AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Skin Care: చర్మాన్ని మరింత అందంగా మార్చుకోవాలంటే రాత్రి సమయంలో ఈ చిట్కాలను పాటించండి..

చర్మం కాంతివంతంగా, అందంగా ఉండాలంటే చర్మాన్ని సంరక్షించడం చాలా అవసరం. చాలా మంది చర్మ సంరక్షణ కోసం బ్యూటీ ప్రొడక్ట్స్ వాడతారు.

Skin Care: చర్మాన్ని మరింత అందంగా మార్చుకోవాలంటే రాత్రి సమయంలో ఈ చిట్కాలను పాటించండి..
Skin Care
Shiva Prajapati
|

Updated on: Nov 07, 2022 | 7:32 AM

Share

చర్మం కాంతివంతంగా, అందంగా ఉండాలంటే చర్మాన్ని సంరక్షించడం చాలా అవసరం. చాలా మంది చర్మ సంరక్షణ కోసం బ్యూటీ ప్రొడక్ట్స్ వాడతారు. ఇది చర్మాన్ని మరింత దెబ్బతీస్తుంది. మార్కెట్‌లో లభించే బ్యూటీ ప్రొడక్ట్స్‌లో కెమికల్స్ అధిక శాతంలో ఉంటాయి. ఒక్కోసారి మనం కోరుకున్న ఫలితం లభించదు. అయితే ముఖం కాంతివంతంగా ఉండేందుకు ఇంట్లోనే ఇలాంటి అనేక చర్యలు తీసుకోవచ్చు. మరి ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

రాత్రిపూట మేకప్ చేయకూడదు..

మహిళలు నిద్రపోయే ముందు ముఖం కడుక్కున్న తర్వాత బ్యూటీ ప్రొడక్ట్స్‌ను తరచుగా ఉపయోగిస్తారు. రాత్రి వేళ ముఖానికి రెస్ట్ ఇస్తే బాగుంటుంది. రాత్రి పడుకునేటప్పుడు ఎలాంటి ప్రోడక్ట్స్ వాడొద్దు. నిద్రలో చర్మ రంద్రాలు తెరుచుకుంటాయి. బ్యూటీ ప్రొడక్ట్స్ ఉపయోగించడం ద్వారా ఈ చర్మ రంద్రాలు మూసుకుపోతాయి. దీంతో చర్మంలో సమస్యలు తలెత్తుతాయి.

స్కిన్ టోనర్ ఉపయోగించాలి..

ముఖ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి టోనర్‌ని ఉపయోగించాలి. టోనర్‌ను అప్లై చేసేటప్పుడు, కాటన్ ప్యాడ్‌ని ఉపయోగించడం ఉత్తమం. దీన్ని మీ ముఖం, మెడపై అప్లై చేయాలి. ఇది చర్మం సహజ ph స్థాయిని సరిచేస్తుంది. బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవుల నుండి చర్మాన్ని రక్షిస్తుంది.

హ్యాండ్ క్రీమ్..

ముఖంలాగే చేతులకు కూడా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. అందమైన చేతుల కోసం హ్యాండ్ క్రీమ్ ఉపయోగించొచ్చు. ఇందుకోసం ముందుగా గోరువెచ్చని నీరు, సబ్బుతో చేతులను బాగా కడగాలి. ఆ తర్వాత శుభ్రమైన గుడ్డతో తుడుచుకోవాలి. ఆ తరువాత హ్యాండ్ క్రీమ్ అప్లై చేయాలి.

జుట్టును జాగ్రత్తగా చూసుకోవాలి..

రాత్రి పడుకునేటప్పుడు జుట్టు విరబోయొద్దు. సాధారణంగా మహిళలు నిద్రిస్తున్నప్పుడు జుట్టును విరబోస్తారు. ముఖానికి జుట్టుకి అప్లై చేసిన నూనె, ధూళి అంటుకుంటుంది. దీని కారణంగా ముఖంపై మొటిమలు వస్తాయి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
ఇంట్లో భార్యను అఖిల్ ఏమని పిలుస్తాడో తెలుసా?ముద్దుపేరు భలే ఉందిగా
ఇంట్లో భార్యను అఖిల్ ఏమని పిలుస్తాడో తెలుసా?ముద్దుపేరు భలే ఉందిగా
గంభీర్, అగార్కర్ సంచలన నిర్ణయం.. ఆప్లాన్స్ నుంచి వైభవ్ ఔట్..!
గంభీర్, అగార్కర్ సంచలన నిర్ణయం.. ఆప్లాన్స్ నుంచి వైభవ్ ఔట్..!
వార్నీ.. స్మార్ట్‌ఫోన్‌లోని ఈ చిన్న రంధ్రం ఉండేది అందుకేనా?
వార్నీ.. స్మార్ట్‌ఫోన్‌లోని ఈ చిన్న రంధ్రం ఉండేది అందుకేనా?
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..
శుభ గ్రహాల అనుకూలత..వారికి పెట్టుబడులకు బెస్ట్ టైమ్ ఇదే..!
శుభ గ్రహాల అనుకూలత..వారికి పెట్టుబడులకు బెస్ట్ టైమ్ ఇదే..!
నాకు బిగ్ బాస్ అంటే పిచ్చి..
నాకు బిగ్ బాస్ అంటే పిచ్చి..
కుంభ రాశి జీవితంలో ఊహించని మార్పు.. ఇది దేనికి సంకేతమో తెలుసా?
కుంభ రాశి జీవితంలో ఊహించని మార్పు.. ఇది దేనికి సంకేతమో తెలుసా?
బాబా వంగా జ్యోతిష్యం..శ్రావణ మాసంలో తలరాత మార్చుకునే రాశులివే!
బాబా వంగా జ్యోతిష్యం..శ్రావణ మాసంలో తలరాత మార్చుకునే రాశులివే!
పిల్లలు బాత్రూంలో ఎక్కువసేపు ఉంటున్నారా? తిట్టొద్దు.. ఏం చేయాలంటే
పిల్లలు బాత్రూంలో ఎక్కువసేపు ఉంటున్నారా? తిట్టొద్దు.. ఏం చేయాలంటే
‘రామాయణ’ కోసం మేకర్స్ కొత్త ప్రమోషనల్ ప్లాన్..
‘రామాయణ’ కోసం మేకర్స్ కొత్త ప్రమోషనల్ ప్లాన్..