Skin Care: మెరిసే మరియు ఆరోగ్యకరమైన చర్మం కోసం తులసి ఆకులను ఇలా ఉపయోగించండి..

హిందూ సంస్కృతిలో తులసి మొక్కకు ప్రత్యేక స్థానం ఇవ్వబడింది. పురాతన కాలం నుండి తులసి మొక్కను విష్ణువు ప్రతిరూపంగా పూజించడమే కాకుండా..

Skin Care: మెరిసే మరియు ఆరోగ్యకరమైన చర్మం కోసం తులసి ఆకులను ఇలా ఉపయోగించండి..
Skin Care Tips
Follow us

|

Updated on: Mar 14, 2023 | 6:52 PM

హిందూ సంస్కృతిలో తులసి మొక్కకు ప్రత్యేక స్థానం ఇవ్వబడింది. పురాతన కాలం నుండి తులసి మొక్కను విష్ణువు ప్రతిరూపంగా పూజించడమే కాకుండా.. మూలికగా కూడా ఉపయోగించడం జరుగుతుంది. అయితే, తులసి చర్మాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. చర్మ సంరక్షణ కోసం తులసిని ఉపయోగించి ఇంట్లోనే ఫేస్ ప్యాక్స్ తయారు చేసుకోవచ్చు. దానిని ఉపయోగించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. తులసి వల్ల చర్మానికి కలిగే ఉపయోగాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

చర్మాన్ని శుభ్రపరుస్తుంది..

తులసి ఆకులు చర్మంపై మురికిని తొలగించడంలో సహాయపడుతుంది. ఇది మీ చర్మానికి సహజమైన క్లెన్సర్‌గా పనిచేస్తుంది. తులసి ఆకులు చర్మంలోని మలినాలను తొలగించి శుభ్రపరచడంలో అద్భుతంగా పని చేస్తాయి. జిడ్డు చర్మం ఉన్నవారికి ఇది తొలగిస్తుంది. ఇంట్లోనే ఫేస్ మాస్క్‌ తయారు చేసుకుని, చర్మంపై అప్లై చేయాలి. తద్వారా చర్మం క్లీన్ అవుతుంది. తులసి ఆకులతో పెరుగు కలిపి బాగా మిక్స్ చేయాలి. ఆ ప్యాక్‌ను చర్మానికి అప్లై చేయడం ద్వారా చర్మం శుభ్రం అవుతుంది.

మొటిమలను నయం చేస్తుంది..

తులసి మొటిమలను తగ్గించడంలో సహాయపడుతుంది. యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో నిండిన తులసి మొటిమలను నివారిస్తుంది. ఇది అవాంఛిత నూనెను తొలగిస్తుంది. సహజమైన క్లెన్సర్‌గా పనిచేస్తుంది. మొటిమల వల్ల వచ్చే వాపులను కూడా తులసి ఆకులు నివారిస్తాయి.

ఇవి కూడా చదవండి

మెరిసే చర్మాన్ని అందిస్తుంది..

తులసి ఆకులు మీ మేని ఛాయను మెరుగుపరుస్తాయి. ప్రకాశవంతమైన చర్మాన్ని అందిస్తాయి. తులసి మీ చర్మాన్ని కాలుష్యం, UV కిరణాలు, ఇతర చర్మ వ్యాధుల నుండి రక్షిస్తుంది.

బ్లాక్ హెడ్స్ నివారిస్తుంది..

బ్లాక్ హెడ్స్ కారణంగా చాలా మంది చర్మ సమస్యలను ఎదుర్కొంటారు. ఇవి చనిపోయిన చర్మం, జిడ్డు చర్మంపై కనిపించే చిన్న గడ్డలను తొలగిస్తుంది. తులసి ఈ బ్లాక్‌హెడ్స్‌ను తొలగించి శుభ్రమైన, స్పష్టమైన చర్మాన్ని పొందడానికి సహాయపడుతుంది. తులసి బ్లాక్ హెడ్స్ ను మాత్రమే కాకుండా వైట్ హెడ్స్ ను కూడా తొలగిస్తుంది. 25 నుండి 30 తులసి ఆకులు, సమాన పరిమాణంలో వేప ఆకులు తీసుకోవాలి. వాటిని కలిపి గ్రైండ్ చేసి పేస్ట్ లా చేసి, దానికి ఒక చెంచా తేనె కలిపి పేస్ట్ లా చేసి ముఖానికి అప్లై చేయాలి.

మీ చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది..

తులసి ఆకులు సహజ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తాయి. తులసి మీ చర్మానికి పోషణను అందించే కొన్ని ముఖ్యమైన నూనెలను కలిగి ఉంటుంది. పొడి లేదా నిర్జలీకరణ చర్మం ఉన్న వారందరికీ ఇది మంచిది. సహజ తులసి ఆకులతో తయారు చేసిన మాస్క్‌లను ఉపయోగించడం వల్ల మీ చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. పొడిబారకుండా చేస్తుంది.

మరిన్ని జీవనశైలి వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
కేటీఆర్ పర్యటనకు డుమ్మా కొట్టిన వరంగల్ మేయర్..!
కేటీఆర్ పర్యటనకు డుమ్మా కొట్టిన వరంగల్ మేయర్..!
లగేజ్‌లో నూడుల్స్ ప్యాకెట్.... అనుమానంతో ఓపెన్ చేయగా..
లగేజ్‌లో నూడుల్స్ ప్యాకెట్.... అనుమానంతో ఓపెన్ చేయగా..
ఒక్కో డ్రింక్ బ్రహ్మాస్త్రమే.. ఈ 4 పానీయాలు తాగితే..
ఒక్కో డ్రింక్ బ్రహ్మాస్త్రమే.. ఈ 4 పానీయాలు తాగితే..
వెయిట్‌ చేయమంటున్న మహేష్ బాబు.! గిఫ్ట్ ప్యాక్‌ చేస్తున్న రాజమౌళి.
వెయిట్‌ చేయమంటున్న మహేష్ బాబు.! గిఫ్ట్ ప్యాక్‌ చేస్తున్న రాజమౌళి.
కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో తెలియదు - కేసీఆర్
కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో తెలియదు - కేసీఆర్