Skin Care: వేడి నీటితో ముఖం కడుక్కుంటున్నారా? తస్మాత్ జాగ్రత్త .. ఈ విషయాలు ఇప్పుడే తెలుసుకోండి..
వింటర్ సీజన్‌లో తరచుగా వేడి నీళ్లతో స్నానం చేయడానికి ఇష్టపడతాం. వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కానీ వేడి నీరు ముఖంలోని..
వింటర్ సీజన్‌లో తరచుగా వేడి నీళ్లతో స్నానం చేయడానికి ఇష్టపడతాం. వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కానీ వేడి నీరు ముఖంలోని చర్మ కణాలను దెబ్బతీస్తుంది. శరీరం చర్మం కంటే ముఖం చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోవడం ద్వారా రిలాక్స్‌గా ఉండవచ్చు. అయితే ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల చర్మానికి అనేక సమస్యలు వస్తాయి. అందుకే నీటి ఉష్ణోగ్రతను తనిఖీ చేసిన తర్వాతనే ముఖాన్ని కడుక్కోవాలి. ముఖ చర్మంపై వేడి నీటి వల్ల కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మొటిమలు..
మన మొత్తం శరీరంలో ముఖ చర్మం అత్యంత సున్నితమైనది. ముఖం చర్మం కింద రక్త నాళాలు, కణాలు, రంధ్రాలు ఉంటాయి. వాటిపై వేడి నీటిని ఉపయోగించడం వల్ల చర్మ కణాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇది చర్మాన్ని చికాకుపెడుతుంది. ముఖంపై ఎరుపు దద్దుర్లు, మొటిమలు ఏర్పడే ప్రమాదం ఉంది.
చర్మం పొడిగా ఉంటుంది..
నిపుణుల అభిప్రాయం ప్రకారం, ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడగడం వల్ల చర్మంలోని ముఖ్యమైన సహజ నూనెలను తొలగిపోతాయి. ఇది మీ చర్మాన్ని పొడిగా మారుస్తుంది. అలాగే చర్మం పగుళ్లు రావచ్చు. వేడి నీరు రిలాక్స్‌గా అనిపిస్తుంది, అయితే ఇది చర్మానికి చాలా నష్టాలను కలిగిస్తుంది.
చర్మం దెబ్బతినే ప్రమాదం..
మీ ముఖాన్ని క్రమం తప్పకుండా వేడి నీటితో కడగడం వల్ల చర్మానికి అనేక సమస్యలు వస్తాయి. వేడి నీటిని ఉపయోగించడం వల్ల కొల్లాజెన్, సెబమ్ తగ్గడం ప్రారంభమవుతుంది. దీని వల్ల చర్మం దెబ్బతినడం ప్రారంభమవుతుంది. ఫలితంగా అకాల వృద్ధాప్యం ప్రారంభమవుతుంది.
ఈ చిట్కాలను పాటించాలి..
ముఖాన్ని వేడి నీటితో కగడవద్దు. తేలికపాటి ఉష్ణోగ్రత ఉన్న నీటిని ఉపయోగించాలి. అందుకే ముఖాన్ని కడిగే ముందు నీటి ఉష్ణోగ్రతలను తనిఖీ చేయాలి. అనంతరం ముఖాన్ని కడగాలి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..