Muskmelon Seeds: ఖర్బూజా తిని గింజలు పాడేస్తున్నారా.. ఈ బెనిఫిట్స్ మిస్సయినట్లే!

వేసవి కాలం వచ్చిందంటే దొరికే పండ్ల జాబితాలో మస్క్ మిలన్ అదే ఖర్బూజా కూడా ఒకటి. ఎండా కాలం వచ్చిందంటే పుచ్చకాయలు, మామిడి పండ్లు, ఖర్బూజాలు ఎక్కడ పడితే అక్కడే దొరుకుతాయి. వీటిని తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అలాగే ఖర్బూజాలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది సమ్మర్ ఫ్రూట్ మాత్రమే. కేవలం వేసవి సీజన్‌లో మాత్రమే లభిస్తుంది. బాడీ కూల్ చేసే ఈ ఫ్రూట్‌ని ఎంతో మంది ఇష్ట పడి మీర లాగించేస్తారు. ఖర్బూజా తింటూ సాధారణంగా..

Muskmelon Seeds: ఖర్బూజా తిని గింజలు పాడేస్తున్నారా.. ఈ బెనిఫిట్స్ మిస్సయినట్లే!
Muskmelon Seeds
Follow us

|

Updated on: Mar 28, 2024 | 2:07 PM

వేసవి కాలం వచ్చిందంటే దొరికే పండ్ల జాబితాలో మస్క్ మిలన్ అదే ఖర్బూజా కూడా ఒకటి. ఎండా కాలం వచ్చిందంటే పుచ్చకాయలు, మామిడి పండ్లు, ఖర్బూజాలు ఎక్కడ పడితే అక్కడే దొరుకుతాయి. వీటిని తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అలాగే ఖర్బూజాలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది సమ్మర్ ఫ్రూట్ మాత్రమే. కేవలం వేసవి సీజన్‌లో మాత్రమే లభిస్తుంది. బాడీ కూల్ చేసే ఈ ఫ్రూట్‌ని ఎంతో మంది ఇష్ట పడి మీర లాగించేస్తారు. ఖర్బూజా తింటూ సాధారణంగా వీటిల్లోని గింజల్ని పారేస్తూ ఉంటారు. కానీ ఇందులో కూడా శరీరానికి ఉపయోగపడే పోషకాలు ఉన్నాయట. వటిని క్యాంటలోప్ గింజలు అని పిలుస్తారు. మరి ఈ గింజల్లో ఎలాంటి పోషకాలు ఉన్నాయి? వీటిని తింటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం.

ఎముకలు బలంగా ఉంటాయి:

ఖర్బూజా గింజల్ని తినడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. ఈ సీడ్స్‌లో మెగ్నీషియం, క్యాల్షియం, ఫాస్పరస్ వంటివి ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యాన్ని కాపాడతాయి. అలాగే దంతాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. త్వరగా పళ్లు ఊడిపోకుండా ఉంటాయి.

వెయిట్ లాస్ అవుతారు:

ఖర్బూజా పండుతో పాటు ఈ గింజలు తినడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వీటిల్లో ఫైబర్ అనేది అధికంగా లభ్యమవుతుంది. ఫైబర్ ఉన్న పదార్థాలు తింటే త్వరగా కడుపు నిండుతుంది. దీంతో ఇతర ఆహారాలు తినలేరు. అంతే కాకుండా ఈ పండు తింటే జీర్ణ క్రియ కూడా మెరుగ్గా జరుగుతుంది. కొలెస్ట్రాల్ లెవల్స్ కూడా తగ్గుతాయి. కాబట్టి ఈజీగా వెయిట్ లాస్ అవుతారు.

ఇవి కూడా చదవండి

గుండె ఆరోగ్యం:

ఖర్బూజా పండులోని గింజల్లో ఓమేగా 3, ఓమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్, అన్ శాచురేటెడ్ ఫ్యాట్ అనేది లభిస్తుంది. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో ఎంతో మేలు చేస్తుంది. గుండె సంబంధిత సమస్యలు దరి చేరకుండా కాపాడతాయి. కొలెస్ట్రాల్ లెవల్స్‌ను కూడా తగ్గిస్తాయి.

ఇతర ప్రయోజనాలు:

అదే విధంగా ఇందులో నీటి శాతం అధికంగా ఉంటుంది కాబట్టి.. సమ్మర్‌లో ఈ ఫ్రూట్ తింటే డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. అలాగే చర్మ, జుట్టు సమస్యలు కూడా తగ్గుతాయి. జీర్ణ క్రియ మెరుగు పడుతుంది. పొట్ట సంబంధిత సమస్యలు కూడా తలెత్తవు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

రుద్రాణి ప్లాన్ సక్సెస్.. అప్పూ, కళ్యాణ్‌లు జైలుకు.. పాపం అనామిక!
రుద్రాణి ప్లాన్ సక్సెస్.. అప్పూ, కళ్యాణ్‌లు జైలుకు.. పాపం అనామిక!
గుడ్‌ న్యూస్‌.. నెమ్మదిగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.!
గుడ్‌ న్యూస్‌.. నెమ్మదిగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.!
చేదు రోజులు గుర్తుచేసుకున్న బిగ్‏బాస్ కీర్తి..
చేదు రోజులు గుర్తుచేసుకున్న బిగ్‏బాస్ కీర్తి..
అందుకు ఒప్పుకుంటేనే ఆయుధాలు వీడతాం.! హమాస్‌ నేత వ్యాఖ్యలు
అందుకు ఒప్పుకుంటేనే ఆయుధాలు వీడతాం.! హమాస్‌ నేత వ్యాఖ్యలు
రాజస్థాన్ దండయాత్రను లక్నో అడ్డుకునేనా.. రికార్డులు ఎలా ఉన్నాయంటే
రాజస్థాన్ దండయాత్రను లక్నో అడ్డుకునేనా.. రికార్డులు ఎలా ఉన్నాయంటే
పాకిస్తాన్ యువతికి.. భారతీయుని గుండె.! మానవత్వం చాటిన వైద్యులు.
పాకిస్తాన్ యువతికి.. భారతీయుని గుండె.! మానవత్వం చాటిన వైద్యులు.
నాగమణి చెంత ఉంటే అతీత శక్తులు వస్తాయా..? నిజం ఇదే...
నాగమణి చెంత ఉంటే అతీత శక్తులు వస్తాయా..? నిజం ఇదే...
వయసు ఒక నెంబర్ మాత్రమే.. 60 ఏళ్ల వయసులో అందాల సుందరి కిరీటం
వయసు ఒక నెంబర్ మాత్రమే.. 60 ఏళ్ల వయసులో అందాల సుందరి కిరీటం
గోధుమ రవ్వతో ఇలా ఇడ్లీలు చేయండి.. హెల్త్‌తో పాటు రుచి కూడా..
గోధుమ రవ్వతో ఇలా ఇడ్లీలు చేయండి.. హెల్త్‌తో పాటు రుచి కూడా..
రాగి పిండితో పునుగులు ఇలా చేస్తే.. రుచితో పాటు ఆరోగ్యం కూడా!
రాగి పిండితో పునుగులు ఇలా చేస్తే.. రుచితో పాటు ఆరోగ్యం కూడా!