ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆర్థరైటిస్ లక్షణాలు ఉన్నాయి. కాబట్టి, మీరు కీళ్లనొప్పులు ఉన్నప్పుడు చిలగడదుంపను తీసుకుంటే, ఆర్థరైటిస్ వల్ల కలిగే నొప్పి, మంట నుండి ఉపశమనం లభిస్తుంది. కాల్షియం లోపం ఎముకలను బలహీనపరుస్తుంది. కానీ మీరు శీతాకాలంలో దీనిని తీసుకుంటే అది ఎముకలను బలపరుస్తుంది. ఎందుకంటే ఇందులో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది.