AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sleep Rule: నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా.. 10-3-2-1 నియమం పాటించండి.. బెస్ట్ రిజల్ట్ మీ సొంతం

ఎవరైనా సరే మానసిక స్థితిని చక్కగా ఉంచుకోవడానికి, రోజంతా శక్తివంతంగా ఉండటానికి రాత్రి సరైన నిద్ర పోవడం చాలా ముఖ్యం. పోషకాహార నిపుణురాలు దీప్శిఖా జైన్ తన సోషల్ మీడియాలో ఒక వీడియోను పంచుకుంటూ.. 10-3-2-1 ఫార్ములా గురించి చెప్పారు. దీని సహాయంతో నిద్రలో నాణ్యతను మెరుగుపరుచుకోవచ్చు.

Sleep Rule: నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా.. 10-3-2-1 నియమం పాటించండి.. బెస్ట్ రిజల్ట్ మీ సొంతం
Sleep Rule
Surya Kala
|

Updated on: Aug 15, 2024 | 10:55 AM

Share

నేటి ఆధునిక జీవనశైలి మనిషి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ రోజుల్లో చాలా మంది రాత్రి సమయుంలో త్వరగా నిద్ర రావడం లేదని వాపోతూ ఉంటారు. లేదా కొన్నిసార్లు నిద్రపోతున్నప్పుడు ఏ చిన్న శబ్దం అయినా సరే నిద్రకు అంతరాయం కలుగుతుంది. దీనికి కారణం నిద్ర లేమి. అటువంటి పరిస్థితిలో ఎవరైనా సరే సరిగ్గా విశ్రాంతి తీసుకోలేరు. దీని ప్రత్యక్ష ప్రభావం రోజువారీ పనిలో కనిపిస్తుంది. అంతేకాదు ఆరోగ్యంపై కూడా చెడు ప్రభావాన్ని చూపుతుంది.

సరైన నిద్ర లేని వ్యక్తులు రోజంతా చిరాకుగా ఉంటారని తమ పనిపై దృష్టి పెట్టలేరని నిపుణులు చెబుతున్నారు. అలాగే నిద్ర సరిగా లేకపోవడం వల్ల కళ్ల కింద నల్లటి వలయాలు, తల నొప్పి, బరువు పెరగడం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఇవి కూడా చదవండి

ఎవరైనా సరే మానసిక స్థితిని చక్కగా ఉంచుకోవడానికి, రోజంతా శక్తివంతంగా ఉండటానికి రాత్రి సరైన నిద్ర పోవడం చాలా ముఖ్యం. పోషకాహార నిపుణురాలు దీప్శిఖా జైన్ తన సోషల్ మీడియాలో ఒక వీడియోను పంచుకుంటూ.. 10-3-2-1 ఫార్ములా గురించి చెప్పారు. దీని సహాయంతో నిద్రలో నాణ్యతను మెరుగుపరుచుకోవచ్చు.

నిద్రవేళకు 10 గంటల ముందు కాఫీ, టీలను తీసుకోవద్దు

కొంతమంది టీ లేదా కాఫీ తాగడానికి ఇష్టపడతారు. రోజుకు కనీసం 3 నుండి 4 సార్లు తీసుకుంటారు. కొంతమంది రాత్రి సమయంలో టీ లేదా కాఫీ తాగడానికి ఇష్టపడతారు. అయితే వీటి ప్రభావం నిద్రపై కనిపిస్తుంది. నిద్రకు 10 గంటల ముందు కెఫిన్ పదార్ధాలను తీసుకోకూడదని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే కెఫిన్ పదార్ధాలు మెదడులోని నిద్రను ప్రోత్సహించే గ్రాహకాలను అడ్డుకుంటుంది. నిద్ర పట్టడానికి ఆలస్యం లేదా నిద్రపోవడంలో ఆటంకం కలిగిస్తుంది.

నిద్రించడానికి 3 గంటల ముందు ఏమీ తినవద్దు

ప్రస్తుతం ప్రతి ఒక్కరిదీ బిజీబిజీ షెడ్యూల్‌. దీంతో ఆహారం తినేందుకు కూడా సమయం దొరకడం లేదు. అర్ధ రాత్రి కూడా ఆహారం తింటున్నారు. ఇలా చేయడం వలన నిద్ర ప్రభావితం అవుతుంది. ఎందుకంటే అలా చేయడం వల్ల శరీరంలో కార్టిసాల్, స్ట్రెస్ హార్మోన్లు విడుదలవుతాయి. జీర్ణక్రియపై కూడా ప్రభావం చూపుతుంది. దీని కారణంగా నిద్రపోవడంలో ఇబ్బంది ఏర్పడవచ్చు.

ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి

నిద్రపోవడానికి 2 గంటల ముందు మీ పనిని పూర్తి చేయండి

చాలా మంది రాత్రంతా మేల్కొని పని చేయడానికి ఇష్టపడతారు. పని ముగించిన తర్వాత మంచం మీద పడుకుంటారు. అయితే ఇది మీ నిద్రను కూడా ప్రభావితం చేస్తుంది. ఇలా చేయడం వల్ల ఆందోళన కలుగుతుంది. అందువల్ల నిద్రపోయే 2 గంటల ముందే పనిని పూర్తి చేసుకోవాలి.

నిద్రించడానికి 1 గంట ముందు స్క్రీన్‌ను ఉపయోగించవద్దు

ప్రస్తుతం ప్రతి ఒక్కరూ అర్థరాత్రి వరకు ఫోన్లు వాడుతున్నారు. కానీ దీని కారణంగా నిద్ర విధానం కూడా ప్రభావితమవుతుంది. అందువల్ల నిద్రపోయే 1 గంట ముందు మీ మొబైల్ ఉపయోగించడం మానేయాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..