AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fatty Liver: ఫ్యాటీ లివర్‌కు చెక్ పెట్టే సూపర్ ఫుడ్స్.. డాక్టర్లు సూచిస్తున్న ఆహారాలు ఇవే

Fatty Liver Superfoods: ఫ్యాటీ లివర్ ఇప్పుడు చాలా మంది ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్య. అయితే, ఈ సమస్యకు సరైన ఆహారం, క్రమమైన వ్యాయామం, జీవనశైలి మార్పులతో ఫ్యాటీ లివర్‌ను నియంత్రించుకోవచ్చు. అందుకే ముందే గుర్తించి జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. కాలేయంలో కొవ్వు తగ్గించేందుకు సహాయపడే 10 ముఖ్యమైన ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Fatty Liver: ఫ్యాటీ లివర్‌కు చెక్ పెట్టే సూపర్ ఫుడ్స్.. డాక్టర్లు సూచిస్తున్న ఆహారాలు ఇవే
Fatty Liver
Rajashekher G
|

Updated on: Feb 09, 2026 | 9:49 AM

Share

ఈ రోజుల్లో చాలా మందికి ఫ్యాటీ లివర్ సమస్య కనిపిస్తోంది. కాలేయంలో అవసరానికి మించి కొవ్వు చేరితే దాన్ని ఫ్యాటీ లివర్ అంటారు. దీని వల్ల కాలేయం పనితీరు తగ్గి, వాపు (ఇన్‌ఫ్లమేషన్) వస్తుంది. అధిక బరువు, షుగర్ (డయాబెటిస్), కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం, వ్యాయామం లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారం వంటి కారణాల వల్ల ఇది ఎక్కువగా కనిపిస్తుంది. మొదట్లో లక్షణాలు కనిపించకపోవచ్చు, కానీ నిర్లక్ష్యం చేస్తే లివర్ వాపు, లివర్ డ్యామేజ్ వంటి సమస్యలకు దారితీయొచ్చు. సరైన ఆహారం, క్రమమైన వ్యాయామం, జీవనశైలి మార్పులతో ఫ్యాటీ లివర్‌ను నియంత్రించుకోవచ్చు. అందుకే ముందే గుర్తించి జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. కాలేయంలో కొవ్వు తగ్గించేందుకు సహాయపడే 10 ముఖ్యమైన ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కాలేయానికి మేలు చేసే ఆహారాలు

1. వెల్లులి

వెల్లులి కాలేయంలో ఉన్న చెడు కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. రోజూ వంటల్లో కొద్దిగా వెల్లులి వాడటం మంచిది.

2. కాఫీ

రోజుకు 2 నుంచి 3 కప్పులు కాఫీ తాగితే కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. ఇది కాలేయంలో వాపును తగ్గిస్తుంది. ఎక్కువగా మాత్రం తీసుకోవద్దు.

3. గ్రీన్ టీ

గ్రీన్ టీలో ఉండే సహజ పదార్థాలు కాలేయంలో కొవ్వు చేరకుండా సహాయపడతాయి. రోజుకు ఒకటి లేదా రెండు కప్పులు సరిపోతాయి.

4. ఓట్స్

ఓట్స్‌లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచి, శరీరంలో కొవ్వు తగ్గించడంలో సహాయపడుతుంది.

5. బ్రోకోలి, క్యాబేజీ, కాలీఫ్లవర్

ఈ కూరగాయలు కాలేయాన్ని శుభ్రపరచే శక్తిని పెంచుతాయి. వారానికి కనీసం 3–4 సార్లు తీసుకోవడం కాలేయ ఆరోగ్యానికి చాలా మంచిది.

6. వాల్‌నట్స్

వాల్నట్స్‌‌లో మంచి కొవ్వులు (ఒమెగా-3) ఉంటాయి. ఇవి కాలేయంలో వాపును తగ్గిస్తాయి. రోజుకు 2–3 తీసుకున్నా సరిపోతాయి.

7. ఆవకాడో

అవొకాడో కాలేయాన్ని రక్షించే యాంటీఆక్సిడెంట్స్ కలిగి ఉంటుంది. కొద్ది పరిమాణంలో తీసుకున్నా సరిపోతుంది.

8. బెర్రీస్

స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ లాంటి పండ్లు కాలేయ కణాలను రక్షిస్తాయి. ఇన్‌ఫ్లమేషన్ తగ్గుతుంది. అందుకే వీటిని తక్కువ పరిమాణంలోనైనా క్రమం తప్పకుండా తీసుకోవాలి.

9. టోఫు / సోయా పదార్థాలు

ఇవి తక్కువ కొవ్వుతో కూడిన ప్రోటీన్ ఇస్తాయి. ఫ్యాటీ లివర్ ఉన్నవారికి మంచివి. వీటిని కూడా తక్కువ పరిమాణంలో తీసుకుంటే మంచిది.

10. ఆలివ్ ఆయిల్

వంటలో కొద్దిగా ఆలివ్ ఆయిల్ వాడితే కాలేయానికి మేలు జరుగుతుంది. ఇది మంచి కొవ్వు. ఇతర వంట నూనెల కంటే ఆలివ్ ఆయిల్ మీ ఆరోగ్యానికి చాలా మంచిది.

లివర్ హెల్త్ కోసం.. మరిన్ని మంచి అలవాట్లు

బియ్యం.. దీంతో చేసినవి, చక్కెర ఎక్కువగా తినకండి. నూనెతో చేసిన ఫాస్ట్ ఫుడ్ తగ్గించండి. మద్యం పూర్తిగా మానేయడం ఉత్తమం. రోజూ కనీసం 30 నిమిషాలు నడవండి. నీరు ఎక్కువగా తాగండి.

ఈ ఆహారాలు కాలేయ ఆరోగ్యానికి సహాయపడతాయి. కానీ తీవ్రమైన ఫ్యాటీ లివర్ సమస్య ఉంటే తప్పకుండా డాక్టర్ సలహా తీసుకోవాలి. ఆహారంతో పాటు జీవనశైలిలో మార్పులు కూడా అవసరమని వైద్యారోగ్య నిపుణులు సూచిస్తున్నారు.