వేసవిలో యూరిక్ యాసిడ్ సమస్యతో ఇబ్బందా.. వీటిని డైట్‌లో చేర్చుకోండి.. బెస్ట్ రిజల్ట్ మీ సొంతం..
యూరిక్ యాసిడ్ బాధితుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. వేసవిలో కూడా శరీరంలో యూరిక్ యాసిడ్ పెరుగుదలతో సమస్య ఏర్పడవచ్చు. శరీరంలో అధిక యూరిక్ యాసిడ్ ఉంటే.. బాధిత వ్యక్తి తీవ్రమైన కాళ్ల నొప్పులతో సహా అనేక అసౌకర్యాన్ని అనుభవించే పరిస్థితి ఏర్పడుతుంది. కనుక శరీరంలో యూరిక్ యాసిడ్ సమస్యను నివారించడానికి తినే ఆహారంలో కొన్ని హైడ్రేటెడ్ కూరగాయలను చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

శరీరంలో యూరిక్ యాసిడ్ పరిమాణం పెరగడం వల్ల అనేక సమస్యలు వస్తాయి. యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల చాలా మంది కీళ్ల నొప్పులతో బాధపడుతుంటారు. అటువంటి పరిస్థితిలో సరైన జీవనశైలిని, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అనుసరించడం చాలా ముఖ్యం. హెల్త్‌లైన్ నివేదిక ప్రకారం యూరిక్ యాసిడ్ అనేది జీర్ణక్రియ కారణంగా శరీరంలో పేరుకుపోయే వ్యర్థ పదార్థం. అయితే వేసవిలో యూరిక్ యాసిడ్‌ను నియంత్రించడానికి తినే ఆహారంలో కొన్నిటిని చేర్చుకోవాల్సి ఉంటుంది. కనుక యూరిక్ యాసిడ్‌ను సహజంగా తగ్గించడంలో సహాయపడే కూరగాయల గురించి ఈ రోజు తెలుసుకుందాం.. వీటిని మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా, వేసవిలో శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. యూరిక్ యాసిడ్ సమస్య తగ్గుతుంది.
కీర దోస
వేసవిలో కీర దోసకాయ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. దీనిలో అధిక మొత్తంలో నీరు కూడా ఉంటుంది. కీర దోసకాయ తినడం వల్ల యూరిక్ యాసిడ్ బయటకు పోవడంలో సహాయపడుతుంది. ఇది శరీరం నుంచి విషాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. కీరదోసకాయ జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది.
టమాటో
టమోటాలలో అధిక మొత్తంలో యాంటీ-ఆక్సిడెంట్లు, విటమిన్ సి ఉన్నాయి. ఇవి యూరిక్ యాసిడ్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. దీన్ని తినడం వల్ల శరీరంలో ప్యూరిన్ స్థాయి తగ్గుతుంది. వేసవిలో టమోటాలు తినడం వల్ల యూరిక్ యాసిడ్ నియంత్రణలో ఉండడమే కాదు టమాటా శరీరాన్ని చల్లబరుస్తుంది.
పొటల్స్
సీజన్ కూరగాయ అయిన పొటల్స్ లో కూడా విటమిన్ సి కూడా సమృద్ధిగా లభిస్తుంది. వీటిని తినడం వల్ల శరీరంలో జీవక్రియ పెరుగుతుంది. దీని కారణంగా ప్యూరిన్ సులభంగా శరీరం నుంచి విసర్జించబడుతుంది . అధిక యూరిక్ యాసిడ్ స్థాయి ప్రమాదం కూడా తగ్గుతుంది.
నిమ్మకాయ
నిమ్మకాయ విటమిన్ సి అత్యధికంగా ఉన్న వనరుగా పరిగణించబడుతుంది. ఇది శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుతుంది. సహజంగా కొల్లాజెన్‌ను కూడా పెంచుతుంది. ఎవరైనా యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతుంటే ఒక గ్లాసు నీటిలో నిమ్మరసం కలిపి త్రాగవచ్చు. నిమ్మరసం తాగడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయి వేగంగా తగ్గుతుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)