఫుడ్స్‌లో సహజంగానే ఉప్పు, చక్కెరతో పాటు పలు రకాల కెమికల్స్ ఉంటాయి. ఉపవాస సమయంలో ఇలాంటి ఫుడ్ తీసుకోవడం కారణంగా ఆరోగ్యం పాడవుతుందని నిపుణులు చెబుతున్నారు. అసలే ఉపవాసం చేసే సమయంలో కడుపు ఖాళీగా ఉంటుంది. అలాంటి సమయంలో అధికంగా చక్కెర, ఉప్పు, అనారోగ్యకరమైన కొవ్వు కారణంగా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి వేగంగా పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది.
ఇలాంటి ప్రాసెస్ట్ ఫుడ్ కారణంగా ఆకలి పెరుగుతుంది. దీంతో మనకు తెలియకుండానే ఎక్కువగా తినేస్తాం. కాలక్రమేణ ప్రాసెస్డ్ ఫుడ్‌ను అదే పనిగా తీసుకుంటే బరువు పెరుగుతాం. వీటితో పాటు మధుమేహం వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయని ఎన్నో పరిశోధనల్లో తేలింది. అందుకే ఉపవాసం చేస్తున్న సమయంలో ప్రాసెస్ చేసిన ఫుడ్‌ను తీసుకోవడం పూర్తిగా మానేయాలి. ఉపావాస సమయంలో వీలైనంత వరకు పౌష్టికాహారం తీసుకోవాలి. తాజా పండ్లతో పాటు ఇంట్లో వండుకున్న ఆహారాన్నే తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
ప్రాసెస్డ్ ఫుడ్ అంటే.. కొంత మేర ప్రాసెసింగ్ చేసిన ఆహారం అని అర్థం. చాలాకాలం పాటు నిల్వ ఉండాలన్న కారణంతో ఆహారానికి పలు రకాల రసాయనాలు, ప్రిజర్వేటివ్‌లను జోడిస్తారు. దీంతో ఈ ఫుడ్ ఎక్కువ కాలం పాడవకుండా ఉంటుంది. ఈ కారణంగా ఇలాంటి ఆహారం సహజంగా ఉండకుండా ఉప్పు, చక్కెర, కొవ్వు అధికంగా ఉంటాయి. ఇది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..
